https://oktelugu.com/

New Ration Cards: ఏపీలో జనవరికి కొత్త రేషన్ కార్డులు.. పాతవి రద్దు.. అర్హతలు ఇవే

కొత్త రేషన్ కార్డుల జారిపై ఏపీ ప్రభుత్వం దృష్టి సారించింది. వైసిపి ప్రభుత్వం వేల దరఖాస్తులను పెండింగ్ లో ఉంచింది. వాటిపై తాజాగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సంక్రాంతి నాటికి కొత్త రేషన్ కార్డులు అందించనుంది.

Written By:
  • Dharma
  • , Updated On : November 3, 2024 / 10:51 AM IST

    New Ration Cards

    Follow us on

    New Ration Cards: టిడిపి కూటమి ప్రభుత్వం దూకుడు పెంచుతోంది. అభివృద్ధితోపాటు సంక్షేమ పథకాలపై దృష్టి పెట్టింది. కొత్త రేషన్ కార్డుల మంజూరు పై అధికార యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది.అర్హతలను సైతం ఖరారు చేసింది. పాత రేషన్ కార్డులను రద్దు చేసి వాటి స్థానంలో కొత్తవి జారీ చేయనుంది. సంక్షేమ పథకాల అమలు విషయంలో రేషన్ కార్డు ప్రాతిపదికగా తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో అర్హతల విషయంలో ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తోంది. సంక్రాంతి నాటికి కొత్త రేషన్ కార్డుల మంజూరు పై ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. అర్హత కలిగిన వారికి కొత్త కార్డులు ఇవ్వాలని నిర్ణయించింది. కొత్తగా వివాహం చేసుకున్న జంటలతో పాటుగా ప్రభుత్వ నిర్దేశిత మార్గదర్శకాలకు అనుగుణంగా.. అర్హులందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డులను రీ డిజైన్ చేసి అందించనున్నారు. అంటే రేషన్ కార్డు రంగు, ముద్ర మారనందన్నమాట. అయితే ఈ విషయంలో ప్రభుత్వం పై భారం పడకుండా పౌరసరఫరాల శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు.

    * మారనున్న రంగు
    సాధారణంగా ప్రభుత్వం మారిన ప్రతిసారి రేషన్ కార్డుల పై రంగు మారడం పరిపాటిగా ఉంది. ఇప్పటికే లేత పసుపు రంగు కార్డు పై రాష్ట్ర అధికారిక చిహ్నాన్ని ముద్రించిన నమూనాను ప్రభుత్వ ఆమోదానికి పంపారు. గత ప్రభుత్వంలో కొత్త కార్డుల కోసం 30,611 దరఖాస్తులు వచ్చాయి. మరోవైపు సభ్యుల చేర్పుల కోసం రెండు లక్షల పదమూడు వేల దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. అదే సమయంలో తొలగింపు కోసం 36,588 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. అడ్రస్ మార్పు కోసం 8263 దరఖాస్తులు వచ్చాయి.ఇక కార్డు సరెండర్ కోసం వచ్చినవి 685. మొత్తం మూడు లక్షల 36 వేల దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నట్లు అధికారులు ప్రభుత్వానికి నివేదించారు.

    * అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ..
    ఎట్టి పరిస్థితుల్లో సంక్రాంతి నాటికి కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో 1.48 కోట్ల తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి. వాటిల్లో 90 లక్షల కార్డులను జాతీయ ఆహార భద్రత చట్టం కింద గుర్తించారు. వీటికి ఉచిత బియ్యం, కందిపప్పు,పంచదార తదితర సరుకులు అందుతున్నాయి. మిగిలిన కార్డులకు ఉచిత బియ్యంతో పాటు కందిపప్పు,పంచదార,జొన్నలు, రాగులు తదితర సరుకులు అందుతున్నాయి.వీటిపై ఇస్తున్న సబ్సిడీ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తోంది. అందుకే తాజాగా రేషన్ కార్డుల జారీ విషయంలో ప్రభుత్వం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటోంది. అదనపు భారం పడకుండా కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ పూర్తిచేయాలని నిర్ణయించింది.