India Military Strategy Iran War: ఇరాన్, ఇజ్రాయిల్-అమెరికా మధ్య జరుగుతున్న యుద్ధం ప్రపంచ పరిస్థితులపై ప్రభావం పడే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఈ యుద్ధంలో అమెరికాకు మద్దతుగా ఉన్న దేశాలపై కూడా ఇరాన్ దాడులు చేయడంతో ఒక్కొక్కటిగా ఈ యుద్ధ రంగంలోకి కొత్త దేశాలు ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఫ్రాన్స్ అమెరికాకు మద్దతుగా యుద్ధం చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఒకటి రెండు రోజుల్లో ముగుస్తుంది అనుకున్న యుద్ధం ఇంకా కొనసాగే అవకాశాలు ఉండడంతో రానున్న రోజుల్లో మరిన్ని దేశాలు ఈ యుద్ధంలో పాల్గొనే అవకాశం ఉందా? అని చర్చ సాగుతుంది. ఇందులో భాగంగా ఈ యుద్ధంలోకి భారత్ కూడా ఎంట్రీ ఇస్తుందా? అని అనుకుంటున్నారు. అసలు ఈ యుద్ధంలోకి భారత్ ఎందుకు పాల్గొనాల్సి వస్తుంది? భారత్కు ఎలాంటి ఆపద రాబోతుంది?
ఇరాన్, ఇజ్రాయిల్ యుద్ధం కారణంగా ఇప్పటివరకు భారతదేశానికి ఎలాంటి సమస్య లేదు. ఎందుకంటే భారత్ ప్రస్తుతం ఏ దేశానికి మద్దతు ఇవ్వకుండా స్థిరంగా ఉంది. అటు అమెరికాతో స్నేహంగా ఉంటూనే.. ఇటు ఇరాన్ దేశానికి అనుకూలంగా ఉంటుంది. అందుకే ఇరాన్ నుంచి కొన్ని విమానాలు భారత్ కు రాకపోకలు సాగిస్తున్నాయి. అటు ఇజ్రాయిల్ కానీ.. అమెరికాతో కానీ భారత్ ఎలాంటి శత్రుత్వం పెంచుకోవడం లేదు. అయితే ఇరాన్, ఇజ్రాయిల్ యుద్ధం కారణంగా కీలకమైన హార్మోజ్ జల సంధిని మూసివేసిన విషయం తెలిసిందే. దీంతో వేలాది షిప్పులు ఆగిపోవడంతో చమరు రావడం కష్టంగా మారింది. ఫలితంగా భారత్ పై ఈ ప్రభావం పడుతుంది. అయినాప్పటికీ 25 రోజులపాటు అవసరమయ్యే నిల్వలు భారత్ లో ఉన్నట్లు అధికారులు తెలుపుతున్నారు.
అయితే ఇటీవల అమెరికా దేశాధ్యక్షుడు ట్రంపు కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అవసరమైతే సెప్టెంబర్ వరకు యుద్ధం కొనసాగుతుందని ప్రకటించారు. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో చమురు నిల్వలు తగ్గిపోతే పరిస్థితి ఏంటి? అన్న ఆలోచనను ముందుగానే గ్రహించి రష్యాతో ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. అంటే ఇరాన్ నుంచి చమురు రాకపోయినా రష్యా నుంచి దిగుమతి చేసుకునేందుకు భారత్ ఇప్పటికే మార్గం సుగమం చేసుకుంది. అయితే రష్యా నుంచి చమరును దిగుమతి చేసుకోవడం అమెరికాకు ఇష్టం లేదు. అయినా కూడా ఇటీవల అమెరికాకు చెందిన ఓ సేనేటర్ మాట్లాడుతూ.. రష్యా నుంచి చమురును దిగుమతి చేసుకునేందుకు భారత్ కు 30 రోజులపాటు అవకాశం ఇస్తున్నట్లు పేర్కొన్నారు. అంటే 30 రోజుల తర్వాత పరిస్థితి ఏంటి? అని కొందరు చర్చిస్తున్నారు.
అంతేకాకుండా ఇటీవల తెలుస్తున్న సమాచార ప్రకారం ఈ యుద్ధంలోకి రష్యా కూడా ఎంట్రీ అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. ఆ సమయంలో భారత్ కు చమురు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఇదే సమయంలో ఇరాన్ కు మద్దతుగా పాకిస్తాన్, చైనాలు నిలుస్తున్నాయి. రానున్న రోజుల్లో ఈ రెండు దేశాలు ప్రత్యక్షంగా యుద్ధంలో పాల్గొంటే.. అవి భారత్ కు వ్యతిరేకంగా పనిచేసినట్లే అవుతుంది. దీంతో ఈ రెండు దేశాలతో యుద్ధం చేయాల్సి వస్తుందా? అన్న చర్చ సాగుతోంది.
అయితే ఈ పరిస్థితులను ముందుగానే గమనించిన భారత్ ‘శేష్ నాగ్ 150’ వంటి రక్షణ సామర్థ్యాన్ని ముందుగానే ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇది దీర్ఘదూర స్మాల్ స్ట్రిక్ డ్రోన్ వ్యవస్థ. ఇది 1000 కిలోమీటర్లకు పైగా దూరంలో లక్ష్యాలను దాడి చేయగల సత్తా ఉంది. ఈ డ్రోన్లను సమూహంగా దాడి చేస్తే శత్రు దేశాలను ఎదుర్కోగలదు. అంటే పరోక్షంగా పరిస్థితులు తారు మారితే భారత్ కూడా యుద్ధరంగంలోకి దిగే అవకాశాలు లేకపోలేదని కొందరు చర్చిస్తున్నారు. మరి వచ్చే రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి..