https://oktelugu.com/

Hyderabad Boy died In US : అమెరికాలో గన్‌ మిస్‌ఫైర్‌.. హైదరాబాద్‌ యువకుడి మృతిలో అంతులేని విషాదం ఇదీ!

అగ్రరాజ్యం అమెరికాలో మొన్నటి వరకు ఎన్నికల హడావుడికొనసాగింది. భారతీయుల మరణాలు కూడా తగ్గాయి. ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. దీంతో మళ్లీ భారతీయుల మృతి వార్తలు వస్తున్నాయి.

Written By:
  • Raj Shekar
  • , Updated On : November 22, 2024 / 03:09 PM IST

    Hyderabad Boy died In US

    Follow us on

    Hyderabad Boy died In US :  అగ్రరాజ్యం అమెరికాలో చదువులు, ఉద్యోగాల కోసం భారత్‌ నుంచి ఏటా వేల మంది వెళ్తున్నారు. కొందరు అక్కడే స్థిరపడుతున్నారు. ఇటీవల అమెరికా విడుదల చేసిన జాబితా ప్రకారం ప్రస్తుతం అమెరికాలోని యూనివర్సిటీల్లో భారతీయ విద్యార్థులే అధికంగా ఉన్నారు. దీనిని బట్టి భారతీయులు ఏస్థాయిలో అగ్రరాజ్యం బాట పడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇక అమెరికా వెళ్లిన వారు అక్కడ వేర్వేరు కారణాలతో మరణిస్తున్నారు. కొందరు రోడ్డు ప్రమాదాల్లో మృతిచెందుతుండగా, కొందరు వాటర్‌ ఫాల్స్‌లో పడి మృతిచెందారు. కొందరు ఆత్మహత్య చేసుకున్నారు. తాజాగా మరో భారతీయుడు అమెరికాలో మృతిచెందాడు. గన్‌ మిస్‌ఫైర్‌ కావడంతో ఈ ఘటన జరిగింది.

    పుట్టిన రోజు చివరి రోజు..
    అమెరికాలోని జార్జియా రాష్ట్రంలోని అట్లాంటాలో తెలంగాణలోని ఉప్పల్‌కు చెందిన విద్యార్థి అరుణ్‌ రెడ్డి(23) ఉంటున్నాడు. నవంబర్‌ 13న అతని పుట్టిన రోజు. అదే రోజు అతను తన హంటింగ్‌ లైసెన్స్‌డ్‌ గన్‌ శుభ్రం చేస్తుండగా మిస్‌ ఫైర్‌ అయింది. ఈ ఘటనలో అరుణ్‌రెడ్డి అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ వార్త తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఒక్కగానొక్క కొడుకు తిరిగిరాడనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.

    ఉన్నత చదువుల కోసం వెళ్లి..
    బీబీనగర్‌ పోచంపల్లి మండలం పెద్దరావులపల్లి గ్రామానికి చెందిన వ్యాపారి పాల్వాయి సుదర్శన్‌రెడ్డి దీప దంపతులు ఉప్పల్‌ బ్యాంక్‌ కాలనీలో నివాసం ఉంటున్నారు. వీరికి ఒక్కగానొక్క కొడుకు అరుణ్‌రెడ్డి(24) ఉన్నాడు. గతేడాది డిసెంబర్‌లో అమెరికాలోని జార్జియా స్టేట్‌ అట్లాంటా పట్టణంలోని కెనిస్వా యూనివర్సిటీలో ఎంఎస్‌ చదివేందుకు వెళ్లాడు. నవంబర్‌ 13న తన స్నేహితుల మధ్యనే పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నాడు. తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు ఆరుణ్‌రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అదే రోజు ఉదయం 10 గంటలకు తన హంటింగ్‌ లైసెన్స్‌డ్‌ గన్‌ను శుభ్రం చేయడం ప్రారంభించాడు. ఈ సమయంలో మిస్‌ఫైర్‌ అయింది. దీంతో తూటా అరుణ్‌ ఛాతీలో నుంచి దూసుకెళ్లింది. దీంతో అక్కడికక్కడే మృతిచెందాడు.

    ఆర్మీలో చేరాలని..
    అరుణ్‌రెడ్డికి ఆర్మీలో చేరాలనే కోరిక ఉండేది. అయితే అటువైపు వెళ్లకపోవడంతో గన్‌ పేల్చడంలో శిక్షణ పొందుతున్నాడు. అక్కడే గన్‌ కూడా కొనుగోలు చేశాడు. ట్రైనింగ్‌ తీసుకుంటున్నవారికి హంటింగ్‌ గన్‌ కోసం లైసెన్స్‌ ఇస్తారు. దీంతో అరుణ్‌ గన్‌ కొనుగోలు చేసినట్లు తెలిసింది.