Bhutan : బౌద్ధ భిక్షులకు నిలయంగా ఉన్న భూటాన్ ప్రపంచ పర్యాటక ప్రదేశంగా పేరు ప్రఖ్యాతలు పొందింది. ఇక్కడి పచ్చదనం, ఆహ్లదకరమైన వాతావరణంలో గడిపేందుకు చాలా మంది ఇక్కడికి వస్తుంటారు. ఎన్నో శతాబ్దాల చరిత్ర కలిగిన భూటాన్ దేశంలో కొన్ని ప్రాచీన సాంప్రదాయాలు ఇప్పటికీ కొనసాగుతూ ఉంటాయి. ఇక్కడి దేశంలోని కొన్ని ప్రాంతాల్లో కొన్ని సంస్కృతిని తెలియజేందుకు గోడలపై పేయింటింగ్ వేస్తుంటారు. పెయింటింగ్ ద్వారా తాము చేయాలనుకున్నది చెప్పేస్తుంటారు. అలాగే కొన్ని చిత్రాలు అక్కడి మఠాల గురించి చెబుతూ ఉంటాయి. అంతేకాకండా ఇక్కడి మఠాలను సందర్శించడం వల్ల కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని నమ్ముతారు. అయితే ఒక్కడో గ్రామంలోని ఇళ్ల గోడలపై వింతైన పెయింటింగ్ ఉంటుంది. అదేంటంటే.. మనం సీక్రెట్ అనుకునే పురుషాంగం బొమ్మలు కనిపిస్తాయి. ఇలా అవి ఎందుకు కనిపిస్తాయి? వాటి వెనక ఉన్న చరిత్ర ఏంటి?
పర్యాటక ప్రదేశంగా ప్రసిద్ధి చెందిన భూటాన్ దక్షిణ ఆసియాలోని హిమాలయాల్లో కొలువై ఉంటుంది. ఇక్కడి ప్రదేశాలు చాలా ఆహ్లదకరంగా ఉంటాయి. అలాగే ఇక్కడున్న గ్రామాలకు ప్రత్యేక చరిత్ర ఉంది. భూటాన్ దేశంలో ఎక్కువగా బౌద్ధ మతస్థులు కనిపిస్తాయి. బౌద్ధ మత ప్రచారం కోసం ప్రాచీన కాలం నుంచి వివిధ పద్ధతులను పాటిస్తూ వస్తారు. ఈ క్రమంలో ఓ గ్రామంలో ఇళ్ల గోడల నిండా పురుషాంగం బొమ్మలను గీశారు. వీటిని చూసి బయటి వారు ఆశ్చర్యపోతున్నారు. కానీ ఇక్కడి వారికి ఇది కామన్ఖ అయిపోయింది. ఎందుకంటే వీటిని బౌద్ధ మత ప్రచారం కోసం చిత్రీకరించారని చెబుతున్నారు.
15వ శతాబ్దం కిందట మత ప్రచారం కోసం వివిధ పద్ధతుల్లో భాగంగా దీనిని చిత్రీకరించారట. అయితే ఈ చిత్రాలతో మానవ జీవితం ఎలా ఉంటుందో తెలియజెప్పేవారని అంటున్నారు. ద్రుక్పకున్లే అనే బౌద్ధ సన్యాసి మత ప్రచారం కోసం పురుషాంగం చిత్రాన్ని ఉపయోగించారని అంటున్నారు. ఈ చిత్రాల ద్వారా మతం గురించి ప్రజల్లోకి తీసుకెళ్లగలిగాడట. అంతేకాకుండా సంతానం కావాలని అనుకునేవారు ఈ గ్రామానికి రావడం వల్ల వారు అనుకున్న కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. కొండలపై ఉన్న ఈ గ్రామంలో ప్రత్యేకంగా మఠాలు ఉన్నాయి. వీటిని సందర్శించడం వల్ల తమ కోరికను నెరవేర్చుకోవచ్చని అంటున్నారు. తమకు కావాల్సింది ఏదో వెదురు చిట్టీపై రాసి ఇవ్వాలని అంటున్నీరు. ఇంతకీ ఈ గ్రామం ఎక్కడుందంటే?
భూటాన్ దేశ రాజధాని థింబు. ఈ నగరానికి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న పునాఖా అనే లోయలో సోబ్సోకా అనే గ్రామం ఉంది ఈ గ్రామంలోని ఇళ్ల గోడలపై పురుషాంగం చిత్రాలు కనిపిస్తాయి. సోబ్సోకా అంటే నిద్రలేని గ్రామం. అయితే చాలా చోట్లు పురుషాంగ చిత్రాలు సాధారణంగా కాకుండా భయంకరంగా ఉంటాయి. ఇవి జీవితంలో ఒక భాగం అని తెలపడానికే ఇలా చిత్రీకరించారు. అయితే కొన్ని చోట్ల ఇళ్ల గోడలపై చిత్రీకరించగా.. మరికొన్ని చోట్ల ఇళ్ల పైకప్పులపై కూడా పురుషాంగం చిత్రాలు కనిపిస్తాయి. ఈ విషయంలో సోషల్ మీడియాలోకి రావడంత చాలా మంది ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.