Hero Krishna Kota Srinivasa Rao: తెలుగు సినిమా ఇండస్ట్రీలో కోట శ్రీనివాసరావుకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఆయన చేసిన చాలా సినిమాలు అతనికి గొప్ప గుర్తింపును సంపాదించి పెట్టాయి. 50 సంవత్సరాల కెరియర్ లో 750 కి పైగా చిత్రాల్లో నటించి నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. తెలుగు వాళ్ళ హృదయాల్లో చిరస్మరణీయంగా నిలిచిపోయిన కోటా శ్రీనివాసరావు చనిపోవడం తెలుగు ప్రేక్షకులను తీవ్రమైన దిగ్బ్రాంతి కి గురిచేసిందనే చెప్పాలి. మరి ఇలాంటి సందర్భంలోనే కోట శ్రీనివాసరావు కెరియర్లో ఎన్నో సత్కారాలు జరిగితే అంతకుమించిన అవమానాలు కూడా జరిగాయనే విషయం మనలో చాలామందికి తెలియదు…
ఇక గతం లో సీనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టి సీఎం అయిన తర్వాత ఎన్టీఆర్ కి కృష్ణ గారికి మధ్య కొన్ని విభేదాలైతే తలెత్తాయి. అందులో భాగంగానే కృష్ణ ఎన్టీఆర్ ని ఉద్దేశించి ఆయనను విమర్శిస్తూ కొన్ని సినిమాలైతే చేశాడు. అందులో భాగంగానే మండలాధీశుడు (Mandaladhishudu) అనే సినిమాలో కోట శ్రీనివాసరావు చేత ఎన్టీఆర్ పాత్రను వేయించి దానిని చెడుగా చిత్రీకరించే ప్రయత్నం అయితే చేశారు. దాంతో ఎన్టీఆర్ అభిమానులు కోట గారి పట్ల తీవ్రమైన కోపానికి గురయ్యారు. కోట శ్రీనివాసరావు దొరికితే కొడదాం అనేంత కోపం లో వాళ్ళు ఉన్నారట. ఒకానొక సమయంలో ఎన్టీఆర్ విజయవాడ వెళ్ళినప్పుడు ఆ రైల్వేస్టేషన్ కి కోట శ్రీనివాసరావు కూడా అనుకోకుండా వెళ్లాల్సి వచ్చింది. అయితే అక్కడ ఎన్టీఆర్ ని చూడడానికి వచ్చిన చాలామంది అతని అభిమానులు తనని చూస్తే కొడతారేమో అనే ఉద్దేశంతో కోట శ్రీనివాసరావు పక్కకు దాక్కున్నాడట. అయినప్పటికి ఒక వ్యక్తి కోట శ్రీనివాసరావు ను చూసి గట్టిగా అరవడంతో కొంతమంది అతన్ని రైల్వేస్టేషన్ పక్కకి తీసుకెళ్లి కొన్ని దెబ్బలు అయితే కొట్టారట.
ఇక అక్కడ ఉన్న కొంతమంది పెద్దవాళ్లు వారించి అతన్ని కొడుతున్న వాళ్లను పక్కకు నెట్టేయడంతో కోట శ్రీనివాసరావు కొన్ని దెబ్బలను తిని తప్పించుకున్నాడు… ఇక ఈ దెబ్బతో కోట మరోసారి తన లైఫ్ లో అలాంటి పాత్రను చేయకూడదని నిశ్చయించుకున్నారట. ఇక కోట గారు ఆ తర్వాత ఎట్టకేలకు ఎన్టీఆర్ ను కలిసి అతనికి క్షమాపణలు చెప్పాలనే ఉద్దేశ్యంతో ఎన్టీఆర్ ను కలవడానికి ట్రై చేశారట.
ఇక ఎట్టకేలకు ఒకరోజు ఎన్టీఆర్ ఎయిర్ పోర్ట్ కి వస్తున్నాడని తెలుసుకొని కోట శ్రీనివాసరావు అక్కడికి వెళ్లి ఎన్టీఆర్ తో మాట్లాడడానికి ప్రయత్నం చేశారట. అది గమనించిన ఎన్టీఆర్ సైతం కోట శ్రీనివాసరావును తన దగ్గరికి పిలిపించుకొని మాట్లాడట. తను అనుకోకుండా అలాంటి పాత్రను చేశానని క్లారిటీ అయితే ఇచ్చారట.
దాంతో సీనియర్ ఎన్టీఆర్ సైతం నవ్వుతూ మీరు మంచి నటుడు ఇక మీదట కూడా మంచి పాత్రలను చేసి గొప్ప స్థాయికి వెళ్లాలని కోరుకుంటున్నాను అనడంతో ఒకసారిగా కోట శ్రీనివాసరావు ఎన్టీఆర్ కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకున్నాడట… ఇక మొత్తానికైతే అప్పటినుంచి ఆ గొడవ సర్దుమనిగిందనే చెప్పాలి…అయితే మండలదీశుడు సినిమాకి కమిట్ అయినప్పుడు కోట పెద్ద నటుడు కాదు. దాంతో ముందుగా తన పాత్ర ఏంటో చెప్పలేదని షూట్ కి వెళ్ళాక ఆ పాత్ర ఏంటో చెప్పారని తెలియజేశాడు. దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆ పాత్ర చేశానని పలు ఇంటర్వ్యూల్లో కోట క్లారిటీ ఇచ్చారు…
#RIPKotaSrinivasaRao
మీ నటన తెలుగు సినిమా ఎప్పటికీ మర్చిపోదు. మీరు పండించిన హాస్యం అప్పటి తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోరు. తెలుగు సినీ పరిశ్రమలో మీరు ఒక అధ్యాయం
చాలా విలక్షణమైన పాత్రలు నటించిన
అందరి అభిమాన నటుడు కోటా గారు ఆ లోకంలో ఉన్నా
మా గుండెల్లో చిరకాలం ఉండిపోతారు pic.twitter.com/g7KvKSePlN— Baba my heart Tarak Anna (@fakhruddin0452) July 13, 2025