Indian LPG Ship: పశ్చిమాసియా సంక్షోభం ప్రపంచ ఇంధన సరఫరాను దెబ్బతీసింది. ఆర్మోస్ మూసివేతతో సప్లయ్ చైన్ దెబ్బతిన్నది. దీంతో ఇంధన సంక్షోభం రోజు రోజుకూ పెరుగుతోంది. భారత నౌకలు హర్మూజ్దా దాటేందుకు ఇరాన్ అనుమతి ఇచ్చినా ఉద్రిక్తతల నేపథ్యంలో చాలా నూకలు అక్కడే చిక్కుకుపోయాయి. రెండున్నర నెలల వ్యవధిలో కేవలం 14 నౌకలు మాత్రమే భారత్ కు వచ్చాయి. తాజాగా భారత నౌకాదళం సహకారంతో 15వ నౌక హర్మూజ్ దాటింది. మిగిలినవి ఎప్పుడు వస్తాయో చెప్పలేని పరిస్థితి.
ఎల్ పీ జీ నౌకల సురక్షిత ప్రయాణం..
హర్మూజ్ జలసంధి ప్రపంచ గ్యాస్ సరఫరాలు 20 శాతం ఈ మార్గం గుండా జరుగుతుంది. తాజాగా భారత్ కు చెందిన ఏం వీ సన్ షైన్ నౌక హర్మూజ్ దాటింది. భారత నౌకాదళం, అంతర్జాతీయ ఏజెన్సీల సహాయంతో ఈ నౌక సురక్షితంగా తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. ఇందులో 1,200 మెట్రిక్ టన్నుల ఎల్ పీ జీ ఉంది. .
ఇరాన్ హామీ మేరకు..
ఇరాన్ ఉపవిదేశాంగ మంత్రి కాజెమ్ ఘరీబ్బాదీ హర్మూజ్ పరిస్థితులు మెరుగుపడుతాయని హామీ ఇచ్చారు. శాంతి పునరుద్ధరణ తర్వాత భద్రతా ప్రమాణాలు మరింత బలపడతాయని చెప్పారు. అమెరికా దౌత్య నిబద్ధత లేకపోవడాన్ని విమర్శించారు. తమవి అంతర్జాతీయ చట్టాలకు అతీతం కాదని స్పష్టం చేశారు. ఈ వాగ్దానాలు
భారత్ 85 శాతం ఎల్ పీ జీ ని దిగుమతి చేసుకుంటుంది. ఇందులో 50 శాతం పర్షియన్ గల్ఫ్ నుంచే జరుగుతుంది. తాజా ఉద్రిక్తతల కారణంగా దేశంలో ఎల్ పీ జీ ధరలు 15 శాతం పెరిగాయి. సంక్షోభం ముగిస్తే మార్కెట్ స్థిరపడుతుంది. తాజా నౌక భారత్ కు చేరితే ఎల్ పీ జీ కష్టాలు కొంత వరకు తీరుతాయి.