India’s Growth: పేదరికం.. అప్పులు.. సవాళ్లు.. టెక్నాలజీ లేమి.. ఇంకా అనేక రకాల సమస్యలు.. ఇవన్నీ కూడా మన దేశాన్ని అనేక రంగాల్లో వెనక్కి లాగేవి. అమెరికా కన్నెర్ర చేస్తే భయపడాల్సిన పరిస్థితి.. పాకిస్తాన్ దాడులు చేస్తే ప్రతి దాడులు చేయకపోగా.. చర్చలు జరపాల్సిన దుస్థితి..
ఇప్పుడు అమెరికా కన్నెర్ర చేస్తే ఇబ్బంది పడాల్సిన పరిస్థితి లేదు. ఇతర దేశాల మీద ఆదరణ పడాల్సిన అవసరం లేదు. మరీ ముఖ్యంగా పాకిస్తాన్ లాంటి దేశం దాడులు చేస్తే సైలెంట్ గా ఉండాల్సిన దుస్థితి అంతకన్నా లేదు. ఒక రకంగా చెప్పాలంటే శక్తివంతమైన దేశంగా.. యుక్తివంతమైన దేశంగా భారత్ ఆవిర్భవించింది.. ప్రబల శక్తిగా ఎదుగుతోంది.. వాస్తవానికి భారత్ ఎదుగుదల ప్రపంచానికి ఒక దృఢమైన సంకేతమైనప్పటికీ.. ఇన్ని రోజులపాటు ప్రపంచం మీద పెత్తనం సాగించిన అమెరికాకు.. పెత్తనం సాగించాలి అనుకుంటున్న చైనాకు అది ఒక రకమైన కంటగింపు. ఎందుకంటే అమెరికా ప్రపంచం మీద పెత్తనాన్ని కొనసాగించాలి అనుకుంటుంది. గిట్టని దేశాల మీద యుద్ధాలు చేయాలనుకుంటుంది. ప్రపంచంలో సంపద మొత్తం తన వద్ద మాత్రమే పోగుపడాలని అనుకుంటుంది. అందువల్లే ఇన్ని విపత్కర పరిణామాలకు కారణమవుతుంది. ఇక చైనా కూడా అదే బాపతు.. చైనాకు, అమెరికాకు ఆర్థిక స్థిరత్వంలో స్వల్ప తేడా మాత్రమే ఉంది. బహుశా మరికొద్ది సంవత్సరాలలో జిడిపి, ఇతర వ్యవహారాలలో చైనా అమెరికాను మించి పోగలదు. ఇప్పటికే వస్తువుల తయారీలో, పారిశ్రామిక రంగంలో చైనా సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నది. అటు భారత్ నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న జపాన్ దేశాన్ని అధిగమించింది. అనతి కాలంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న జర్మనీ ని సైతం పక్కనపెట్టి ఆస్థానంలోకి రానుంది. ఒకరకంగా ఇది మంచి పరిణామం అయినప్పటికీ చైనా, అమెరికాకు ఇది నచ్చడం లేదు..
Also Read: Indian Economy: ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎలా ఎదగగలిగింది?
