Indian Student
Indian Student : అమెరికా హమాస్‌పై గుర్రుగా ఉంది. డొనాల్డ్ ప్రంప్(Donald Trump) బాధ్యతలు చేపట్టాక.. హమాస్ వద్ద ఉన్న ఇజ్రాయోల్ బందీలను విడిపించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో కారుల్ప విరమన ఒప్పందం చేయించారు. దీంతో హమాస్ కొంత మందిని విడిచిపెట్టింది. కానీ, ఇంకా చాలా మంది బందీలుగా ఉన్నారు. దీంతో ఇజ్రాయోల్ హమాస్‌పై దాడులు కొనసాగిస్తోంది. మరోవైపు అమెరికా హమాస్(Hamas)ను అంతం చేసి గాజాను ఆక్రమించుకోవాలని చూస్తోంది. ఈ క్రమంలో హమాస్ మద్దతుదారులపైనా చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో ఇటీవలే భారతీయ విద్యార్థిని రంజనీ శ్రీనివాసన్(Ranjani Srinivasan)ను బహిష్కరించింది. దీంతో సదరు విద్యార్థిని ఇండియాకు తిరిగి వచ్చింది. తాజాగా మరో విద్యార్థి బదర్‌ఖాన్ సూరీ(Bhadur Khan Suri)ని అమెరికా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హమాస్ ఉగ్రవాదులతో అతనికి సంబంధాలున్నాయనే ఆరోపణల నేపథ్యంలో ఈ అరెస్టు జరిగినట్లు సమాచారం.
Also Read : అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తెలంగాణకు చెందిన మగ్గురు మృతి
స్టూడెంట్ వీసాపై..
బదర్ ఖాన్ సూరి స్టూడెంట్ వీసాపై అమెరికాలో ఉంటున్నాడు. వాషింగ్టన్ డీసీలోని జార్జ్ టౌన్ యూనివర్సిటీలో పోస్ట్ డాక్టోరల్ పరిశోధకుడిగా పనిచేస్తున్నాడు. సూరి హమాస్కు మద్దతుగా యూనివర్సిటీలో ప్రచారం చేస్తున్నాడని డిపారŠెట్మంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (DHS) అసిస్టెంట్ సెక్రటరీ ట్రిసియా మెక్‌లాఫ్లిన్ ఆరోపించారు. అంతేకాకుండా, ఉగ్రవాద సంస్థలోని పలువురితో అతనికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఆమె తెలిపారు. ఈ కారణంగా అతని వీసాను రద్దు చేసినట్లు పేర్కొన్నారు. ఫెడరల్ ఏజెంట్లు సోమవారం వర్జీనియాలోని అతని ఇంటి వెలుపల అతన్ని అరెస్టు చేశారు.
కోర్టులో సవాల్..
అయితే, తన అరెస్టును సూరి ఇమ్మిగ్రేషన్ కోర్టులో సవాల్ చేశాడు. తనకు ఎలాంటి నేర చరిత్ర లేదని, తన భార్యకు పాలస్తీనా మూలాలు ఉన్నందునే తనను లక్ష్యంగా చేసుకున్నారని కోర్టులో వాదించినట్లు సమాచారం. ఈ ఘటనపై జార్జ్ టౌన్ యూనివర్సిటీ స్పందిస్తూ, బదర్ ఖాన్ సూరి డాక్టోరల్ పరిశోధకుడిగా ఉన్నాడని, అతను చట్టవిరుద్ధమైన చర్యల్లో పాల్గొన్నాడనే విషయం తమకు తెలియదని తెలిపింది. ఈ కేసుకు సంబంధించి బహిరంగ విచారణకు పూర్తి మద్దతు ఇస్తున్నామని, కోర్టు న్యాయబద్ధమైన తీర్పు ఇస్తుందని ఆశిస్తున్నామని ఒక ప్రకటనలో పేర్కొంది.
పాలస్తీనాకు మద్దతుగా ఆందోళనలు..
పాలస్తీనాకు మద్దతుగా ఆందోళనలు చేస్తున్న విద్యార్థులపై ట్రంప్ సర్కారు కఠిన చర్యలు తీసుకుంటోంది. గత ఏప్రిల్లో అమెరికాలోని పలు విశ్వవిద్యాలయాల్లో పాలస్తీనాకు మద్దతుగా ఆందోళనలు జరిగాయి. దీంతో సుమారు 2,000 మంది ఆందోళనకారులను అరెస్టు చేశారు. ఇటీవల కొలంబియా యూనివర్సిటీలో కూడా ఇలాంటి నిరసనలు చోటు చేసుకున్నాయి. వీటికి మద్దతు తెలిపిన భారతీయ విద్యార్థిని రంజనీ శ్రీనివాసన్ వీసాను DHS రద్దు చేసింది. దీంతో ఆమె స్వీయ బహిష్కరణకు గురైనట్లు అధికారులు వెల్లడించారు.
ఎవరీ బదర్ ఖాన్ సూరి
బదర్ ఖాన్ సూరి 2020లో ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయంలో చదివాడు. విద్యార్థి వీసాపై అమెరికాకు వెళ్లాడు. జార్జ్ టౌన్ యూనివర్సిటీలో పోస్ట్ డాక్టోరల్ ఫెలోగా ఉన్నాడు. ఇరాక్, ఆఫ్ఘనిస్థాన్లలో శాంతి నిర్మాణంపై పరిశోధనలు చేస్తున్నట్లు యూనివర్సిటీ తెలిపింది. అతని భార్య మాఫెజ్ సలేహ్ గాజాకు చెందిన వ్యక్తి మరియు అమెరికా పౌరసత్వం కలిగి ఉంది. ప్రస్తుతం ఆమె జార్జ్ టౌన్ యూనివర్సిటీలో చదువుతోంది.