Siddharth: తెలుగు సినిమా ఇండస్ట్రీలో వరుసగా సక్సెస్ లను సాధిస్తూ లవర్ బాయ్ ఇమేజ్ ను సంపాదించుకున్న హీరో సిద్ధార్థ్… శంకర్ డైరెక్షన్ లో తమిళంలో చేసిన బాయ్స్ సినిమాని తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేశారు. ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ను సాధించాడు. ఇక ఈ సినిమా తర్వాత ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’, ‘బొమ్మరిల్లు’ సినిమాలతో భారీ విజయాలను అందుకొని తనకంటూ ఒక ఐడెంటిటిని ఏర్పాటు చేసుకున్నాడు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో లవర్ బాయ్ ఇమేజ్ ని సంపాదించుకొని అమ్మాయిల కలల రాకుమారుడి గా పేరు సంపాదించుకున్న సిద్ధార్థ్ చాలా సంవత్సరాల పాటు ఇండస్ట్రీని ఏలుతున్నాడని అందరు అనుకున్నారు. కానీ అనుకోని కారణాల వల్ల ఆయన చాలావరకు ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. ప్రస్తుతం అతను సినిమాలేమీ చేయకుండా ఖాళీగా ఉంటున్నాడు. తమిళ్ సినిమా ఇండస్ట్రీలో అవకాశాల కోసం ఎదురుచూస్తున్నాడు. దొరికిన ప్రతి అవకాశాన్ని వాడుకుంటున్నాడు. శంకర్ డైరెక్షన్ లో గత సంవత్సరం వచ్చిన ‘ఇండియన్ 2’ మూవీలో సైతం నటించాడు.
అయినప్పటికి ఆ సినిమా ఏ మాత్రం అతనికి హెల్ప్ కాలేదు… ఇక ఇప్పుడు మరికొన్ని సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. అయితే సిద్ధార్థ్ ను కావాలనే కొంతమంది తెలుగు సినిమా ఇండస్ట్రీలో తొక్కేసారు అంటూ అప్పట్లో వార్తలైతే వచ్చాయి.
కానీ ఆయన్ని తొక్కాల్సిన పనిలేదు ఆయనే సరైన సినిమాలు ఎంచుకోలేక సక్సెస్ లను సాధించలేక కెరీర్ ని పూర్తిగా కోల్పోయాడంటు మరి కొంతమంది కామెంట్స్ చేస్తుండడం విశేషం…ఇక దానికి తోడుగా ఆయన సినిమాలను ఎంచుకోవడమే కాకుండా హీరోయిన్లతో ఎఫైర్స్ పెట్టుకొని దాని వల్ల కూడా కొంతవరకు పర్సనల్ గా డిప్రెషన్ లోకి వెళ్ళాడంటూ మరి కొంతమంది చెబుతున్నారు.
ఇక ఏది ఏమైనా కూడా సిద్ధార్థ్ ప్రస్తుతం సినిమాలు చేసి మరోసారి తనను తాను ప్రూవ్ చేసుకోవాల్సిన సమయమైతే ఆసన్నమైంది… ఇక ఏది ఏమైనా కూడా సీనియర్ హీరోలందరు కూడా విజయాలను సాధిస్తున్నారు. కాబట్టి సిద్ధార్థ్ సైతం మరోసారి తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలను చేస్తే అతని అభిమానులు సైతం ఆనందపడతారు…

