Hezbollah enters battlefield: ఇరాన్‌పై అమెరికా–ఇజ్రాయెల్ దాడి ఇప్పుడు కొత్త రూపం దాలుస్తోంది. పరిణామాలు చూస్తుంటే మూడో ప్రపంచయుద్ధంగా మారుతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. యుద్ధం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు కుప్ప కూలాయి. ఇరాన్‌కు మద్దతుగా లెబనాన్ రణరంగంలోకి దిగింది. అమెరికాకు జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్ మద్దుతు తెలిపాయి. ఎయిర్ బేస్‌లు ఓపెన్ చేశాయి.
యుద్ధరంగంలోకి లెబనాన్..
ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మరణం తర్వాత ఇజ్రాయెల్‌తో ఇరాన్ ఘర్షణ ఆగలేదు. హెజ్బొల్లా, హౌతీలు ఇజ్రాయెల్‌పై దాడులు మొదలు పెట్టారు. దీంతో లెబనాన్ యుద్ధరంగంలోకి దిగింది. ఇది ఖమేనీ హత్యకు ప్రతీకార చేస్తున్న దాడిగా నిపుణులు పేర్కొంటున్నారు. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ బైరూత్లో హెజ్బొల్లా స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఎదురుదాడి చేపట్టింది.
హెజ్బొల్లా చరిత్రాత్మక నేపథ్యం
హెజ్బొల్లా 1982లో ఇజ్రాయెల్ లెబనాన్ ఆక్రమణకు ప్రతిస్పందనగా ఇరాన్ మద్దతుతో ఏర్పడిన షియా మైలిటెంట్ సంస్థ. 1983–85లో అమెరికా, ఫ్రాన్స్ శిబిరాలపై బాంబు దాడులు, 2006లో 34 రోజుల యుద్ధంలో ఇజ్రాయెల్‌ను దెబ్బతీసిన చరిత్ర ఉంది. ఇప్పుడు ఇరాన్ ’ప్రతిఘటన అక్షం’లో కీలక భాగంగా పనిచేస్తూ లక్షలాది క్షిపణులు, డ్రోన్లతో యుద్ధానికి సిద్ధమైంది.
ప్రతీకార వ్యూహం
ఖమేనీ మరణాన్ని అవకాశంగా పొందిన హెజ్బొల్లా, ఇజ్రాయెల్ సైనిక బేస్‌లు, సరిహద్దు ప్రాంతాలపై క్షిపణులు ప్రయోగించింది. ఇది ఇరాన్ ప్రాక్సీ శక్తుల ద్వారా ప్రతీకారాన్ని కొనసాగించే ప్రయత్నం చేస్తోంది. లెబనాన్‌లోని షియా ప్రజల మద్దతును ఆకర్షిస్తూ సంస్థ బలాన్ని పెంచుకుంటోంది. గతంలో హసన్ నస్రుల్లా హత్య తర్వాత కూడా ఇలాంటి దాడులు చేసిన చర్యలు ఉద్రిక్తతను పెంచాయి.
Also Read: ఇరాన్ పై అమెరికా దాడి.. పాకిస్తాన్ ఎంత పనిచేసింది?
ఇజ్రాయెల్ ప్రతి దాడులు..
ఐడీఎఫ్ బైరూత్ కేంద్రంలో హెజ్బొల్లా కీలక నాయకులను, ఆయుధ డిపోలను టార్గెట్ చేసి విమానాలతో దాడులు చేస్తోంది. డ్రోన్ సాంకేతికత, ఇంటెలిజెన్స్‌తో నాయకులను కచ్చితంగా ఎదుర్కొనే వ్యూహం దీనిలో ఉంది. 2006 యుద్ధంలో 1200 మంది లెబనాన్ పౌరులు మరణించారు. కానీ ఈసారి పౌరులకు ఇబ్బంది కలుగకుండా ఐటీఎఫ్ యుద్ధం చేస్తోంది.
అమెరికాకు అండగా..
ఇదిలా ఉంటే. ఇరాన్‌పై యుద్ధం ప్రకటించిన అమెరికాకు ప్రాన్స్, జర్మనీ, బ్రిటన్ మద్దతు ప్రకటించాయి. ప్రస్తుతం యుద్ధరంగంలోకి రాకపోయినా. యుద్ధం కొనసాగితే ఇరాన్ ప్రతీకార దాడులు కొనసాగిస్తే.. ఈ మూడు దేశాలు అమెరికా తరఫున యుద్ధం చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ మూడు దేశాల్లోని ఎయిర్ బేస్‌లను తెచిచాయి. ఇరాన్ ఇస్లామిక్ దేశాల్లోని అమెరికా, ఇజ్రాయెల్ స్థావరాలను టార్గెట్ చేస్తుంది. ఇందో సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్‌లోని అమెరికా స్థావరాలపై దాడులు చేస్తోంది.
ఇరాన్ మద్దతుతో హెజ్బొల్లా బలపడటం సరియాకు, హౌతీలకు కూడా ప్రేరణగా మారవచ్చు. అమెరికా మద్దతు ఇస్తున్న ఇజ్రాయెల్, బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్ ప్రతిఘటనలు ప్రపంచ యుద్ధానికి దారితీసే ప్రమాదం ఉంది.