Sathyam Sundharam Movie : తెలుగు లో మంచి మార్కెట్ ని సంపాదించుకున్న తమిళ హీరోలలో ఒకరు కార్తీ. ఒకానొక దశలో ఈయనకి మన టాలీవుడ్ లో ఆయన సోదరుడు సూర్య కంటే అత్యధిక వసూళ్లు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఆయన సినిమా వస్తుంది అంటే కచ్చితంగా చాలా బాగుంటుంది, థియేటర్ కి వెళ్లి చూడాల్సిందే అని ప్రతీ తెలుగు ప్రేక్షకుడికి అనిపిస్తుంది. కార్తీ కూడా ఆడియన్స్ అభిరుచికి తగ్గట్టుగానే సినిమాలు చేస్తూ వచ్చేవాడు. కానీ ఆయన గత చిత్రం ‘జపాన్’ మాత్రం కమర్షియల్ గా పెద్ద ఫ్లాప్ అయ్యింది. ఆ తర్వాత తెరకెక్కిన ‘సత్యం సుందరం’ చిత్రం రీసెంట్ గానే విడుదలైంది. కార్తీ, అరవింద్ స్వామి ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం విడుదలకు ముందే థియేట్రికల్ ట్రైలర్స్, టీజర్స్ ప్రేక్షకులను అలరించాయి. అలా మంచి సినిమా అనే అంచనాలతో నిన్న తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకి యావరేజ్ రేంజ్ ఓపెనింగ్స్ వచ్చాయనే చెప్పాలి.
సినిమాకి మంచి ఫీల్ గుడ్ చిత్రం అని రివ్యూస్ వచ్చాయి. అయినప్పటికీ కూడా యావరేజ్ ఓపెనింగ్స్ రావడానికి కారణం ‘దేవర’ మేనియా ప్రభావం పడి ఉండొచ్చని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ‘దేవర’ మేనియా తో పాటు రీసెంట్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కార్తీ పొరపాటున తిరుపతి లడ్డు మ్యాటర్ పై ఫన్ చేయడం, దానికి పవన్ కళ్యాణ్ నుండి సీరియస్ వార్నింగ్ రావడం, అలా ఆ వివాదం తాలూకు ప్రభావం కూడా ఈ సినిమా ఓపెనింగ్స్ మీద పడుండొచ్చు అని ట్రేడ్ వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి 1 కోటి 50 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయని, షేర్ 75 లక్షల రూపాయిలు వచ్చాయని అంటున్నారు. ఇది డీసెంట్ వసూళ్లే అయినప్పటికీ, పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి కాబట్టి ఇంకా మంచి వసూళ్లు వచ్చి ఉండాల్సింది అని ట్రేడ్ విశ్లేషకుల అభిప్రాయం. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి విడుదలకు ముందు 3 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగింది.
ఏషియన్ సునీల్ నారంగ్ ఈ చిత్రం తెలుగు రైట్స్ ని కొనుగోలు చేసాడు. బ్రేక్ ఈవెన్ కి ఇంకా రెండు కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టాల్సి ఉంది. ఫుల్ రన్ లో బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కానీ, ఈ చిత్రం 27 వ తారీఖున విడుదల అయ్యుంటే ఈపాటికి బ్రేక్ ఈవెన్ మార్కుని దాటేదని అంటున్నారు ట్రేడ్ పండితులు. వాస్తవానికి తమిళ వెర్షన్ సెప్టెంబర్ 27 న విడుదల అయ్యింది, కానీ ‘దేవర’ చిత్రం విడుదల ఉండడం తో తెలుగు లో ఒక్క రోజు ఆలస్యం గా విడుదల చేసారు. దాని వల్ల ఈ చిత్రానికి ఫుల్ రన్ లో నష్టాలు వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు.