HomeNewsNew rule in cricket: క్రికెట్లో కొత్త నిబంధన..ఇకనుంచి ఇలా క్యాచ్ పడితే నాటౌట్..

New rule in cricket: క్రికెట్లో కొత్త నిబంధన..ఇకనుంచి ఇలా క్యాచ్ పడితే నాటౌట్..

New rule in cricket: క్రికెట్లో కొత్త నిబంధన ను తీసుకురావాలని అంతర్జాతీయ క్రికెట్ మండలి భావిస్తున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే దీనిని అధికారికంగా ఐసీసీ ఇంతవరకు ప్రకటించలేదు.

సోషల్ మీడియాలో, ప్రధాన మీడియాలో జరుగుతున్న చర్చ ప్రకారం క్రికెట్లో కొత్త నిబంధన తీసుకువచ్చేందుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే డీఆర్ఎస్, పవర్ ప్లే, స్లో ఓవర్ రేటు వంటి విధానాలను తీసుకొచ్చి క్రికెట్లో సమూల మార్పులకు శ్రీకారం చుట్టింది ఐసిసి. అయితే ఇప్పుడు ఫీల్డర్లు క్యాచ్ పట్టే విషయంలో కూడా ఒక కొత్త నిబంధనను అమల్లోకి తీసుకొస్తుందని తెలుస్తోంది. ఆ ప్రకారం బౌండరీ లైన్ వద్ద రెండు సార్లు బంతిని పుష్ చేసి పట్టే బన్నీ హాఫ్ క్యాచ్ లు చెల్లవని తెలుస్తోంది.. ఈ నిబంధన ప్రకారం ఫీల్డర్ బౌండర్ లైన్ లోపలికి వెళ్లి జంప్ చేసిన తర్వాత ఒకటి అటెంప్ట్ లో బంతిని పట్టుకోవాల్సి ఉంటుంది. అంతేకాదు బౌండర్ లైన్ లోపల ల్యాండ్ అవ్వాల్సి ఉంటుంది.. అలా కాకుండా రెండుసార్లు బంతిని పుష్ చేస్తే.. ఆ తర్వాత పట్టుకునే బన్నీ హాఫ్ క్యాచ్ లు ఇకనుంచి చెల్లవని తెలుస్తోంది..

Read Also: బవుమా గాయం తగ్గలేదా? నేటి మ్యాచ్ లో బ్యాటింగ్ చేస్తాడా?

ఎందుకు ఎత్తేసినట్టు

ఇటీవల కాలంలో బన్నీ హాఫ్ క్యాచ్ లను ఫీల్డర్ ఎక్కువగా పడుతున్నారు. ఇలాంటి క్యాచ్ ల వల్ల మ్యాచ్ స్వరూపాలు పూర్తిగా మారిపోతున్నాయి. అప్పటిదాకా గెలుపు దిశగా ఉన్న జట్లు ఓడిపోతున్నాయి. ఓటమి దిశగా ఉన్న జట్లు విజయాలు సాధిస్తున్నాయి. అయితే ఈ విధానాన్ని సవరించాలని ఇటీవల కాలంలో డిమాండ్లు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఐసీసీ ఎప్పటినుంచో ఈ నిబంధనలను సవరించడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే బన్నీ హాఫ్ క్యాచ్ విషయంలో సరికొత్త నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. జూలైలో సింగపూర్లో జరిగే వార్షిక సమావేశంలో దీనికి సంబంధించి కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని సమాచారం.

Read Also: భారత్ వృద్ధి.. చైనాకు కళ్ళ మంట.. అమెరికాకు ఒళ్ళు మంట.. ఎందుకంటే?

సరిగ్గా గత ఏడాది జరిగిన టి20 వరల్డ్ కప్ తుది పోరులో దక్షిణాఫ్రికా ఆటగాడు మిల్లర్ భారీ షాట్ కొట్టాడు. అది సిక్సర్ వెళ్తుందని అందరూ అనుకున్నారు. బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్న సూర్య కుమార్ యాదవ్ అమాంతం ఆ బంతిని బౌండరీ లైన్ తగలకుండా అడ్డుకున్నాడు. అంతేకాదు అమాంతం బౌండరీ లైన్ లోపలికి దునికి.. అదే సందర్భంలో బంతిని రెండుసార్లు పుష్ చేసి అందుకున్నాడు. సూర్య కుమార్ యాదవ్ పట్టిన క్యాచ్ మిల్లర్ ను అవుట్ చేసింది. అలా అవుట్ కావడంతో మిల్లర్ ఏడ్చు కుంటూ వెళ్లిపోయాడు. అతడు అవుట్ కావడంతో మ్యాచ్ మొత్తం ఇండియా వైపు టర్న్ అయింది. ఫలితంగా ఉత్కంఠ పరిస్థితుల మధ్య టీమిండియా విజయం సాధించింది. ఇక ఇటీవలి ఐపిఎల్ లో కూడా చాలామంది ప్లేయర్లు బన్నీ ఆఫ్ క్యాచ్ లు చాలానే పట్టారు. అయితే ఇకపై ఈ విధానం ఉండదని.. సింగిల్ పుష్ ద్వారానే ఫీల్డర్లు క్యాచ్ పట్టాలని.. డబుల్ పుష్ చేస్తే ఆ క్యాచ్ చెల్లదని ఐసిసి ఒక అంగీకారానికి వచ్చినట్టు తెలుస్తోంది. త్వరలో దీనిపై అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular