spot_img
Homeఅంతర్జాతీయంIndia Israel Relations: తొక్కలో అమెరికా లేకుంటే ఏంటీ.. ఇండియా ఉందన్న ఇజ్రాయెల్

India Israel Relations: తొక్కలో అమెరికా లేకుంటే ఏంటీ.. ఇండియా ఉందన్న ఇజ్రాయెల్

India Israel Relations: భారత్ – ఇజ్రాయెల్ మధ్య దశాబ్దాలుగా పత సంబంధాలు కొనసాగుతున్నాయి. ఇరుదేశాల మధ్య రక్షణ వ్యాపార సంబంధాలు క్రమంగా పెరుగుతున్నాయి. ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ ఇజ్రాయెల్ లో పర్యటించారు. కీలక ఒప్పందాలు చేసుకున్నారు. ఆపరేషన్ ఇందూరు సమయంలో ఇజ్రాయెల్ భారత్ కు రహస్యంగా సహకారం అందించిందని ప్రచారం కూడా ఉంది. ఇలాంటి తరుణంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇటీవలి వ్యాఖ్యలు ప్రపంచ రాజకీయాల్లో కొత్త అధ్యాయాన్ని సూచిస్తున్నాయి. అమెరికా వైస్ ప్రెసిడెంట్ జెడి వాన్స్ అమెరికాను ఇజ్రాయెల్‌కు ఏకైక ప్రధాన మద్దతుదారుగా పేర్కొన్నారు. దీనికి నెతన్యాహు ఇండియాను బలమైన, విశ్వసనీయ మిత్రుడిగా ప్రకటించారు. “ఇండియాకు 1.4 బిలియన్ జనాభా ఉంది. అక్కడ మాకు అద్భుతమైన మద్దతు లభిస్తోంది” అని ఆయన పేర్కొన్నారు. ఇది అమెరికా మద్దతు ఎలా ఉన్నా ఇండియా ఒక బలమైన ఆధారం అనే సందేశాన్ని ఇస్తోంది.

నెతన్యాహు వ్యాఖ్యల నేపథ్యం..
ఇజ్రాయెల్‌పై అంతర్జాతీయ ఒత్తిడి పెరిగిన సమయంలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కీలక వ్యాఖ్యలు చేశారు. గాజా, ఇరాన్, లెబనాన్ సంఘర్షణల నేపథ్యంలో ఇజ్రాయెల్‌పై విమర్శలు పెరగడం, కొన్ని దేశాల్లో దాని విధానాలపై వ్యతిరేకత పెరిగింది.. ఈ నేపథ్యంలో నెతన్యాహు “ఇజ్రాయెల్‌కు అనేక మిత్రులు ఉన్నారు. ముఖ్యంగా ఇండియా నుంచి వచ్చే మద్దతు అద్భుతం” అని స్పష్టం చేశారు. ఇది ఇజ్రాయెల్ తన మిత్ర దేశాల వృత్తాన్ని విస్తరించుకుంటున్నట్లు సూచిస్తోంది.

ఇండియా-ఇజ్రాయెల్ సంబంధాలు..
ఇజ్రాయెల్ కు ఇండియాతో ఉన్న సంబంధాలు 1992లో పూర్తి దౌత్య సంబంధాలు ఏర్పడిన తర్వాత వేగంగా అభివృద్ధి చెందాయి. అయితే, దీనికి ముందు నుంచే రెండు దేశాల మధ్య సాంస్కృతిక, వాణిజ్య సంబంధాలు ఉన్నాయి. ఇజ్రాయెల్ ఇండియాను ఆసియాలో తన కీలక భాగస్వామిగా చూస్తోంది. ఇండియా ప్రజాస్వామ్యం, ఉగ్రవాద వ్యతిరేకత, ఆర్థిక అభివృద్ధి వంటి విలువలను పంచుకుంటుంది. ఇజ్రాయెల్ ఈ సంబంధాలను “వ్యూహాత్మక భాగస్వామ్యం”గా భావిస్తోంది. ఇటీవలి సంవత్సరాల్లో రెండు దేశాల ప్రధానుల మధ్య సమావేశాలు, ఉమ్మడి ప్రకటనలు ఈ బంధాన్ని మరింత బలపరిచాయి.

రక్షణ సహకారం..
ఇజ్రాయెల్ ఇండియాను దాని అతిపెద్ద రక్షణ కస్టమర్‌. ఇజ్రాయెల్ ఆయుధ ఎగుమతుల్లో 34 నుంచి 42 శాతం వరకు ఇండియాకు వెళ్తున్నాయి. రక్షణ ఒప్పందాలు, డ్రోన్లు, క్షిపణి వ్యవస్థలు, సైబర్ భద్రత, ఇంటెలిజెన్స్ షేరింగ్ వంటి రంగాల్లో సహకారం గణనీయం. ఇజ్రాయెల్ ఇండియాతో ఉమ్మడి సైనిక శిక్షణలు, సాంకేతికత బదిలీలు చేస్తోంది. ఇది ఇజ్రాయెల్‌కు రక్షణ స్వావలంబనను పెంచడంలో సహాయపడుతోంది. అమెరికా మద్దతు ఎలా ఉన్నా, ఇండియా వంటి భాగస్వామి ఉండటం వల్ల ఇజ్రాయెల్ తన రక్షణ సామర్థ్యాలను మరింత మెరుగుపరుచుకునే అవకాశం ఉంది.

వ్యవసాయం, సాంకేతికత, ఆర్థిక సహకారం..
ఇజ్రాయెల్ ఇండియాతో వ్యవసాయ రంగంలో లోతైన సహకారం కలిగి ఉంది. ఇండో-ఇజ్రాయెల్ అగ్రికల్చరల్ ప్రాజెక్ట్ (ఐఐఏపీ) కింద భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ) ఏర్పాటు చేయబడ్డాయి. డ్రిప్ ఇరిగేషన్, నీటి సామర్థ్యం పెంపు, పంటల వైవిధ్యం వంటి ఇజ్రాయెల్ సాంకేతికత ఇండియాకు అందించబడుతోంది.

వాణిజ్యం..
గతంలో ఇండో ఇజ్రాయిల్ వాణిజ్యం 10 బిలియన్ల డాలర్ల వరకు చేరింది. వజ్రాలు, ఫార్మా, రసాయనాలు, యంత్రాలు వంటి రంగాల్లో ఇరు దేశాలు పరస్పరం లాభపడుతున్నాయి. ఇజ్రాయెల్ ఇండియాను తన ఆర్థిక వృద్ధికి ముఖ్యమైన మార్కెట్‌గా చూస్తోంది. ఏఐ, సెమీకండక్టర్స్, క్వాంటంటెక్నాలజీజీ వంటి ఆధునిక రంగాల్లో కూడా సహకారం పెరుగుతోంది.

నెతన్యాహు “ఇండియాలో ఇజ్రాయెల్‌పై అద్భుతమైన, క్రేజీ లవ్ ఉంది” అని పలుమార్లు పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాల్లో, ప్రజా అభిప్రాయంలో ఇండియన్ల నుంచి వచ్చే సానుకూల స్పందనలు ఇజ్రాయెల్‌కు బలం చేకూరుస్తున్నాయి. ఇజ్రాయెల్ ఇండియాను గ్లోబల్ సౌత్‌లో తన వాయిస్‌గా చూస్తోంది. ఇది ఇజ్రాయెల్‌ను అంతర్జాతీయంగా ఒంటరిగా ఉండకుండా కాపాడుతోంది. ఇజ్రాయెల్ ఇండియాను “విశ్వసనీయ భాగస్వామి”గా భావిస్తోంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version