Homeఅంతర్జాతీయంIndia US Trade Deal: భారత్‌–అమెరికా ఒప్పందం.. రైతులు, పరిశ్రమలపై ప్రభావం

India US Trade Deal: భారత్‌–అమెరికా ఒప్పందం.. రైతులు, పరిశ్రమలపై ప్రభావం

India US Trade Deal: ఏడాదిగా చర్చలతో కుదరని భారత్‌–అమెరికా వాణిజ్య ఒప్పందం.. భారత్‌–ఈయూ ఒప్పందం తర్వాత కుదిరింది. ట్రంప్‌ దిగిరాక తప్పని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఇరు దేశాల మధ్య మధ్యంతర వాణిజ్య ఒప్పందం జరిగింది. దీంతో భారత్‌కు లాభమని, టారిఫ్‌లు తగ్గాయని భారత్‌ చెబుతోంది. అయితే విశ్లేషకులు మాత్రం మనకు శరాఘాతమే అంటున్నారు. ఈ ఒప్పందంలో భారత్‌ అమెరికా వ్యవసాయ, పాల ఉత్పత్తుల దిగుమతిని అనుమతించింది. మునుపు రైతుల, పశుపోషకుల రక్షణ పేరుతో నిరోధించిన బారియర్లు తొలగాయి. ‘అదర్‌ ప్రొడక్ట్స్‌’ వ్యవధిలో ఏ ఉత్పత్తులైనా రావచ్చని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సబ్సిడీలపై ప్రభావం..
తాజా ఒప్పందం నాన్‌–టారిఫ్‌ బారియర్లను తొలగించాలని నిర్దేశించింది. రైతులకు సబ్సిడీలు అమెరికా ఎగుమతులకు అడ్డుకట్టగా, ఇవి ఆపవచ్చనే భయం. పశు దాణా (డ్రై డిస్టిల్డ్‌ గ్రెయిన్స్‌) దిగుమతి ఎMౖ ప్రమాదాలతో పాల, పశువుల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని ఆందోళనలు.

పరిశ్రమలపై దిగుమతి ప్రభావం..
ఇండస్ట్రియల్‌ వస్తువులపై పన్నులు తగ్గించడం మాన్యుఫాక్చరింగ్‌ రంగాన్ని ప్రభావితం చేస్తుంది. పెట్టుబడులు తగ్గే అవకాశం ఉంది. ఇప్పటికే సబ్సిడీలు ఇచ్చినా పెట్టుబడులు తగ్గుతున్నాయిఅమెరికా దిగుమతులు స్థానిక పరిశ్రమలను బలహీనపరుస్తాయి.

వాణిజ్య లక్ష్యాలతో భారం..
ప్రస్తుతం భారత్‌ ఏటా 45 బిలియన్‌ విలువైన సరుకులు అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటుంది. తాజా ఒప్పందం ప్రకారం ఏటా 100 బిలియన్‌ డాలర్ల సరుకులు దిగుమతి చేసుకోవాలి. ఇక భారత ఎగుమతులు 85 బిలియన్‌ డాలర్లు మాత్రమే. ట్రేడ్‌ డెఫిసిట్‌ అమెరికాకు 15 బిలియన్‌ డాలర్లు పెరుగుతుంది. ఐదేళ్లలో 500 బిలియన్‌ డాలర్ల లక్ష్యం భారత్‌పై ఒత్తిడి పెంచుతుంది. బ్యాలెన్స్‌ కావాలంటే మన ఎగుమతులు 150 బిలియన్‌ డాలర్లకు పెరగాలి. కానీ అది అసాధ్యం.

రష్యా ఆయిల్‌పై ఆంక్షలు..
రష్యా ఆయిల్‌ కొనుగోళ్లు భారత్‌ తగ్గిస్తుందని అమెరికా పేర్కొంటోంది. భారత్‌ అధికారికంగా ధ్రువీకరించలేదు. అమెరికా నుంచి కొనుగోళ్లు పెరగడంతో షిప్పింగ్‌ ఖర్చు భారత్‌పై పడుతోంది. టారిఫ్‌లు తగ్గించి ఎగుమతులు పెంచాలని అమెరికా ఒత్తిడి.

తాజా ఒప్పందం అమెరికాకు అనుకూలంగా ముగిసినా, రైతుల సబ్సిడీలు, స్థానిక పరిశ్రమల రక్షణ ప్రశ్నార్థకంగా మారింది. ట్రేడ్‌ డెఫిసిట్‌ పెరగడం దీర్ఘకాలిక ఆర్థిక సమతుల్యాన్ని దెబ్బతీస్తుంది. ప్రభుత్వం రక్షణ చర్యలు తీసుకోవాలని విశ్లేషకులు సూచిస్తున్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular