https://oktelugu.com/

Canada : కెనడాలో బహిష్కరణ భయం.. 70 వేల మంది విద్యార్థుల భవిష్యత్ ఏంటి?

కెనడా.. ప్రపంచంలో ఉన్నత చదువుల కోసం అమెరికా తర్వాత ఎక్కువ మంది విద్యార్థులు వెళ్లే దేశం ఇది. అయితే ఇటీవల కెనడా వలసలను తగ్గించుకోవాలని చూస్తోంది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : August 28, 2024 / 08:06 AM IST

    Canada protests

    Follow us on

    Canada : విదేశాల్లో ఉన్నత విద్య అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారికి అమెరికా, యూకే తర్వాత ఎక్కువ మంది వెళ్లే దేశం కెనడా. కరోన తర్వాత కెనడాకు వెళ్లే విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది.చదువులు కోసం వెళ్లే విద్యార్థులు అక్కడే ఉపాధి చూసుకుని సెటిల్‌ అవుతామని చూస్తున్నారు. దీంతో కెనడాలో విదేశాల నుంచి వచ్చిన వారి సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కెనడాలోని జస్టిన్‌ ట్రూడో ప్రభుత్వం వలసల తగ్గిపుపై దృష్టిపెట్టింది. ఇప్పటికే యూనివర్సిటీల ఫీజు పెంచింది. తర్వాత కెనడా వచ్చేవారు చూపించాల్సిన బ్యాంకు బ్యాలెన్స్‌ లిమిట్‌ పెంచింది. తర్వాత కెనడాలో ఇంటి అద్దెలను కూడా భారీగా పెంచింది. తర్వాత కెనడాలో పార్ట్‌టైం జాబ్‌ చేసేవారి పని గంటలు తగ్గించింది. ఇలా అనేక చర్యలు తీసుకున్న ట్రూడో.. ఇప్పుడు వలసల కుదింపు చర్యలు వేగవంతం చేశారు. ఈ నిర్ణయం 70వేల మంది విదేశీ విద్యార్థులపై ప్రభావం చూపనున్నట్లు అంచనా. దీంతో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోన్న విదేశీ విద్యార్థులు నిరసనల బాటపట్టారు. ప్రిన్స్‌ ఎడ్వర్డ్‌ ఐలాండ్తో పాటు, అంటారియో, మనితోబా, బ్రిటిష్‌ కొలంబియాల్లో నిరసన ర్యాలీలు చేపట్టారు.

    కొత్త మార్గాల అన్వేషణ..
    విదేశీ కార్మికుల సంఖ్యను తగ్గించుకునే యోచనలో ఉన్న కెనడా.. అందుకోసం అనేక మార్గాలను అన్వేషిస్తోంది. ఇటీవల హలీప్యాక్సో్ల జరిగిన కేబినెట్‌ సమావేశంలో ఇదే అంశంపై ట్రూడో ప్రభుత్వం చర్చించింది. ఇందులో భాగంగా విదేశీ వర్కర్ల విధానంలో మూడు మార్పులు చేయగా.. అవి సెప్టెంబర్‌ 26 నుంచి అమల్లోకి రానున్నాయి. కొత్త నిబంధనలు నిర్మాణ, ఆరోగ్య, ఆహార భద్రత రంగాల్లో పనిచేసే కార్మికులకు మినహాయింపు ఉంటుందని ప్రధాని ట్రూడో పేర్కొన్నారు. ఉపాధి కోసం చూస్తున్న కెనడియన్లతోపాటు విదేశీ తాత్కాలిక కార్మికుల సంఖ్య గణనీయంగా పెరగడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తక్కువ వేతన విదేశీ కార్మికులపై ఆధారపడటం కంటే శిక్షణ, సాంకేతికలపై కెనడా వ్యాపార సంస్థలు పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. అంతేకాకుండా శాశ్వత నివాసితుల అనుమతుల్లోనూ గణనీయ మార్పులపై కేబినెట్లో చర్చిస్తున్నట్లు చెప్పారు.

    ఏడాది క్రితం కూడా..
    సరిగ్గా ఏడాది క్రితం కూడా ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో భారతీయ విద్యార్థులు ఆందోళన చేశారు. 2023, జూన్‌ 8న కెనడా నుండి బహిష్కరణ భయంతో భారతీయ విద్యార్థులు నిరసనలు చేపట్టారు. మే 29 నుండి ‘నిరవధిక సిట్‌–ఇన్‌‘ కోసం సీబీఏ ప్రధాన కార్యాలయం వెలుపల మిస్సిసాగాలోని ఎయిర్‌పోర్ట్‌ రోడ్‌లో గుమిగూడారు. బ్రాంప్టన్‌లో పలువురు భారతీయ విద్యార్థులు నిరసన ప్రదర్శన చేపట్టారు. 700 మంది భారతీయ విద్యార్థులకు బహిష్కరణ నోటీసులు ఇవ్వడంతో ఆందోళన చేశారు. తాజాగా మళ్లీ అదే పరిస్థితులు ఏర్పడుతున్నాయి.