Homeఅంతర్జాతీయంIndians Stuck In Iran War Crisis: ఇరాన్‌లో చిక్కుకున్న భారతీయులు.. రమ్మన్నప్పుడు రాకుండా ఇప్పుడు...

Indians Stuck In Iran War Crisis: ఇరాన్‌లో చిక్కుకున్న భారతీయులు.. రమ్మన్నప్పుడు రాకుండా ఇప్పుడు గగ్గోలు..

Indians Stuck In Iran War Crisis: చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా ఉంది.. ఇరాన్‌లోని భారతీయుల పరిస్థితి. చదువుల కోసం, వ్యాపారాలు, ఉద్యోగాల కోసం వెళ్లినవారు, టూరిస్టులుగా వెళ్లినవారు యుద్ధం కారణంగా ఇరాన్‌లో చిక్కుకుపోయారు. 9 వేల మంది భారతీయులు ఇరాన్‌లో ఉన్నట్లు అంచనా. వీరీలో 3 వేల మంది విద్యార్థులు. వీరిని స్వదేశానికి తీసుకురావడానికి భారత ప్రభుత్వం నాలుగుసార్లు ప్రయత్నించింది. హెచ్చరికలు చేసింది. అయినా పెడచెవిన పెట్టారు. ఇప్పుడు యుద్ధం తీవ్రం కావడంతో స్వదేశానికి తీసుకెళ్లాలని గగ్గోలు పెడుతున్నారు. వారి కుటుంబ సభ్యులు కూడా ఆందోళన చెందుతున్నారు. మార్చి 9న శ్రీనగర్‌లో నిరసన చేపట్టారు.

Also Read: ఐపీఎల్ 16 రోజులేనా.. బీసీసీఐ ఇచ్చిన ట్విస్ట్ వెనుక అసలు కారణం ఇది

భారతీయుల పరిస్థితి ఇలా..
విద్యార్థులు, వ్యాపారులు, పర్యాటకులు కలిసి 9 వేల మంది ఉండగా, వీరిలో ఎక్కువగా కశ్మీర్, లక్నో నుంచి వెళ్లిన షియా ముస్లిలే ఎక్కువ. అక్కడ ఉన్నది కూడా షియాలే కావడంతో ధైర్యంగా ఉన్నారు. ‘ఇక్కడే ఉంటామని‘ వైరల్‌ వీడియోలు చేశారు, ఫిబ్రవరి 28 తర్వాత దాడులు తీవ్రమై కొందరు మరణించారు. శ్రీనగర్‌లో తల్లిదండ్రులు పెద్దఎత్తున ప్రదర్శనలు చేస్తూ మోదీ, ఒమర్‌ ప్రభుత్వాలను కోరారు.

ప్రభుత్వ హెచ్చరికలు ఇలా..
భారత ప్రభుత్వం ఇరాన్‌పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తూ నాలుగుసార్లు హెచ్చరించింది. జనవరి 5న మొదటి హెచ్చరిక చేసింది. అప్పటికే ఇరాన్‌పై యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి. దీంతో కొందరు స్వదేశానికి వచ్చారు. ఇక జనవరి 14న రెండో హెచ్చరిక చేసింది. భారత ఎంబసీలో 24/7 కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేసింది. సాయం కావాల్సినవారు సంప్రదించాలని తెలిపింది. కానీ విద్యార్థులు తిరస్కరించారు. ఫిబ్రవరి 14న మూడో హెచ్చరిక చేసింది. యుద్ధం తప్పేలా లేదని భారతీయులు స్వదేశానికి రావాలని తెలిపింది. అయినా స్పందించలేదు. ఇక ఫిబ్రవరి 23న మరో హెచ్చరిక చేసింది. యుద్ధం ఏ క్షణమైనా జరిగే పరిస్థితి ఉందని, భారతీయులు ఆర్మేనియాకు వెళ్లి అక్కడి నుంచి విమానాల్లో భారత్‌కు రావాలని తెలిపింది. అయినా స్పందన లేదు. ఫిబ్రవరి 28న యుద్ధం మొదలైంది. దీంతో టెహ్రాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ బాంబులు కురిపించాయి. దీంతో భారత్‌ అక్కడి భారతీయులను సురక్షిత ప్రాంతాలకు తరలించింది.

ముందస్తు మేల్కొని ఉంటే నష్టాలు తగ్గేవి. యుద్ధం తీవ్రమయ్యాక ఇప్పుడు కాపాడాలని ఆందోళన చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికీ ప్రయత్నిస్తోంది, డిప్లొమసీతో మిత్రదేశాల సహకారం తీసుకుంటుంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular