https://oktelugu.com/

Nag Ashwin: నాగ్ అశ్విన్ వైజయంతి మూవీస్ కి దొరికినా అదృష్టమా..?ఆయన లేకపోతే ఆ బ్యానర్ ఉండేది కాదా..?

సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న దర్శకులు వాళ్ళను వాళ్లు స్టార్ డైరెక్టర్లుగా ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక తనకంటూ ఇక ప్రత్యేకతను క్రియేట్ చేసుకోవడంలో వాళ్ళు అహర్నిశలు ప్రయత్నం చేస్తూ ముందుకు సాగుతున్నారనే చెప్పాలి. ఇక నాగ్ అశ్విన్ లాంటి డైరెక్టర్ చేసినవి తక్కువ సినిమాలే అయినప్పటికి మంచి గుర్తింపును సంపాదించుకోవడం అనేది గొప్ప విషయమనే చెప్పాలి.

Written By:
  • Gopi
  • , Updated On : November 22, 2024 / 03:14 PM IST

    Nag Ashwin

    Follow us on

    Nag Ashwin: యంగ్ డైరెక్టర్ గా తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నాగ్ అశ్విన్ సత్తా చాటుతూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక ఇప్పటివరకు ఆయన చేసినవి చాలా తక్కువ సినిమాలే అయినప్పటికి తనకంటూ ఒక మార్కెట్ ను క్రియేట్ చేసుకోవడంలో ఆయన చాలా వరకు ముందు వరుసలో దూసుకెళ్తున్నాడనే చెప్పాలి. మరి ఇలాంటి సందర్భంలో ఆయన చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్త వహిస్తూ మరి తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్న ఈ దర్శకుడు విజయం సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు. నిజానికి ఈయన చేసిన అన్ని సినిమాలు మంచి విజయాలను సాధించడమే కాకుండా వైజయంతి మూవీస్ బ్యానర్ ని కూడా తారా స్థాయిలో నిలబెట్టడం లో చాలావరకు కృషి చేశారనే చెప్పాలి. ఇక శక్తి లాంటి భారీ డిజాస్టర్ సినిమా తర్వాత వైజయంతి మూవీస్ భారీగా పడిపోయిందనే చెప్పాలి. ఇక అప్పటి నుంచి చాలా సంవత్సరాల పాటు ఆ బ్యానర్లో పెద్దగా సినిమాలు ఏమీ రాలేదు. ఇక మహానటి సినిమాతో భారీ ప్రభంజనాన్ని సృష్టించిన వైజయంతి మూవీస్ బ్యానర్ ఒక్కసారిగా తారాస్థాయిలోకి నిలబడిందనే చెప్పాలి. ఇక మళ్ళీ కల్కి సినిమాతో వెయ్యి కోట్ల మార్కును టచ్ చేసిన ఈ బ్యానర్ ప్రస్తుతం ఒకప్పటి పూర్వ వైభవాన్ని సంతరించుకుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఏది ఏమైనా కూడా రాబోయే సినిమాలతో కూడా సత్తా చాటడానికి వైజయంతి మూవీస్ బ్యానర్ సిద్ధమవుతోంది.

    మరి ఈ బ్యానర్ ని నిలబెట్టిన ఘనత కూడా నాగ్ అశ్విన్ కే దక్కుతుంది. అశ్విని దత్ కూతురు అయిన ప్రియాంక దత్ ను పెళ్లి చేసుకున్న నాగ్ అశ్విన్ ఆ బ్యానర్ భాద్యతలను తీసుకొని తను సినిమాలు చేస్తున్నారు.

    ఇక అలాగే మిగతా యంగ్ డైరెక్టర్లను కూడా ఎంకరేజ్ చేస్తూ ఆ బ్యానర్లో సినిమాలు చేయించే విధంగా ముందుకు దూసుకెళ్తున్నాడు. తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటి ని క్రియేట్ చేసుకున్న నాగ్ అశ్విన్ దర్శకుడి గానే కాకుండా అటు ప్రొడ్యూసర్ గా కూడా వైజయంతి మూవీస్ బ్యానర్ ను నిలబెట్టి రెండు రకాల బాధ్యతలను కొనసాగిస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు…

    ఇక వైజయంతి మూవీస్ అధినేత అయిన అశ్విని దత్ కూడా మాట్లాడుతూ తన అల్లుడు అయిన నాగ్ అశ్విన్ వల్లే మళ్ళీ తమ బ్యానర్ నిలబడిందని చెప్పడం విశేషం… ఇక ఏది ఏమైనా కూడా ఒకప్పటి పెద్ద బ్యానర్ మళ్ళీ పూర్వ వైభవాన్ని సంతరించుకోవడం అనేది నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి…