Homeఅంతర్జాతీయంIndia Birth Rate: అప్ఘనిస్తాన్ టాప్.. పాక్ 2.. భారతదేశంలో పడిపోతున్న జననాల రేటు... కారణమేంటి?

India Birth Rate: అప్ఘనిస్తాన్ టాప్.. పాక్ 2.. భారతదేశంలో పడిపోతున్న జననాల రేటు… కారణమేంటి?

India Birth Rate:  ప్రపంచ జనాభా సంక్షోభం దిశగా పయనిస్తోందా అంటే అవుననే అంటున్నారు నిపుణులు. ఇప్పటికే రష్యా, జపాన్, చైనాతోపాటు అనేక దేశాల్లో జననాల రేటు గణనీయంగా తగ్గిపోయింది. దీంతో జననాలు పెంచేందుకు ఆయా దేశాలు వివిధ పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తున్నాయి. ఇక తాజాగా ఐక్యరాజ్య సమితి(యూఎన్‌వో) నివేదిక ప్రకారం భారత్‌లో కూడా జననాల రేటు తగ్గుతోంది.

ఐక్యరాజ్యసమితి (UNO) తాజా నివేదిక ప్రకారం, భారతదేశం సుమారు 146 కోట్ల జనాభాతో ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా నిలిచింది, చైనాను వెనక్కి నెట్టి మొదటి స్థానాన్ని ఆక్రమించింది. అయితే, ఈ జనాభా ఆధిక్యం ఉన్నప్పటికీ, దేశంలో జననాల రేటు గణనీయంగా తగ్గుతుండటం ఆందోళనకర విషయంగా ఉందని నివేదికలు సూచిస్తున్నాయి.

జననాల రేటులో క్షీణత..
UNFPA ‘స్టేట్‌ ఆఫ్‌ వరల్డ్‌ పాపులేషన్‌ 2025’ నివేదిక ప్రకారం, భారతదేశంలో జననాల రేటు 1.9కి పడిపోయింది, ఇది జనాభా స్థిరీకరణానికి అవసరమైన 2.1 స్థాయి కంటే తక్కువ. జనాభా పెరుగుదల కంటే జననాల రేటు తగ్గడమే నిజమైన సంక్షోభంగా నివేదిక హెచ్చరిస్తోంది. ఈ క్షీణత దీర్ఘకాలంలో జనాభా నిర్మాణంపై, ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపనుంది.

ప్రపంచవ్యాప్తంగా ఇలా..
జననాల రేటు మెరుగ్గా ఉన్న దేశాల్లో ఆఫ్ఘనిస్తాన్‌ అగ్రస్థానంలో ఉంది. ఆ దేశంలో 4.7 గా జననాల రేటు ఉంది. తర్వాతి స్థానంలో 3.5 తో పాకిస్థాన్‌ ఉంది. బంగ్లాదేశ్‌ 2.3, ఇండియా 1.9, నేపాల్‌ 1.9, శ్రీలంక 1.9తో సమానంగా ఉన్నాయి. బూటాన్‌లో 1.4, చైనాలో 1 శాతంగా జననాల రేటు ఉంది.

Also Read:  Kim Jong Un Birth Anniversary : ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్‌కు ఎంత మంది శత్రువులు, ఎంత మంది స్నేహితులు ఉన్నారు ?

యువ జనాభా భారత్‌ సొంతం..
జననాల రేటు తగ్గినప్పటికీ, భారతదేశంలో యువ జనాభా గణనీయంగా ఉండటం ఒక సానుకూల అంశం. UNFPA నివేదిక ప్రకారం, దేశంలో 0-14 ఏళ్ల వయసు వారు 24%, 10-19 ఏళ్ల వారు 17%, 10-24 ఏళ్ల వారు 26% ఉన్నారు. అలాగే, పని చేసే వయసు (15-64 ఏళ్లు)లో 68% మంది ఉండగా, 65 ఏళ్లు దాటిన వృద్ధులు కేవలం 7% మాత్రమే. ఈ యువ శక్తి దేశ ఆర్థిక వృద్ధికి, సామాజిక అభివృద్ధికి బలమైన ఆధారంగా నిలుస్తుంది.

భవిష్యత్తు సవాళ్లు..
జననాల రేటు క్షీణత దీర్ఘకాలంలో వృద్ధ జనాభా పెరుగుదలకు, శ్రామిక శక్తి కొరతకు దారితీయవచ్చు. ఈ సవాలును అధిగమించేందుకు విద్య, ఆరోగ్యం, ఉపాధి అవకాశాలపై దృష్టి సారించడం, యువత సామర్థ్యాన్ని సద్వినియోగం చేసుకోవడం అవసరం. అలాగే, సమతుల జనాభా విధానాలు, మహిళల సాంఘిక-ఆర్థిక భాగస్వామ్యాన్ని ప్రోత్సహించే చర్యలు కీలకం.

భారతదేశం జనాభా ఆధిక్యంతో అగ్రస్థానంలో ఉన్నప్పటికీ, జననాల రేటు తగ్గడం భవిష్యత్తులో సవాళ్లను తెచ్చిపెట్టవచ్చు. అయితే, యువ జనాభా బలం, సమర్థవంతమైన విధానాలతో ఈ సంక్షోభాన్ని అవకాశంగా మలచుకోవచ్చు. దీర్ఘకాలిక ఆర్థిక, సామాజిక స్థిరత్వం కోసం సమగ్ర జనాభా వ్యూహాలు రూపొందించడం ఇప్పుడు అత్యవసరం.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular