Hyderabadi Biryani : ‘తిండి కలిగితె కండ కలదోయ్.. కండ కలవాడేను మనిషోయ్’ అని గురజాడ వారు ఎప్పుడో చెప్పారు. శరీర పోషణకు ఆహారం అత్యంత అవసరం. అయితే అది కూడా పరిమితిమికి లోబడి ఉంటేనే మేలు. లేదంటే ఇబ్బందులు తప్పవు. ఇప్పుడు వంట స్టయిల్ పూర్తిగా మారిపోయింది. ఆయా దేశాల్లో దొరికే ఇంగ్రిడియన్స్ (ఆహార పదార్థాలు)ను బట్టి ఆహారం తయారు చేస్తున్నారు. నోటికి రుచికరమైన ఆహారాన్ని ఆస్వాదిస్తూ తింటే వేగంగా జీర్ణమై పోషణ లభిస్తుంది. ఇదంతా కాస్త పక్కన పెడితే ఫుడ్ గైడ్ అయిన ‘ట్రావెల్ గైడ్ టేస్టీ అట్లాస్’ ఇటీవల 2024-25 ప్రపంచ ఆహార అవార్డులను ప్రకటించింది. మొత్తం 15478 వంటలు పోటీ పోటీ పడగా.. మన హైదరాబాద్ బిర్యానీ 31వ ర్యాంకును దక్కించుకుంది. ఇంకా ముర్గ్ మఖానీ అకా బటర్ చికెన్ – 29వ ర్యాంక్, చికెన్ 65 – 97, కీమా – 100వ ర్యాంక్ దక్కించుకున్నాయి. ఇక మొదటి స్థానంలో కొలంబియాకు చెందిన వంటకం ‘లెచోనా’ నిలిచింది. ఇక దక్షిణ భారత్ వంటకాలను రుచి చూపించే రెస్టారెంట్ల జాబితాలో ఐటీసీ కోహినూర్ మూడో స్థానంలో నిలిచింది. ప్రపంచంలోని అత్యంత ఎక్కువ మంది ఇష్టపడే వంటకాల్లో భారతీయ వంటలు మొదటి స్థానంలో ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రతీ సంవత్సరం ఒక కొత్త వంటకాన్ని ఇంటర్ డ్యూస్ చేసేందుకు మన చెఫ్ లు ఎప్పుడూ రెడీగానే ఉంటారు. ‘ట్రావెల్ గైడ్ టేస్టీ అట్లాస్’ వంటకాల్లో మొదటి 12 లో మన వంటకాలు లేనప్పటికీ అనేక వంటకాలు మాత్రం వాటి వాటి ప్లేస్ ను ఆక్రమించుకున్నాయి.
టాప్ 10 స్థానాల్లో ఉన్న వంటకాలు
10 పిజ్జా నెపోలెటానా (ఇటలీ)
పిజ్జా నెపోలెటానా ప్రపంచంలోని ఇష్టమైన వంటల్లో ఒకటి. ఇది తాజా మోజారెల్లా, టాంగీ టొమాటోలు, సువాసనగల తులసీ ఆకులతో, ఐకానిక్ చెక్కతో తయారు చేస్తారు.
09 పికానా (బ్రెజిల్)
పికానా అనేది చుర్రస్కో (బార్బెక్యూ) పట్ల బ్రెజిల్‌కు ఉన్న ప్రేమను చూపిస్తూ, పరిపూర్ణంగా కాల్చిన గొడ్డు మాంసం సున్నితమైన, సువాసనగల ఆహార పదార్థం. దీని రుచి, క్రిస్పీ ఫ్యాట్ క్యాప్ బ్రెజిలియన్ స్టీక్‌హౌస్‌లలో దీన్ని ఇష్టమైనదిగా చేస్తుంది.
08 రెచ్టా (అల్జీరియా)
రెచ్టా అనేది అల్జీరియా సంప్రదాయ వంటకం, ఇందులో చేతితో తయారు చేసిన నూడుల్స్, రిచ్, సుగంధ ధ్రవ్యాలతో తయారు చేస్తారు. దీన్ని ఎక్కువగా వేడుకల్లో తయారు చేస్తారు.
07 ఫానెంగ్ కర్రీ (థాయ్‌లాండ్)
ఇది కొబ్బరి పాలు, సుగంధ మూలికలతో రుచిగా ఉండే క్రీము స్పైసీ థాయ్ వంటకం. స్వీట్, సాల్ట్, క్రిస్పీగా ఉంటుంది.
06 అసడో (అర్జెంటీనా)
అర్జెంటీనా వంటకమైన BBQ, అసడో అనేది రుచికరమైన వంటకం. ఇది కేవలం వంటకం మాత్రమే కాదు. ఇది ఒక సామాజిక సంస్కృతి, కమ్యూనిటీ-ఆధారిత వంటకం.
05 కోకర్ టైమ్ కబాబ్ (టర్కీ)
కోకర్ టైమ్ కబాబ్ అనేది టర్కిష్ వంటకం. ఇది బంగాళా దుంపలు, వెల్లుల్లి పెరుగుతో లేత దూడ మాంసం స్ట్రిప్స్‌తో తయారు చేస్తారు. దీని గొప్ప లేయర్డ్ రుచి టర్కిష్ వంటకాల్లో పాక రత్నంగా మార్చింది.
04 రావన్ (ఇండోనేషియా)
రావన్ అనేది కెలుక్ గింజలతో తయారు చేసే సంప్రదాయ ఇండోనేషియా బ్లాక్ బీఫ్ సూప్. ఇది ప్రత్యేకమైన వగరు, మట్టి రుచిని కలిగి ఉంటుంది. ఇది ఇండోనేషియా విభిన్న ఆహార సంస్కృతిని ప్రతిబింభిస్తుంది.
03 కాగ్ కబాబ్ (టర్కీయే)
కాగ్ కబాబ్ తూర్పు టర్కీయే నుంచి స్కేవర్డ్ లాంబ్ స్పెషాలిటీ, బహిరంగ మంటకం. దీని జ్యూసీ, స్మోకీ ఫ్లేవర్లు, మోటైన తయారీ పద్ధతి దీన్ని ప్రత్యేకంగా నిలిపాయి.
02 టిబ్స్ (ఇథియోపియా)
టిబ్స్ అనేది రుచికరమైన ఇథియోపియన్-స్టైల్ స్టైర్-ఫ్రై, ఇది ఉల్లిపాయలు, మిరియాలు, సుగంధ ద్రవ్యాలతో లేత మాంసానికి ప్రసిద్ధి చెందింది. ఇది ఇథియోపియన్ వంటకాలలో అత్యంత కీలకమైనదిగా చెప్తారు.
టేస్ట్ అట్లాస్ ద్వారా ఉత్తమమైనవిగా అవార్డు పొందిన వంటకాల పూర్తి జాబితా ఇక్కడ ఉంది
Mahendra is a Senior Political Content writer who has very good knowledge on Business stories. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Hyderabad biryani was ranked 31st in the 2024 25 world food awards by travel guide tasty atlas
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com