Pawan Kalyan OG Movie: పవన్ కళ్యాణ్ ఫ్యాన్ బాయ్ సుజీత్ తెరకెక్కిస్తున్న చిత్రం ఓజీ. ఈ మూవీ ఒక్కో అప్డేట్ గూస్ బంప్స్ లేపుతున్నాయి. పవన్ కళ్యాణ్ కెరీర్లో భారీ చిత్రంగా ఓజీ నిలిచే సూచనలు కలవు. పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ అనంతరం విడుదల కానున్న ఫస్ట్ స్ట్రైట్ మూవీ ఓజీ. ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అనేది ట్యాగ్ లైన్. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ గ్యాంగ్ స్టర్ రోల్ చేస్తున్నారు. ముంబై, జపాన్ నేపథ్యంలో సినిమా సాగనుందని సమాచారం. ఓజీ 50 శాతం షూటింగ్ జరుపుకున్నట్లు తెలుస్తుంది.
ఇదిలా ఉంటే ఈ మూవీ గురించి ఆసక్తికర వార్త బయటకు వచ్చింది. ఓజీ చిత్రాన్ని దర్శకుడు సుజీత్ రెండు భాగాలుగా ప్లాన్ చేస్తున్నాడట. బలమైన కథను రెండు భాగాల్లో చెప్పే స్కోప్ ఉండగా సుజీత్ అలా డిసైడ్ అయ్యాడట. ఇందుకు నిర్మాతతో పాటు పవన్ కళ్యాణ్ ఒప్పుకోవడంతో ఓజీ పార్ట్ 2 కూడా ఉంటుందని టాలీవుడ్ టాక్. మరి అదే నిజమైతే బాక్సాఫీస్ బద్దలు కావడం ఖాయం. పవన్ కళ్యాణ్ స్ట్రైట్ మూవీ చేయాలని ఫ్యాన్స్ ఆశపడుతుండగా… వాళ్ళ అంచనాలకు మించి ఓజీని సిద్ధం చేస్తున్నారు.
మరో విశేషం ఏమిటంటే… దాదాపు ఏడు నిమిషాల యాక్షన్ ఎపిసోడ్ తో పవన్ కళ్యాణ్ ఎంట్రీ ప్లాన్ చేశారట. అంటే వస్తూనే పవన్ విలన్స్ ని దుమ్ములేపనున్నాడట. సుదీర్ఘ ఫైట్ సీజ్స్ ఆడియన్స్ ని కుదురుగా ఉండనీయదట. ఫ్యాన్స్ కి అయితే పండగే అంటున్నారు. మొత్తం మీద నాలుగు భారీ యాక్షన్ సీక్వెన్స్లు ఉండనున్నాయట. ఇవి సినిమాకే హైలెట్ గా నిలుస్తాయని సమాచారం. మొత్తంగా ఓజీ నుండి వస్తున్న ఒక్కో న్యూస్ సినిమా మీద అంచనాలు పెంచేస్తుంది.
ఆర్ ఆర్ ఆర్ నిర్మాత డివివి దానయ్య ఓజీ చిత్ర నిర్మాతగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ కి జంటగా ప్రియాంక అరుళ్ మోహన్ నటిస్తుంది. ఓజీ వచ్చే ఏడాది ప్రారంభంలో విడుదల కావచ్చని అంటున్నారు. ఓజీతో పాటు పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్, హరి హర వీరమల్లు చిత్రాల్లో నటిస్తున్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ సంక్రాంతి కానుకగా విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక హరి హర వీరమల్లు 2024 ఎన్నికల అనంతరం విడుదల కానుంది.