భయపడే రోజులు కాదు ఇవి
అమెరికా ఆర్థికంగా ఎదగడానికి ప్రధాన కారణం ఇతర దేశాలను తొక్కి పెట్టడమే. గతంలో సోవియట్ తో అమెరికా స్నేహం చేసింది. ఆ తర్వాత ప్రస్తుత పుతిన్ పాలిస్తున్న దేశాన్ని తొక్కి పెట్టడానికి డ్రాగన్ సహాయం తీసుకుంది. చైనాను అన్ని రకాలుగా వాడుకున్న తర్వాత.. చైనా ఎదుగుతున్న తర్వాత.. తొట్టి పెట్టడానికి భారత్ కు దగ్గరయింది.. భారత్ ఎదుగుతుంటే పాకిస్తాన్ కు సహాయం చేసింది. గతంలో అనేక సందర్భాలలో పాకిస్తాన్ కు వంత పాడింది. ఇక ఆసియాలో తనను మించి భారత్ ఎదిగితే.. అన్ని విభాగాలలో.. అన్ని విధాలుగా నష్టపోవాల్సి ఉంటుంది కాబట్టి.. చైనా అప్పుడప్పుడు సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడుతుంటుంది. భారత్ ను ఏకాకి చేయడానికి ప్రపంచ వేదికల వద్ద పిచ్చి పిచ్చి పనులు చేస్తూ ఉంటుంది. కాకపోతే ఇవన్నీ భారత్ చేయలేదు. చేసే అవకాశం లేదు. ఎందుకంటే వచ్చిన అవకాశాలను.. ఉన్న యువతరాన్ని.. ఉపయోగించుకుంటూ భారత్ తన అభివృద్ధికి బాటలు వేసుకుంటున్నది. వికసిత భారత లక్ష్యంగా అడుగులు వేస్తున్నది. జర్మనీని అధిగమించిన తర్వాత.. భారత్ వేసే అడుగులు అత్యంత ఆసక్తికరంగా ఉంటాయి. ఎందుకంటే ఆ తర్వాత టార్గెట్ చైనా నే.. చైనా ను బీట్ చేస్తే.. అమెరికాను కొట్టడం అంత కష్టం కాదు.. కాకపోతే ఈ పరమపద సోపానంలో ఆ దేశాలు వేసే ఎత్తుగడలను భారత్ సమర్థవంతంగా కాచుకోవాలి. అప్పుడే త్రివర్ణ పతాకం మరింత గొప్పగా రెపరెపలాడుతుంది!
శాస్త్ర సాంకేతిక సామర్థ్యాలు
ఒకప్పుడు శాస్త్ర సాంకేతిక సామర్ధ్యాలు అమెరికాకు మాత్రమే సొంతం అనుకునేవారు. చైనా మాత్రమే అలాంటి పనులు చేయగలదు అనుకునేవారు. చంద్రయాన్, ఆదిత్య మిషన్ల ద్వారా భారత్ ప్రపంచ దేశాలకు కొత్త పాఠాలు నేర్పింది. కరోనా సమయంలో వ్యాక్సిన్ తయారు చేయడం ద్వారా.. చైనా, అమెరికా గుత్తాధిపత్యానికి చెక్ పెట్టింది. కరోనా తర్వాత అత్యంత వేగంగా కోలుకుంది. చైనా స్వీయ నియంత్రణ వల్ల స్వదేశంలో ఆర్థిక కార్యకలాపాలను తొక్కి పెట్టింది. ఆ విషయాలను బయటకు రాకుండా చూసుకుంది.. కానీ భారత్ మాత్రం అలాంటి విధానాలకు పాల్పడకుండా.. సాధ్యమైనంతవరకు మహమ్మారి నుంచి పోరాటం చేస్తూ.. తన ఆర్థిక కార్యకలాపాలను వేగవంతం చేసింది. భారత్ చేసిన ఆ పనుల వల్లే ఫార్మరంగం అద్భుతమైన ప్రగతిని చూపించింది.. చైనాలో నిర్మాణరంగం నేలచూపులు చూస్తోంది. పారిశ్రామిక రంగాలది కూడా అదే పరిస్థితి. ఇక అమెరికాలో అయితే ఏ క్షణమైనా దివాలా తీసే పరిస్థితులు ఉన్నాయని అక్కడి మీడియా సంస్థలు చెబుతున్నాయి. కానీ మనదేశంలో అలా లేదు. అలా ఉండడానికి అవకాశం కూడా లేదు. ఎందుకంటే మన ఆర్థిక పునాదులు సమ్మిళితమైనవి.. దృఢమైనవి.. అంతకంటే బలమైనవి..