https://oktelugu.com/

Donald Trump: భారతీయ ఉద్యోగులు దోపిడీదారులు.. రెండు రోజుల్లోనే మాట మార్చి నాలుక మడతెట్టేసిన ట్రంప్

అమెరికా అధ్యక్ష ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఇక ప్రచారం ఫినిషింగ్‌లో రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి భారతీయ అమెరికన్‌ ఓట్ల కోసం దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. భారత్‌తో బలమైన బంధం ఏర్పరుచుకుంటామని ప్రకటించారు. కానీ రెండు రోజుల్లోనే విషం కక్కారు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : November 3, 2024 / 10:40 AM IST

    Donald Trump

    Follow us on

    Donald Trump: అమెరికా అధ్యక్ష ఎన్నికలు నవంబర్‌ 5న జరుగనున్నాయి. ఎన్నికల ప్రచారం అక్టోబర్‌ 30 ముగిసింది. అయితే సోషల్‌ మీడియా వేదికగా అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే రెండు రోజుల క్రితం రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ భారతీయ అమెరికన్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. భారతీయులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. బంగ్లాదేశ్‌లో హిందువులై జరిగిన దాడిని ఖండించారు. తాను అధ్యక్షుడిగా గెలిస్తే హిందువులకు అంగా ఉంటానని, భారత్‌తో బందాన్ని మరింత బలపరుస్తానని తెలిపారు. మోదీ తనకు మంచి మిత్రుడని కూడా పేర్కొన్నారు. దీంతో తటస్థ భారతీయ అమెరికన్‌ ఓ టర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. కానీ, ట్రంప్‌ ద్వంద్వ వైఖరిని రెండు రోజులకే బయట పెట్టారు. భారతీయులపై తాజాగా తీవ్ర విమర్శలు చేశారు. అమెరికన్ల ఉద్యోగాలను దోచుకుంటున్న దొంగలుగా భారతీయులను అభివర్ణించారు.

    పోలింగ్‌కు కొన్ని గంటల ముందు..
    అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్‌ మరి కొన్ని గంటల్లో జరుగనుంది. ఈ ఎన్నికల్లో విజయం సాధించేందుకు రిపబ్లికన్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్, డెమొక్రటిక్‌ పార్టీ అభ్యర్థి కమలా హారిస్‌ హోరాహోరీగా ప్రచారం చేశారు. ఓటర్లకు హామీలు ఇచ్చారు. ట్రంప్‌ మొదటి నుంచి వలసల వ్యతిరేక విధానం అవలంబిస్తున్నారు. అయితే ఇప్పటికే సెటిల్‌ అయిన ఓటర్లను దూరం చేసుకోకుండా ఆచితూచి వ్యవహరిస్తున్నారు. కానీ, ఎన్నికలకు కొన్ని గంటల ముందు భారతీయులపై ఉన్న అక్కసు వెల్లగక్కారు. భారతీయులపై తనకు ఉన్న అక్కసు బయటపెట్టారు. అందుకు ట్రంప్‌ తన మీడియా అండ్‌ టెక్నాలజీ గ్రూప్‌కు చెందిన మేక్‌ అమెరికా గ్రేట్‌ అగైన్‌ వీడియోను వినియోగిస్తున్నారు.

    వీడియో సందేశంలో ఆరోపణ..
    తాజాగా మాగా వీడియో, ట్రంప్‌కు మద్దతు పలికిన పలు ఆర్థిక వేత్తలతో ట్రంప్‌ తరఫున ప్రచారం చేసింది. ఈ ప్రచారంలో గతేడాది అమెరికన్లు 8 లక్షల ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. అదే సమయలో విదేశీయులు 10 లక్షల ఉద్యోగాలు పొందారు. అమెరికా లేబర్‌ మార్కెట్‌ విదేశీ కార్మికులు, ప్రభుత్వ బ్యూరోక్రాట్లకు తాత్కాలిక ఏజెన్సీగా మారుతుందని మాగా వీడియో ఈవెంట్‌లో ట్రంప్‌ మద్దతుదారుడు ఆర్థికవేత్త ఈజే ఆంటోనీ ఆరోపించారు.

    భారతీయ ఐటీ ఉద్యోగులపై..
    ఇక మరోవైపు అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న భారతీయులపై అమెరికన్లలో విద్వేషపూరితంగా వ్యవహరిస్తున్నారు. శాన్‌ఫ్రాన్సిస్‌కో ఫినెక్‌ ఎగ్జిక్యూటివ్‌ షీల్‌ మెహ్నూట్‌ మాట్లాడుతూ టెక్సాస్‌లో భారతీయులు సేవలందిస్తున్న ఓ బ్యాంక్‌పై విమర్శలు చేశారు. వారందరూ వచ్చే ఏడాది భారత దేశానికి తిరిగి వెళ్తారు. అందరినీ తిరిగి ఇంటికి పంపాలి. అని పేర్కొన్నారు. వారి ఆస్తులను స్వాధీనం చేసుకుంటామని ప్రకటించారు. అందరినీ గుజరాత్‌కు పంపుతామని వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.