Homeఆంధ్రప్రదేశ్‌Vishnu Kumar Raju: క్రియాశీలక రాజకీయాలకు ఆ బిజెపి ఎమ్మెల్యే గుడ్ బై!

Vishnu Kumar Raju: క్రియాశీలక రాజకీయాలకు ఆ బిజెపి ఎమ్మెల్యే గుడ్ బై!

Vishnu Kumar Raju: బిజెపిలో( Bhartiya Janata Party) ఆయన సీనియర్ మోస్ట్ లీడర్. మొన్నటి ఎన్నికల్లో గెలిచేసరికి మంత్రి పదవి వస్తుందని భావించారు. పాత తరం బిజెపి నాయకుడు కావడంతో ఇట్టే అవకాశం ఇస్తారని అంచనా వేశారు. ఆపై చంద్రబాబుతో ఉన్న సాన్నిహిత్యంతో తనకి పదవి తప్పదని నమ్మకం పెట్టుకున్నారు. అయితే వివిధ సమీకరణలో భాగంగా ఆయనకు మంత్రి పదవి దక్కలేదు. బిజెపిలో సైతం తగినంత ప్రాధాన్యం లేదు. అందుకే వచ్చే ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకోవాలని ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. బిజెపిలో ఇది హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ ఎవరు ఆ నేత? అంటే విష్ణుకుమార్ రాజు. విశాఖ ఉత్తర నియోజకవర్గం బిజెపి ఎమ్మెల్యే.

* అప్పట్లో బీజేపీ శాసనసభ పక్ష నాయకుడిగా..
2014 ఎన్నికల్లో గెలిచారు విష్ణుకుమార్ రాజు ( Vishnu Kumar Raju)విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి. అప్పట్లో కూడా టిడిపి అధికారంలోకి వచ్చింది. బిజెపి రాష్ట్ర ప్రభుత్వంలో చేరింది. అప్పుడు కూడా రెండు మంత్రి పదవులు వచ్చాయి. ఒకటి కామినేని శ్రీనివాస్ కు ఇచ్చారు. ఇంకొకటి మాణిక్యాలరావు దక్కించుకున్నారు. విష్ణుకుమార్ రాజు శాసనసభ పక్ష నేతగా ఉండేవారు. అయితే టిడిపి భాగస్వామ్య పక్షంగా బిజెపి వ్యవహరించేది. చంద్రబాబు నాయకత్వాన్ని విష్ణుకుమార్ రాజు సమర్ధించేవారు. 2018లో ఎన్డీఏ నుంచి బయటకు వెళ్లిపోయింది తెలుగుదేశం. ఆ సమయంలో కూడా చంద్రబాబు పట్ల గౌరవం గానే ఉండేవారు విష్ణుకుమార్ రాజు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమంది బీజేపీ నేతలు చంద్రబాబుకు వ్యతిరేకంగా ప్రకటనలు చేసేవారు. ఆ సమయంలో సైతం విష్ణుకుమార్ రాజు చంద్రబాబుకు అనుకూలంగానే ప్రకటనలు చేసేవారు. 2024 ఎన్నికల్లో పొత్తు కుదరడం, టిడిపి కూటమి గెలవడంతో తనకు తప్పకుండా మంత్రి పదవి దక్కుతుందని ఆశలు పెట్టుకున్నారు విష్ణుకుమార్ రాజు. అయితే అటువంటిదేమీ లేకపోవడంతో తీవ్ర ఆవేదనతో ఉన్నారట.

* పార్టీలో ప్రాధాన్యం లేక..
భారతీయ జనతా పార్టీలో సైతం విష్ణుకుమార్ రాజుకు పెద్దగా ప్రాధాన్యత దక్కడం లేదు. అది ఆయనకు ఇబ్బందికరంగా మారింది. ఒకానొక దశలో బిజెపి రాష్ట్ర అధ్యక్ష పదవికి విష్ణుకుమార్ రాజు పేరు ప్రముఖంగా వినిపించింది. అయితే ఇప్పుడు పార్టీలో సైతం పెద్దగా ప్రాధాన్యత లేకపోవడం.. విశాఖకు వస్తున్న మెరుగైన ప్రాజెక్టులన్ని ఇతర ప్రాంతాలకు పరిమితం కావడంతో ప్రజల నుంచి ఓ రకమైన అసంతృప్తి స్వరం వినిపిస్తోంది. అనుకున్నది సాధించలేకపోతున్నానన్న ఆవేదన ఆయనలో ఉంది. అందుకే 2029 ఎన్నికల్లో క్రియాశీలక రాజకీయాలకు గుడ్ బై చెప్తానని అనుచరుల వద్ద వ్యాఖ్యానిస్తున్నారు. అయితే తన కుమార్తెను రంగంలోకి దించేందుకు రాజుగారు అలా మాట్లాడుతున్నారని అనుచరులు చెబుతున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో?

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular