Homeఅంతర్జాతీయంUK Nurse: నేనొక దెయ్యాన్ని.. ఏడుగురు పిల్లలను చంపిన బ్రిటిష్‌ నర్సును పట్టించిన భారతీయ వైద్యుడు

UK Nurse: నేనొక దెయ్యాన్ని.. ఏడుగురు పిల్లలను చంపిన బ్రిటిష్‌ నర్సును పట్టించిన భారతీయ వైద్యుడు

UK Nurse: సాధారణంగా ఆస్పత్రిలో ఉండే వైద్యులు, వైద్య సిబ్బంది రోగి ప్రాణాలు కాపాడటం కోసం, రోగి రోగాన్ని నయం చేయడం కోసం తీవ్రంగా శ్రమిస్తారు. కానీ ఆ ఆస్పత్రిలోని నర్సు మాత్రం ఆస్పత్రిలో పుట్టిన నవజాత శిశువులను చంపడమే పనిగా పెట్టుకుంది. అలా ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఏడుగురు చిన్నారులను చంపేసింది. ఏ పాపం తెలియని అమాయకపు శిశువులను అమానుషంగా చంపేసిన ఘటన ఇంగ్లండ్‌ లో చోటు చేసుకుంది. తనను తాను ‘భయంకరమైన దుష్ట వ్యక్తి‘ గా అభివర్ణించిన బ్రిటిష్‌ నర్సు శుక్రవారం ఏడుగురు నవజాత శిశువులను హత్య చేసింది. ఆమె పనిచేసిన వాయువ్య ఇంగ్లాండ్‌లోని ఆసుపత్రిలోని నియోనాటల్‌ యూనిట్‌లో మరో ఆరుగురిని చంపడానికి ప్రయత్నించింది. లూసీ లెట్బీ, 33, కౌంటెస్‌ ఆఫ్‌ చెస్టర్‌ హాస్పిటల్‌లో ఐదుగురు బేబీ బాయ్స్, ఇద్దరు ఆడపిల్లలను చంపినందుకు మరియు ఇతర నవజాత శిశువులపై దాడి చేసినందుకు దోషిగా నిర్ధారించింది.

రాత్రి షిఫ్టులో…
ఇంగ్లండ్‌ లోని నార్త్‌ వెస్టర్న్‌ ఇంగ్లీష్‌ సిటీలో ఉన్న స్థానిక ఆస్పత్రిలో లూసీ లెట్‌ బే అనే యువతి నర్సుగా విధులు నిర్వహించేది .ఆ ఆస్పత్రిలో అప్పుడే పుట్టిన చిన్నారులు వరుసగా చనిపోతూ ఉండేవాళ్లు. మొదట నవజాత శిశువుల మరణాలు సహజ మరణాలే అని అందరూ భావించినా ఆ తరువాత కొంతమందికి ఆ ఆస్పత్రిలోని నర్సు లూసీపై అనుమానం వచ్చింది. పోలీసులు నవజాత శిశువుల మరణాలపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నర్సు లూసీ లెట్‌ బేను పోలీసులు విచారించగా ఆమె ఎనిమిది మంది చిన్నారులను చంపేసినట్లు పదిమంది చిన్నారులను చంపడానికి ప్రయత్నం చేసినట్లు తేలింది. కౌంటెస్‌ ఆఫ్‌ చెస్టర్‌ దవాఖానాలోని నియోనాటల్‌ యూనిట్‌ లో 2015 జూన్‌ నెల నుంచి 2016 జూన్‌ నెల మధ్యలో లూసీ చిన్నారులను చంపేసింది. రాత్రి షిఫ్టుల్లో ఈ హత్యలు చేసింది. కొంతమందిని ఇన్సులిన్‌తో ఇంజెక్ట్‌ చేయడం ద్వారా విషపూరితం చేశారని, మరికొందరు గాలి లేదా ఫోర్స్‌ ఫెడ్‌ పాలతో ఇంజెక్ట్‌ చేసి చంపినట్లు గుర్తించారు.

నర్సును పట్టుకోవడానికి భారతీయ డాక్టర్‌ సాయం..
ఏడుగురు నవజాత శిశువులను చంపిన ‘చెడు‘ నర్సును పట్టుకోవడంలో భారతీయ డాక్టర్‌ కీలకంగా వ్యవహరించారు. చెస్టర్లోని కౌంటెస్‌ ఆఫ్‌ చెస్టర్‌ హాస్పిటల్‌కు చెందిన డాక్టర్‌ రవి జయరామ్‌ మాజీ నర్సు సహోద్యోగి లూసీ లెబీతో మాట్లాడి.. ఆమెలోని ఆందోళనలు గ్రహించి లూసీ హత్య చేసినట్లు నిర్ధారించారు. ఈమేరకు పోలీసులను అప్రమత్తం చేశారు. జయరామ్‌ కోర్టులో మాట్లాడుతూ, అతను ‘చాలా అసౌకర్యంగా‘ భావించానని మరియు శిశువు యొక్క ఆక్సిజన్‌ స్థాయిలు పడిపోతున్నప్పుడు లెట్బీ ‘ఏమీ చేయలేదని‘ కనుగొన్నట్లు నివేదించారు.

కావాలనే చంపానని..
విచారణలో నర్సు తాను చిన్నారులను ఉద్దేశపూర్వకంగా చంపానని అంగీకరించింది. ఎందుకంటే నేను వారిని చూసుకోవటానికి సిద్ధంగా లేను అని ఆమెను అరెస్టు చేసిన తర్వాత తెలిపింది. ఆమె ఇంటిని శోధించిన పోలీసు అధికారులు కనుగొన్న చేతితో రాసిన నోట్‌ గుర్తించారు. ‘నేను భయంకరమైన దుష్ట వ్యక్తిని‘ అని ఆమె రాసింది.
నర్సు చంపిన వారిలో కొందరు కవలలు ఉన్నారు. లూసీ హత్య చేసినట్లు సాక్ష్యాలు లభించడంతో పోలీసులు ఆమెను అరెస్ట్‌ చేసి ఈరోజు మేజిస్ట్రేట్‌ ముందు హాజరు పరచనున్నారు. ఈమెను కఠినంగా శిక్షించాలని స్థానికులు కోరుకుతున్నారు. అభంశుభం తెలియని ఎనిమిది మంది చిన్నారులను చంపేయడంతో ఆమె మానసిక స్థితిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version