Sukumar And Rukmini Vasanth: ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకులలో సుకుమార్ (Sukumar)ఒకరు… తను చేసిన సినిమాలన్ని అతనికి గొప్ప గుర్తింపును తీసుకొచ్చిన సినిమాలే కావడం విశేషం… పుష్ప 2 (Pushpa 2) సినిమాతో పెను ప్రభంజనాన్ని సృష్టించిన ఆయన ఇప్పుడు రామ్ చరణ్ తో చేయబోతున్న సినిమా విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది… మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా విషయంలో సుకుమార్ తనదైన రీతిలో సత్తా చాటుకోవాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతున్నాడు. ఇక పుష్ప 2 కి మించి ఈ సినిమా సక్సెస్ ని సాధించాలని ఆయన ధృడ సంకల్పంతో ఉన్నట్టుగా తెలుస్తోంది. రామ్ చరణ్ ఇంతకు ముందు వచ్చిన రంగస్థలం (Ranhasthalam) సినిమా నాన్ బాహుబలి ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేసింది. మరి ఇలాంటి సందర్భంలో ఇప్పుడు రాబోతున్న సినిమా మీద హై ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉంటాయి. మెగా అభిమానులు సైతం రామ్ చరణ్ ను డిఫరెంట్ గా చూపించాలంటే అది ఒక్క సుకుమార్ కి మాత్రమే సాధ్యం అవుతోంది అని అభిప్రాయపడుతున్నారు. కాబట్టి ఈసారి మరింత డిఫరెంట్ గా అతన్ని ప్రజంట్ చేయాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. మరి ఇలాంటి సందర్భంలో వీళ్ళిద్దరి కాంబోలో రాబోతున్న ఈ సినిమా మీద మంచి అంచనాలతో ఉన్నాయి. ఆ అంచనాలను రీచ్ అవుతూ ఈ సినిమా భారీ విజయాన్ని సాధించి తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసి పెడుతుందా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది… ఇక ఇప్పటివరకు యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఈ కాంబినేషన్ కు చాలా మంచి గుర్తింపైతే ఉంది.మరి ఇకమీదట వీళ్ళు చేయబోతున్న సినిమాల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకొని ఎలాగైనా సరే భారీ విజయాన్నీ దక్కించుకోవడమే లక్ష్యంగా పెట్టుకుని బరిలోకి దిక్కుతున్నారు…
Also Read: సుకుమార్ వల్లే అల్లు అర్జున్ స్టార్ అయ్యాడు అంటూ రాఘవేంద్ర రావు వివాదాస్పద వ్యాఖ్యలు!
ఈ సినిమాలో కన్నడ బ్యూటీ అయిన రుక్మిణి వసంత్ ను హీరోయిన్ గా తీసుకోవాలనే ప్రయత్నంలో సుకుమార్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ‘సప్త సాగరాలు దాటి’ సినిమాతో ఒక ప్రత్యేకమైన ఐడెంటిటి ఏర్పాటు చేసుకుంది.
మరి ఇలాంటి సందర్భంలో ఆమె తన తదుపరి సినిమాను ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో చేయబోతోంది. ఎన్టీఆర్ (NTR) హీరోగా వస్తున్న ఈ సినిమాలో తను హీరోయిన్ గా నటిస్తుందని అఫిషియల్ గా అనౌన్స్ చేశారు.
ఇక సుకుమార్ కూడా రామ్ చరణ్ సినిమాలో తనైతేనే బాగుంటుందని ఆలోచిస్తున్నాడట… చూడాలి మరి ఈ కాంబినేషన్లో వచ్చే ఈ సినిమా ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుంది తద్వారా వాళ్లకు ఎలాంటి గుర్తింపు వస్తుంది అనేది…