Homeటాప్ స్టోరీస్Telangana Govt Jobs Age Limit: వయోపరిమితి పెంచి ఏం లాభం.. నోటిఫికేషన్ల జాడేది రేవంతూ..?

Telangana Govt Jobs Age Limit: వయోపరిమితి పెంచి ఏం లాభం.. నోటిఫికేషన్ల జాడేది రేవంతూ..?

Telangana Govt Jobs Age Limit: మేం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం.. టీఎస్‌పీఎస్సీని ప్రక్షాళణ చేస్తాం. జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటించి ఏటా ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తాం.. ఇవీ ఎన్నికల సమయంలో టీపీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీలు. 2023 డిసెంబర్‌లో కాంగ్రెస్‌ సర్కార్‌ కొలువుదీరింది. రేవంత్‌రెడ్డి సీఎం అయ్యారు. కానీ ఇప్పటికీ 2 లక్షల ఉద్యోగులు కాదు అందులో పావు వంతు కూడా భార్తీ చేయలేదు. గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లు, పరీక్ష నిర్వహించిన వాటి ఫలితాలు ప్రకటించారు. జాబ్‌ క్యాలెండర్‌ మొక్కుబడిగా విడుదల చేసినా దానిని పాటించేది లేదు. 2026 ప్రారంభమై ఆరు నెలలు కావస్తోంది. ఈ ఏడాది ఇప్పటి వరకు ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్‌ లేదు. కానీ తాజాగా నిరుద్యోగులకు శుభరవ్తా అంటు రేవంత్‌ సర్కార్‌ ఉద్యోగ నియామకాల్లో గరిష్ట వయోపరిమితిని 44 ఏళ్లకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఏడాదిపాటు అమలు..
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో గరిష్ఠ వయోపరిమితిని 44 సంవత్సరాలకు పెంచుతూ తాజా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సడలింపు ఒక సంవత్సరంపాటు అమల్లో ఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది. పోలీసు, యూనిఫాం సర్వీసులకు అయితే ఈ సౌకర్యం వర్తించదు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఇప్పటికే పదేళ్లుపాటు సడలింపు ఇచ్చి, మరో రెండేళ్లు పొడిగించిన తర్వాత ఇప్పుడు మరో ఏడాది అంతర్జాలం జోడించింది. నిరుద్యోగుల అభ్యర్థన మేరకు వయోపరిమితి పెంచామని ప్రభుత్వం చెబుతుంది. మరి నిరుద్యోగులు జాబ్‌ నోటిఫికేషన్లు కావాలని అడుగుతున్నారు. కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. మరి నోటిఫికేషన్లు మాత్రం ఇవ్వడం లేదు.

నిజమైన లాభం ఉందా?
గరిష్ఠ వయోపరిమితిని పెంచడం ద్వారా 35–40 ఏళ్ల మధ్య ఉన్న యువకులు ఇంకా కొంతకాలం అవకాశం కోసం వేచి ఉండవచ్చు. ఇది వారి ఆశలను కాపాడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఉద్యోగ నోటిఫికేషన్లే రాకపోతే వయోపరిమితి పెంచడం వల్ల ప్రయోజనం ఏమిటి? అని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. సంవత్సరాలుగా తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు ఆలస్యం అవుతున్నాయి. ఖాళీలు ఉన్నా, ప్రకటనలు ఆలస్యంగా వెలువడుతున్నాయి. ఈ పరిస్థితిలో వయసు పెంచి యువకులను మరో ఏడాది ఎదురుచూపు వరుసలో ఉంచడం మినహా ప్రయోజనం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. నిజమైన పరిష్కారం ఉద్యోగాలు భర్తీ చేయడం, సకాలంలో నోటిఫికేషన్లు ఇవ్వడం.

పదేళ్ల సడలింపు తర్వాత కూడా ఎదురు చూపులే..
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత గరిష్ఠ వయోపరిమితిని పదేళ్లపాటు సడలించడం ద్వారా ప్రభుత్వం నిరుద్యోగులకు పెద్ద ఉపశమనం ఇచ్చినట్లు చెప్పుకుంది. పెద్దగా ఉద్యోగాలు భర్తీ చేయలేదు. తర్వాత మరో రెండేళ్లు పొడిగించింది. ఇప్పుడు మళ్లీ ఒక పొడిగించారు. ఇంతకాలం సడలింపు ఇచ్చినా, ఉద్యోగావకాశాలు తగినంతగా పెరగకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ పరిస్థితి యువతను నిరాశకు గురి చేస్తోంది. వయసు పెరిగేకొద్దీ ప్రైవేట్‌ రంగంలో కూడా అవకాశాలు తగ్గుతాయి. ఫలితంగా, చాలా మంది యువకులు ఉద్యోగాలు కోల్పోయి, మధ్య వయసులో నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. వయోపరిమితి సడలింపు ఈ సమస్యను పరిష్కరించడం లేదు, కేవలం కాలం గడపడానికి సహాయపడుతోంది. వయోపరిమితి పెంచడం ఒక్కటే పరిష్కారం కాదు. సకాలంలో ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలి. ఖాళీలను త్వరగా భర్తీ చేయాలి. పోటీ పరీక్షల ప్రక్రియను సులభతరం చేయాలి.యువతకు నైపుణ్యాభివద్ధి శిక్షణలు అందించి, ప్రైవేట్‌ రంగ అవకాశాలను కూడా పెంచాలి.

నిరుద్యోగ సమస్యను ఎదుర్కోవడానికి తాత్కాలిక ఉపాయాలు కన్నా దీర్ఘకాలిక వ్యూహాలు అవసరం. వయసు పెంచడం ద్వారా ఆశలు కల్పించడం మంచిదే కానీ, ఆ ఆశలను నెరవేర్చే ఉద్యోగాలు లేకపోతే ఇది కేవలం రాజకీయ హామీగా మిగిలిపోతుంది. యువత భవిష్యత్తు ప్రభుత్వ ఉద్యోగాలపైనే ఆధారపడకూడదు. అయినప్పటికీ, ప్రభుత్వ బాధ్యతగా సకాలంలో అవకాశాలు కల్పించడం తప్పనిసరి. వయోపరిమితి పెంపు ఒక్కటే కాకుండా, నిజమైన ఉద్యోగ సృష్టి వైపు ప్రభుత్వం దృష్టి సారించాలి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular