India EU Trade Deal: భారత్ ప్రపంచ వాణిజ్యంలో కీలక ఆకర్షణగా మారుతోంది. అమెరికా టారిఫ్‌లను సమర్థవంతంగా ఎదుర్కొంది. అమెరికాతో వాణిజ్య ఒప్పందం ఆలస్యం కారణంగా ప్రత్యామ్నాయాలను అవ్వేషిస్తోంది. ఇందులో భాగంగా తాజా ఈయూతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం పొందింది. ఇది పొరుగు దేశాల ఎగుమతులను ప్రభావితం చేసి, భారత టెక్స్‌టైల్స్‌కు కొత్త అవకాశాలు తెరుస్తోంది.
బంగ్లాదేశ్‌పై ఆధిపత్యం
ఈయూలో టెక్స్‌టైల్స్ మార్కెట్ 250 బిలియన్ డాలర్లగా ఉంది. భారత్ ప్రస్తుతం 7 బిలియన్ డాలర్లు మాత్రమే ఎగుమతి చేస్తోంది, అయితే బంగ్లాదేశ్ 30 బిలియన్ డాలర్లతో ముందంజలో ఉంది. బంగ్లాదేశ్ మన ముడి సరుకులు దిగుమతి చేసి గార్మెంట్స్ తయారు చేసి అమ్ముతోంది. తాజాగా భారత్ – ఈయూ ఫ్రీట్రేడ్ అగ్రిమెంట్ అమలులోకి వస్తే.. బంగ్లాదేశ్ ఎగుమతులపై ప్రభావం పడుతుంది. మునుపటి 12% టారిఫ్‌లు తొలగడంతో భారత ఎగుమతులు పెరిగి ఈ మార్కెట్ షేర్‌ను స్వాధీనం చేసుకునే ఛాన్స్ ఉంది.
18 ఏళ్లుగా పెండింగ్..
18 సంవత్సరాలుగా భారత్ – ఈయూ ఒప్పందం హోల్డ్‌లో ఉంది. డొనాల్డ్ ట్రంప్ విధిచంఇన టారిఫ్‌ల కారణంగా ప్రధాని మోదీ ఈయూ ఒప్పందానికి చొరవ చూపారు. ఆరు నెలల్లోనే ఈయూ విధానంలో మార్పు తెచ్చారు. ప్రక్రియ మొత్తం ఆరు నెలల్లో పూర్తయింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్ విధానాలు ఈయూను భారత్‌తో సమీపంలోకి తెచ్చాయి. అమెరికాతో ఆలస్యమయ్యే ఒప్పందాల మధ్య భారత్ ఈయూతో వ్యాపారాన్ని పెంచుకుంటూ డైవర్సిఫై చేస్తోంది.
ఈయూ నుంచి దిగుమతి వస్తువుల ధరలు తగ్గడంతో భారత ఆర్థిక వ్యవస్థకు ప్రయోజనం. చైనా ఉత్పత్తుల మీద ఆధారపడటం తగ్గుతుంది. ఈయూ ఎగుమతులు పెరిగి వ్యాపార సంబంధాలు బలపడతాయి. మొత్తంగా భారత్ అమెరికా ఆధిపత్యానికి బదులు బహుళ దేశాలతో సమతుల్య వ్యాపారం చేస్తూ సూపర్‌పవర్ మార్గంలో అడుగులు వేస్తోంది.