Homeఎంటర్టైన్మెంట్Ravi Teja And Nithiin: కలసిరాని కమ్ బ్యాక్.. రవితేజకు జరిగిందే నితిన్ కి కూడా!

కలసిరాని కమ్ బ్యాక్.. రవితేజకు జరిగిందే నితిన్ కి కూడా!

Ravi Teja And Nithiin: సెంటిమెంట్స్ మూఢాచారం అని కొందరు కొట్టిపారేస్తారు. కానీ పరిశ్రమ ఈ సెంటిమెంట్ ని బలంగా నమ్ముతుంది. స్టార్ హీరోలు, హీరోయిన్స్, దర్శక నిర్మాతలు సెంటిమెంట్స్ ని గట్టిగా ఫాలో అవుతారు. కాగా ఈ సెంటిమెంట్ ఇద్దరు హీరోలు బలయ్యారు. ఒకప్పటి స్టార్ హీరోయిన్స్ కమ్ బ్యాక్ వారికి కలిసి రాలేదు. వారు రీ ఎంట్రీ ఇచ్చిన రెండు చిత్రాలు పరాజయం పాలయ్యాయి. ఇంతకీ ఆ ఇద్దరు హీరోయిన్స్ ఎవరంటే రేణు దేశాయ్, లయ.

Also Read: సుకుమార్ వల్లే అల్లు అర్జున్ స్టార్ అయ్యాడు అంటూ రాఘవేంద్ర రావు వివాదాస్పద వ్యాఖ్యలు!

పవన్ కళ్యాణ్(PAWAN KALYAN) ని ప్రేమ వివాహం చేసుకున్న రేణు దేశాయ్ సిల్వర్ స్క్రీన్ కి దూరమైన సంగతి తెలిసిందే. బద్రి ఆమె మొదటి చిత్రం. ఆ సినిమా షూటింగ్ లో పవన్ కళ్యాణ్-రేణు దేశాయ్(RENU DESAI) ప్రేమలో పడ్డారు. ఆపై వివాహం చేసుకున్నారు. కమిటైన ఓ తమిళ చిత్రాన్ని చేసిన రేణు దేశాయ్ నటనకు గుడ్ బై చెప్పింది. ఇక విడాకుల అనంతరం రేణు దేశాయ్ పూణేలో సెటిల్ అయ్యారు. ఓ రెండు మూడేళ్ళ క్రితం ఆమె హైదరాబాద్ కి మకాం మార్చారు. దాదాపు రెండున్నర దశాబ్దాల అనంతరం రేణు దేశాయ్ మేకప్ వేసుకున్నారు.

రవితేజ(RAVITEJA) హీరోగా తెరకెక్కిన టైగర్ నాగేశ్వరరావు చిత్రంలో ఓ కీలక రోల్ చేశారు. టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ కాగా, రేణు దేశాయ్ సైతం నిజ జీవిత పాత్ర చేసింది. సామాజిక కార్యకర్త హేమలత లవణం గా రేణు దేశాయ్ డీగ్లామర్ లుక్ లో అలరించారు. అయితే టైగర్ నాగేశ్వరరావు ఫలితం మాత్రం దెబ్బకొట్టింది. పాన్ ఇండియా చిత్రంగా విడుదలైన టైగర్ నాగేశ్వరరావు ఆశించిన స్థాయిలో ఆడలేదు. రేణు దేశాయ్ కమ్ బ్యాక్ రవితేజకు కలిసిరాలేదు.

ఇదే సెంటిమెంట్ నితిన్(NITHIN) విషయంలో రిపీట్ అయ్యింది. తెలుగు అమ్మాయి అయిన లయ(LAYA) స్వయంవరం మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. హనుమాన్ జంక్షన్, ప్రేమించు, నువ్వు లేక నేను లేను వంటి హిట్ చిత్రాల్లో ఆమె నటించింది. బాలయ్య వంటి టాప్ స్టార్ తో సైతం జతకట్టింది. 2006లో లయ వివాహం చేసుకుంది. దాంతో నటనపై దృష్టి తగ్గించింది. 2018లో విడుదలైన అమర్ అక్బర్ ఆంటోని లో మొదటిసారి చిన్న గెస్ట్ రోల్ చేసింది. ఆ మూవీ ఆడలేదు.

మరో ఏడేళ్ల అనంతరం తమ్ముడు చిత్రంతో పూర్తి స్థాయిలో కమ్ బ్యాక్ ఇచ్చింది లయ. పరాజయాల్లో ఉన్న నితిన్ కి తమ్ముడు ఉపశమనం ఇస్తుంది అనుకుంటే.. కెరీర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ అయ్యింది. దాంతో రేణు దేశాయ్ మాదిరి లయ కమ్ బ్యాక్ కూడా పరిశ్రమకు కలిసి రాలేదు. వివాహం అనంతరం అమెరికాలో సెటిల్ అయిన లయ ఈ మధ్య ఎక్కువగా ఇండియాలో ఉంటున్నారు. తమ్ముడు ఫలితం నేపథ్యంలో ఆమె నటిగా కొనసాగుతారా లేక యూఎస్ లో జాబ్ చేసుకుంటారా? అనేది సస్పెన్సు.

RELATED ARTICLES

Most Popular