Finland : మీకు ఆదాయం ఎంతనో జరిమానా కూడా అంతే.. షాకిస్తున్న కొత్త పన్నులు

ఫిన్లాండ్ దేశంలో అక్కడి ప్రభుత్వం భారీ మొత్తంలో జరిమానా విధించింది. ఆ జరిమానా ఎంతో చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..!!

Written By: Srinivas, Updated On : September 29, 2024 3:59 pm

Finland traffic Rules

Follow us on

Finland : ఏ వాహనం అయినా మినిమం 60 లేదంటే కార్లు అయితే 100 వరకు వెళ్తాం. ఒకవేళ ఆ స్పీడ్‌ను దాటితే ఆటోమెటిక్‌గా పైన్లు పడుతూనే ఉంటాయి. మహా అయితే రూ.600 నుంచి రూ.1000 వరకు ఫైన్ పడే అవకాశం ఉంటుంది. స్పీడ్ ఎంత మితిమీరినా లిమిట్ ప్రకారమే ఫైన్ పడుతుంటుంది. అధిక స్పీడుతో నిత్యం ప్రమాదాలు జరుగుతుండడంతో ఆయా ప్రభుత్వాలు ఈ మేరకు ఫైన్లు విధిస్తుంటాయి. అయినప్పటికీ చాలా మంది అదే స్పీడులో పయనిస్తూనే ఉంటారు. ఫైన్లను లెక్క చేయకుండా పడిన జరిమానాలు చెల్లిస్తూ మళ్లీమళ్లీ రూల్స్ బ్రేక్ చేస్తుంటారు. అయితే.. ఫిన్లాండ్ దేశంలో అక్కడి ప్రభుత్వం భారీ మొత్తంలో జరిమానా విధించింది. ఆ జరిమానా ఎంతో చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..!!

ఫిన్లాండ్ రష్యన్ సామ్రాజ్యం నుంచి స్వాతంత్ర్యం పొందిన తరువాత 1920లతో ట్రాఫిక్ ఉలంఘునలపై తీవ్రంగా స్పందిస్తోంది. అంతేకాదు.. ఎక్కడా లేని విధంగా అక్కడ ఆదాయ ఆధారిత జరిమానాల వ్యవస్థను అమల్లోకి తీసుకుంది. అంటే దీని ప్రకారం పట్టుబడిన వ్యక్తి ఆదాయం ప్రకారం జరిమానా విధించనున్నారు. ప్రపంచంలోనే ఇలాంటి వ్యవస్థను అమల్లోకి తెచ్చిన తొలి దేశం కూడా ఫిన్లాండే. ఇక్కడ ట్రాఫిక్ రూల్స్ ప్రకారం నిబంధనలు అతిక్రమించిన వ్యక్తిని ముందుగా అతని ఆదాయం గురించి అడుగుతారు. దాని ప్రకారం జరిమానా విధించే వారు.

అయితే రానురాను డిజిటైజేషన్ విధానం అమల్లోకి రావడంతో ఆదాయ పన్ను వివరాలు అడగాల్సిన పనిలేకుండా పోయింది. పోలీసులు స్మార్ట్ ఫోన్లను సెంట్రల్ ట్యాక్స్‌పేయర్ డేటాబేస్‌కు అనుసంధానం చేయడం ద్వారా వారి ఆదాయ వివరాలను తెలుసుకుంటూ ఫైన్ వేస్తున్నారు. తాజాగా.. ఫిన్లాండ్‌లో ఓ సంపన్నుడికి విధించిన ఫైన్ చూస్తే అక్కడి ట్రాఫిక్ రూల్స్ ఎంత కఠినమో అర్థం చేసుకోవచ్చు. కారులో ప్రయాణిస్తూ ఓ వ్యక్తి జాతీయ రహదారిపై ట్రాఫిక్ పోలీసులకు పట్టుబడ్డాడు. ఆ వ్యక్తి పేరు అండర్స్ విక్లాఫ్. స్పీడు లిమిట్‌లో భాగంగా 30 కిలోమీటర్ల వేగాన్ని అతిక్రమించాడు. దాంతో అతనికి ట్రాఫిక్ పోలీసులు 1,21,00 యూరోలు జరిమానా విధించారు. అంటే అది ఇండియా కరెన్సీలో రూ.1.1 కోట్లు అన్నమాట. విక్లాఫ్ సంపన్నుడు కావడంతో అతనికి అంత పెద్ద మొత్తంలో ఫైన్ వేశారు. ఫిన్లాండ్‌లో ట్రాఫిక్ జరిమానాలను డే ఫైన్స్‌గా పిలుస్తుంటారు.

ఫిన్లాండ్‌ను ఆదర్శంగా తీసుకొని 1931లో స్వీడన్, 1939లో డెన్మార్క్ దేశాలు ఈ చట్టాన్ని అమలు చేశాయి. అలాగే.. 1975లో జర్మనీ, 1990లో స్విట్జర్లాండ్‌లు అమల్లోకి తీసుకొచ్చాయి. 1983లో ఫ్రాన్స్‌లోనూ అమలు చేయగా.. 2007లో మరింత విస్తరించింది. ఫిన్లాండులో ఇలాంటి కఠినమైన నిబంధనలు అమలు చేయడం వల్లే రోడ్డు ప్రమాదాలు గణనీయంగా తగ్గాయట. ఈ విషయంలో ప్రపంచ సగటు 17.4 కావడం విశేషం. భారత్‌లో 15.6గా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రమాదాల్లో మరణాలు 5శాతం తగ్గుదల కనిపిస్తే.. భారత్‌లో మాత్రం పెరిగింది. 1.34 లక్షల నుంచి 1.54 లక్షలకు పెరిగినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.