Homeఅంతర్జాతీయంGoogle CEO: తనకు ఇష్టమైన పండుగ ఇదేనన్న గూగుల్ సీఈవో.. ఎలా జరుపుకున్నారంటే?

Google CEO: తనకు ఇష్టమైన పండుగ ఇదేనన్న గూగుల్ సీఈవో.. ఎలా జరుపుకున్నారంటే?

Google CEO: కాంతుల పండుగ దీపావళి, ఈ పండుగ అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు. ఇతర మతాల వారికి కూడా దీపావళి అంటే సంతోషకరమైన పండుగే. అందుకే క్రిస్ట్రియన్లు వారి పూర్వీకుల శ్మశానంలో సమాదుల వద్ద దీపాలు వెలిగిస్తారు. వారి వారి ఆచారాలకు తగ్గట్లుగా దీపావళి జరుపుకుంటారు. దేశంలోనే కాదు విదేశాల్లో సైతం దీపావళి ఆనందోత్సాహాల మధ్య నిర్వహించుకుంటారు. ప్రవాసులు ఎక్కడ ఉంటే అక్కడ దీపాల వరుస ఉండాల్సిందే. సాధారణ వ్యక్తులే కాదు విదేశాల్లో స్థిరపడిన గొప్ప గొప్ప వారు కూడా ఈ పండుగను ఆనందంగా జరుపుకుంటారు. గతేడాది బ్రిటన్ మాజీ పీఎం రిషి సునాక్ తన కుటుంబంతో వేడుకలు నిర్వహించుకొని సోషల్ మీడియాలోని వివిధ ప్లాట్ ఫారాల్లో పిక్ లు షేర్ చేశారు. ఆల్ఫాబెట్, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కూడా దీపావళిని ఆనందగా జరపుకున్నారట. తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. దీపాల పండుగపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. ఆయన ప్రజలకు శుభకాంక్షలను థ్రెడ్ ద్వారా చెప్పారు. ఈ పోస్ట్ లో ఇలా రాశారు.

హృదయపూర్వక పోస్ట్‌లో, పిచాయ్ ఇలా రాశాడు. ‘ఈ సంవత్సరంలో నాకు ఇష్టమైన సమయాల్లో దీపావళి ఒకటి.. ఇంటిని కాంతితో నింపేందుకు ఎప్పుడూ సరదాగా ఉంటుంది. దీపావళిని జరుపుకునే వారికి శుభాకాంక్షలు.’ అని చెప్పారు. దీపాల పండుగ అని కూడా పిలువబడే దీపావళిని నిన్న, అంటే అక్టోబర్ 31న నిర్వహించుకున్నారు. 14 సంవత్సరాల ‘వనవాసం’ ముగిసిన తర్వాత శ్రీరాముడు అయోధ్యకు తిరిగి వచ్చినందుకు గుర్తుగా ఈ పండుగను జరుపుకున్నారు.

14 ఏళ్లు రామయ్య పాలనకు దూరమైన అయోధ్య వాసులు, రాముడు తిరిగి వస్తున్నాడని, ఆయోధ్యను ఏలుతాడని తెలిసి అయోధ్య ప్రజలు భారీ వేడుకలు చేసుకున్నారు. దీపాలు వెలిగించడం ద్వారా ప్రభువు రాముడికి, దేవుడికి స్వాగతం పలికినట్లు లెక్క. కుటుంబ సభ్యులు కలిసి పండుగ చేసుకోవడం, రంగులు అలంకరించడం, పూలు, మామిడి తోరణాలు కట్టడం, విద్యుత్ దీపాల లైటింగ్‌ ఏర్పాటు చేశారు.

గూగుల్ లో వేడుకలు..
గూగుల్ ఇండియా దీపావళి సంబురాల్లో వినూత్న విధానంతో చేరింది. కంపెనీ తన అధికారిక ఇన్‌ స్టా హ్యాండిల్‌లో అందమైన రంగోలి డిజైన్‌ను షేర్ చేసింది. డిజైన్‌లో QR కోడ్‌ను పొందుపరిచింది. గూగుల్ పే ద్వారా ‘దీపావళి షాగున్స్‌ని పొడిగించమని’ వినియోగదారులను ప్రోత్సహించింది.

Mahi
Mahihttp://oktelugu.com
Mahendra is a Senior Political Content writer who has very good knowledge on Business stories. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular