
India-Pakistan: దేశ భద్రతకు సంబంధించిన రహస్యాలు శత్రు దేశానికి చేరవేస్తున్నారు. అంతర్గత భద్రతను సవాలు చేస్తున్నారు. పాకిస్తాన్ కు చేరవేస్తూ దేశానికి నష్టం కలిగిస్తున్నారు. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టడు అన్నట్లు సాగుతోన్న బాగోతంపై అనుమానించే విధంగా కార్యకలాపాలు సాగుతున్నాయి. ఒడిశాలోని బాలేశ్వర్ జిల్లా చాందిపూర్ ఆయుధ పరిశోధన కేంద్రం డీఆర్డీవో నుంచి రహస్యాల లీకులు ఆందోళన కలిగిస్తున్నాయి.
పాకిస్తాన్ గూఢచారి సంస్థ శ్రీహరికోట, బాలేశ్వర్ ఆయుధ పరిశోధన కేంద్రాల నుంచి రహస్యాలు సేకరించేందుకు కుట్ర పన్నింది. ఇందులో భాగంగా అందులో పనిచేసే ఉద్యోగులను ఎంచుకుని వారి ద్వారా రహస్యాలు రాబడుతోంది. దీంతో రాష్ర్ట క్రైం బ్రాంచ్, ఎన్ఐఏ దర్యాప్తు చేస్తున్నాయి. పట్టుబడిన ఏడుగురితో పాకిస్తాన్ తో సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. దీంతో దేశ భద్రతపై ఆందోళన పెరుగుతోంది.
ఉత్తరప్రదేశ్ కు చెందిన ఓ వ్యక్తి మధ్యవర్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. డీఆర్డీవో లో తయారు చేసిన అత్యాధునిక ఆయుధం బ్రహ్మోస్ సంబంధిత రహస్యాలు లీకైనట్లు తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్ కు చెందిన వ్యక్తి రెండేళ్లలో రెండు సార్లు బాలేశ్వర్ వచ్చినట్లు ఆధారాలున్నాయి. అరెస్టయిన ఐదుగురిలో బసంత్ బెహర రహస్యాలు పంపినట్లు సమాచారం. ఇందులో పట్టుబడిన వారిలో ఐదుగురే కాకుండా మరో ఇద్దరికి సంబంధాలు కలిగినట్లు భావిస్తున్నారు.
లోపలికి సెల్ ఫోన్లు తీసుకుపోవడం నిషేధం ఉన్నా రహస్యంగా వారు లోపలికి తీసుకెళ్లి రహస్య డాక్యుమెంట్లు వాట్సాప్ ద్వారా మధ్యవర్తికి పంపుతున్నట్లు తెలిసింది. దీని ద్వారా రహస్యాలు అక్కడి నుంచి పాకిస్తాన్ కు చేరవేస్తున్నట్లు తెలుసుకున్నారు. దీంతో వారిపై చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది.