H-1B visa Rules
H-1B visa : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఆ దేశంలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఇప్పటికే 38 వేల మంది అక్రమ వలసదారులను వారి దేశాలకు పంపించారు. మరికొందరిని అరెస్టు చేసి జూల్లో పెట్టారు. ఇక ఇమ్మిగ్రేషన్స్ నిబంధనలు కఠినం చేశారు. తాజాగా వీసా జారీలో సవరణలు చేశారు. సరికొత్త వ్యవస్థను తీసుకురావాలని నిర్నయించారు. ఫారిన్ లేబర్ యాక్సెస్ గేట్వే(Foregin Labor Axess getway) వ్యవస్థలో ఐదేళ్ల కంటే పాత రికార్డులు, దరఖాస్తులను మార్చి 20 నుంచి తొలగించనున్నారు. దీంతో హెచ్–1బీ వీసా ప్రోగ్రామ్లో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి.
Also Read : అమెరికాలో భారతీయ విద్యార్థి అరెస్ట్.. కారణం ఇదే..
పాత రికార్డులు తొలగింపు..
తాజా ఆదేశాల ప్రకారం, మార్చి 20 నుంచి ఐదేళ్ల కంటే పాత రికార్డుల(Old Records)ను సిస్టమ్ నుంచి తొలగిస్తారు. ఉదాహరణకు, 2020 మార్చి 22న ఒక దరఖాస్తుపై తుది నిర్ణయం వెలువడి ఉంటే, 2025 మార్చి 22న ఆ రికార్డు తొలగించబడుతుంది. ఉద్యోగులకు సంబంధించి ఐదేళ్ల కంటే పాత వీసా రికార్డులను మార్చి 19లోగా డౌన్‌లోడ్(Down load)చేసుకోవాలని సంస్థలకు సూచించారు. లేకపోతే ఆ రికార్డులు కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. హెచ్–1బీతో పాటు తాత్కాలిక మరియు శాశ్వత లేబర్ సర్టిఫికేషన్ దరఖాస్తులపై ఈ తొలగింపు ప్రభావం చూపనుంది. ఆఫీస్ ఆఫ్ ఫారిన్ లేబర్ సర్టిఫికేషన్ ఈ మార్పులకు సంబంధించి నోటీసులు జారీ చేసింది.
కొత్తగా దరఖాస్తు ప్రక్రియ..
ఇక వీసా కోసం త్వరలో యూఎస్ ఇమ్మిగ్రేషన్(Immigration)విభాగం కొత్త దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించనుంది. ఈ నిర్ణయం దరఖాస్తుదారులకు పారదర్శక సేవలు అందించేందుకేనని ట్రంప్ ప్రభుత్వం తెలిపింది. అందుకే పాత రికార్డులను తొలగిస్తున్నామని వివరించింది. 2025 నుంచి హెచ్–1బీ వీసా జారీలో కొత్త విధానం అమలులోకి రానుంది. ఇకపై ఒక లబ్ధిదారు బహుళ దరఖాస్తులు సమర్పించినా, అవి ఒకే అప్లికేషన్‌గా పరిగణించబడతాయి. రిజిస్ట్రేషన్ల సంఖ్యతో సంబంధం లేకుండా అందరికీ సమాన అవకాశాలు కల్పించేందుకు ‘కేంద్రీకృత–ఎంపిక ప్రక్రియ’ని అమలు చేస్తున్నట్లు యూఎస్ పౌరసత్వ, వలస సేవల విభాగం (USCIS) పేర్కొంది. కొన్ని సంస్థలు బహుళ రిజిస్ట్రేషన్ల ద్వారా లాటరీ విధానంలో అనుచిత లాభాలు పొందుతున్నాయని, దీన్ని అరికట్టేందుకు ఈ నిబంధనలు తీసుకొచ్చామని వెల్లడించింది.
Also Read : అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తెలంగాణకు చెందిన మగ్గురు మృతి