Hormuz Strait Alternative Project Gulf Countries: ఇరాన్, అమెరికా–ఇజ్రాయెల్ వార్.. గల్ఫ్ దేశాలను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. ఇరాన్ గల్ప్ దేశాలపై ప్రతీకార దాడులు చేస్తోంది. మరోవైపు హార్మూజ్ జలసంధిని మూసివేసింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఇంధన సరఫరాకు బ్రేక్ పడింది. తాజాగా అమెరికా, ఇజ్రాయెల్ మినహా మిగతా దేశాల నౌకలకు అనుమతి ఇస్తామని ప్రకటించింది. కానీ, ఇరాన్ అమర్చిన వాటర్ మైన్‌ల భయం వెంటాడుతోంది. ఇప్పటికే థాయ్‌లాండ్ నౌక పేలిపోయింది. ఈ నేపథ్యంలో హార్మూజ్ ఇరాన్ ఆధీనంలో ఉండడంతో పెట్రోలియం రవాణాకు అంతరాయం కలిగింది.
గల్ఫ్ దేశాలకు నష్టం..
హార్మూజ్ మూసివేతతో గల్ఫ్ దేశాలు ఆయిల్ ఉత్పత్తిని తగ్గించాయి. మూడు దేశాల్లో ఉత్పత్తిని పూర్తిగా నిలిపివేశాయి. రవాణా ఆగిపోయిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నాయి. మరోవైపు ఇరాన్ గల్ఫ్ దేశాల ఆయిల్ రిఫైనరీలను టార్గెట్ చేస్తోంది. దీంతో ఆర్థికంగా నష్టపోతున్నాయి. ఈ నేపథ్యంలో గల్ఫ్ దేశాలు సరికొత్త ఆలోచన చేస్తున్నాయి. ప్రత్యామ్నాయ మార్గంపై దృష్టిపెట్టాయి.
ప్రత్యామ్నాయ ప్రతిపాదన..
పర్షియన్ గల్ఫ్‌ను అరేబియా సముద్రంతో డైరెక్ట్‌గా లింక్ చేసే భారీ కాలువ నిర్మాణాన్ని పరిశీలిస్తున్నాయి. ఇది ప్రపంచ చమురు 20% ప్రవాహానికి హార్ముజ్ రిస్క్‌ను తొలగించి, భద్రమైన ఎగుమతి మార్గాన్ని అందిస్తుంది. ప్రస్తుతం చర్చా దశలోనే ఉంది, ఇది పూర్తయితే గ్లోబల్ ఇంధన లాజిస్టిక్స్‌ను మార్చివేస్తుంది.
మూడు కాలువలు..
సల్మాన్ కాలువ సౌదీలో 950 కిలోమీటర్ల పొడవు, రుబ్ అల్–ఖాలీ మధ్యస్థం. రెడ్ సీ లేదా గల్ఫ్ ఆఫ్ ఏడెన్‌కు లింక్ అవుతుంది. ఇది విజన్ 2030లో భాగం. యూఏఈ – ఒమన్ కాలువ 48 కిలో మీటర్లు(30 మైళ్లు), దుబాయ్ సమీపం నుంచి ఫుజైరా వరకు. ఇరాన్ ప్రభావం లేకుండా ఉంటుంది. అరేబియన్ కాలువ 75 కిలో మీటర్ల పొడవు, 150 నుంచి 500 మీటర్ల వెడల్పు ఉంటుంది. దీనిని యూఏఈ ప్రతిపాదించింది. హార్ముజ్ 33 కిలోమీటర్ల వెడల్పు మాత్రమే ఉంటుంది. తాజా యుద్ధంతో 700లకుపైగా నౌకలు చిక్కుకున్నాయి. ప్రతాయమ్నాయ కాలువల నిర్మాణం జరిగితే సౌదీ, యూఏఈ, ఖతార్ ఎగుమతులు సురక్షితం. దీంతో హార్ముజ్ ప్రాధాన్యం తగ్గుతుంది.
జీసీసీ కూటమి చర్చలు జరుగుతున్నాయి. షార్ట్–టర్మ్ పైప్‌లైన్‌లు (ఈస్ట్–వెస్ట్) సహాయం. దీర్ఘకాలంలో ఇది మధ్యప్రాచ్య డైనమిక్స్‌ను మారుస్తుంది. భారత్ వంటి దేశాలకు ఎంతో మేలు జరుగుతుంది.