Allu Arjun Arrested: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ని కాసేపటి క్రితమే హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆయన పై 105, 118(1), రెడ్ విత్ 3/5 BNS సెక్షన్ల క్రింద నాన్ బెయిలబుల్ కేసులు నమోదు అయ్యాయి. హైదరాబాద్ సంధ్య థియేటర్ లో ప్రీమియర్ షో చూసేందుకు వచ్చిన అల్లు అర్జున్, ఆ సమయంలో వేలాది గా తరళి వచ్చిన అభిమానుల కారణంగా తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ మృతి చెందిన ఘటన సంచలనం గా మారింది. దీనిపై సోషల్ మీడియా లో అల్లు అర్జున్ పై తీవ్రమైన వ్యతిరేకత ఏర్పడింది. రెండు రోజుల తర్వాత అల్లు అర్జున్ ఈ ఘటన పై స్పందిస్తూ, రేవతి కుటుంబానికి సంతాపం తెలిపి, 25 లక్షలు ఆర్థిక సహాయం చేసాడు. కానీ ఈ ఘటన పై తెలంగాణ పోలీస్ చాలా ఫైర్ అయ్యింది. అల్లు అర్జున్ మీద FIR నమోదు చేసింది.
ఇదంతా పక్కన పెడితే అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయడానికి వచ్చిన సమయంలో ఆయన పోలీసులతో మాట్లాడిన కొన్ని మాటలు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది. తన భార్య స్నేహా రెడ్డి ఏడుస్తుండగా, ఆమెని ఓదారుస్తాడు అల్లు అర్జున్. చేతిలో కాఫీ ని పట్టుకొని తాగుతూ , సార్ కాఫీ అయిపోయింది వస్తున్నా అని అంటాడు. అప్పుడు పోలీసులు మమ్మల్ని క్షమించండి సార్, పై నుండి ఆర్డర్స్ వచ్చాయి, అందరూ ఈ ఘటనపై చాలా సీరియస్ గా ఉన్నారు అని అంటాడు. అప్పుడు అల్లు అర్జున్ మీరు రావడం లో , నన్ను తీసుకొని వెళ్లడం లో ఎలాంటి తప్పు లేదు సార్, నేను వస్తాను. కానీ మీరంతా నేరుగా నా బెడ్ రూమ్ కి రావడం, షర్ట్ మార్చుకొని వస్తాను అని చెప్పినా కూడా వినకపోవడం, నాకు కాస్త బాధ ని కలిగించింది.
ఇది కరెక్ట్ కాదు సార్, ప్రవర్తించే తీరు ఇది కాదు అని అంటాడు అల్లు అర్జున్. ఒక పాన్ ఇండియన్ సూపర్ స్టార్ ఇంట్లోకి పోలీసులు ఇలా చొచ్చుకుపోయి అరెస్ట్ చేసుకొని తీసుకొని వెళ్లడం ఇప్పటి వరకు ఎప్పుడూ జరగలేదు. సాక్ష్యాత్తు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లపై సోషల్ మీడియా లో రామ్ గోపాల్ వర్మ వంటి వారు దిగజారి మార్ఫింగ్ వీడియోలు వేస్తే పట్టించుకోని పోలీసులు మన ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్నారు. కానీ తెలంగాణ లో ఏకంగా పాన్ ఇండియన్ సూపర్ స్టార్ ఇంటి బెడ్ రూమ్ లోకి వెళ్లి అరెస్ట్ చేసారు. రెండు ప్రభుత్వాలకు ఎంత తేడా ఉందో చూడమని సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరోపక్క అల్లు అర్జున్ అరెస్ట్ పై ఇతర హీరోల అభిమానులు కూడా విచారం వ్యక్తం చేస్తున్నారు.
సంధ్య థియేటర్ ఘటన కేసులో అల్లు అర్జున్ అరెస్ట్ ..#alluarjun #pushpa2 #alluarjunarrest #tv9telugu #breakingnews pic.twitter.com/xbph6jYHGS
— TV9 Telugu (@TV9Telugu) December 13, 2024