Horoscope Today: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. బుధవారం ద్వాదశ రాశులపై మృగశిర నక్షత్ర ప్రభావం ఉంటుంది.ఈరోజు చంద్రుడు మిథున రాశిలో సంచారం చేస్తాడు. ఈరోజు మహా లక్ష్మీ యోగం కారణంగా మిథునం, సింహం సహ కొన్ని రాశుల వారికి అమ్మవారి అనుగ్రహం ఉండనుంది. మరికొన్ని రాశుల వారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మేషం నుంచి మీనం వరకు 12 రాశుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి:
ఈ రాశి వారు ఆర్థికంగా పుంజుకుంటారు. పిల్లల భవిష్యత్ గురించి ఆలోచిస్తారు. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలంటే అనుకూల సమయం. స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు.
వృషభ రాశి:
నచ్చని పనుల జోలికి వెళ్లకుండా ఉండడమే మంచిది. ఆదాయం పెరుగుతుంది. వ్యాపారం కోసం ఈరోజు ప్రయాణాలు ఉంటాయి. సోదరుడి వివాహ ప్రయత్నాలు జోరుగా సాగుతాయి.
మిథున రాశి:
ఉద్యోగులకు తోటివారి సాయం ఉంటుంది. ఇంటి అవసరాల కోసం ఖర్చులు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. జీవిత భాగస్వామి కోసం బహుమతిని కొనుగోలు చేస్తారు.
కర్కాటక రాశి:
విద్యార్థుల కెరీర్ గురించి కీలక నిర్ణయం తీసరకుంటారు. వ్యాపారం కోసం తీసుకునే నిర్ణయాలు లాభిస్తాయి. కాంట్రాక్ట్ ఉద్యోగులకు ప్రమోషన్ లభించే అవకాశం. సంబంధాలు మెరుగుపడుతాయి. జీవిత భాగస్వామి కోసం బహుమతిని కొనుగోలు చేస్తారు.
సింహారాశి:
వ్యాపారులు కొన్ని రిస్క్ లు తీసుకోవాల్సి ఉంటుంది. ఉద్యోగులకు అధికారుల మద్దతు ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. ఖర్చులు కూడా అధికంగానే ఉంటాయి.
కన్య రాశి:
ఉద్యోగులు కార్యాలయాల్లో తమకు విధించిన బాధ్యతలు పూర్తి చేయాలి. లేకుండా అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. తల్లిదండ్రుల ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.
తుల రాశి:
వ్యాపారుల పెట్టుబులు లాభాలు తెస్తాయి. ఇంటి అవసరాలకు ఖర్చులు పెరుగుతాయి. జీవిత భాగస్వామి కోసం విలువైన వస్తువు కొనుగోలు చేస్తారను. ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడుతారు.
వృశ్చిక రాశి:
వ్యాపారులకు అనుకోని లాభాలు ఉంటాయి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ఉద్యోగులకు అధికారుల నుంచి ప్రశంసలు వస్తాయి. ఆర్థికంగా పుంజుకుంటారు. స్నేహితులతో సరదాగా గడుపుతారు.
ధనస్సు రాశి:
ప్రియమైన వారి కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. కుటుంబ సభ్యులంతా కలిసి విహార యాత్రకు వెళ్తారు. ఆర్థికంగా పుంజుకుంటారు. వివాహ ప్రయత్నాలు సాగుతాయి.
మకర రాశి:
ఆర్థిక లాభాలు ఉంటాయి. విద్యార్థులు తోటి వారితో సంతోషంగా ఉంటారు. పెండింగ్ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. పరీక్షలకు సిద్ధమయ్యే వారు శుభవార్తలు వింటారు. శత్రువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
కుంభరాశి:
బంధువులతో సరదాగా గడుపుతారు. ఉద్యోగులు సమస్యల నుంచి బయటపడుతారు. రాజకీయాల్లో ఉండే వారికి ప్రజల మద్దతు లభిస్తుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యులతో సంబంధాలు పెంచుకునే ప్రయత్నం చేయాలి.
మీనరాశి:
వ్యాపారులు తీసుకునే నిర్ణయాల వల్ల లాభాలు ఉంటాయి. ఇంటికి అతిథులు వస్తారు. సాయంత్రం ఉల్లాసంగా ఉంటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పెండింగ్ పనులను పూర్తి చేస్తారు.