Ram Charan-Allu Arjun : గత కొంతకాలం నుండి మెగా, అల్లు కుటుంబాల మధ్య ఎదో జరుగుతుంది అంటూ మీడియా లో చర్చలు జరగడం మనమంతా గమనిస్తూనే ఉన్నాం. అల్లు అర్జున్(Allu Arjun) ఎన్నికల సమయంలో నంద్యాల కి వెళ్లి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థికి ప్రచారం చేసినప్పటి నుండి అభిమానుల మధ్య గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి. అల్లు అర్జున్ కానీ, అల్లు అరవింద్(Allu Aravind) కానీ దీనిపై క్లారిటీ ఇవ్వాలని అనుకోలేదు. కానీ ఇటీవల ‘గేమ్ చేంజర్’ మూవీ పై ‘తండేల్(Thandel Movie)’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అల్లు అరవింద్ సెటైర్లు వేయడం, ఆ తర్వాత మెగా అభిమానులు అల్లు అరవింద్ పై తీవ్రమైన ట్రోల్స్ వేయడం వంటివి మనం చూస్తూనే ఉన్నాం. గొడవ తారాస్థాయికి చేరుకోవడంతో అల్లు అరవింద్ రీసెంట్ గా జరిగిన ‘తండేల్’ ప్రెస్ మీట్ లో రామ్ చరణ్(Ram Charan) అభిమానులకు క్షమాపణలు చెప్పి, ఉద్దేశపూర్వకంగా చేసిన కామెంట్స్ కావని, కేవలం దిల్ రాజు(Dil Raju) ని ఉద్దేశించి చేసిన కామెంట్స్ అని, అభిమానుల మనసులు నొచ్చుకొని ఉండుంటే దయచేసి క్షమించండి అంటూ చెప్పుకొచ్చాడు.
దీంతో మెగా, అల్లు కుటుంబ అభిమానుల మధ్య గొడవలు తగ్గుతాయేమో అని అంతా అనుకున్నారు. కానీ నేడు ఇంస్టాగ్రామ్ లో అల్లు అర్జున్ ని రామ్ చరణ్ అన్ ఫాలో చేయడం సోషల్ మీడియా లో సెన్సేషనల్ టాపిక్ అయ్యింది. ఇటీవల కాలంలో అల్లు అర్జున్ ప్రవర్తనలో వచ్చిన మార్పులు రామ్ చరణ్ కి ఏమాత్రం నచ్చలేదట. అందుకే అల్లు అర్జున్ అరెస్ట్ సమయంలో అతన్ని కలవడానికి కూడా చరణ్ సుముఖత చూపించలేదని అంటున్నారు. మొన్న అల్లు అరవింద్ చేసిన వ్యాఖ్యలకు ఆయన విసుగెత్తిపోయి, మొత్తానికే అల్లు కుటుంబాన్ని బ్యాన్ చేసే స్టేజ్ కి వచ్చేశాడట. అల్లు అర్జున్ ని అయితే అన్ ఫాలో కొట్టాడు కానీ, ఆయన తమ్ముడు అల్లు శిరీష్ ని మాత్రం ఫాలో అవుతూనే ఉన్నాడు రామ్ చరణ్.

ఒకప్పుడు ఎంతో అన్యోయంగా మెలిగిన ఈ కజిన్ బ్రదర్స్, ఇప్పుడు ఇలా దూరం అవ్వడం పై వీళ్ళిద్దరిని కామన్ గా అభిమానించే అభిమానులు చాలా బాధపడుతున్నారు. కలిసుంటే కలదు సుఖం, దేశం గర్వించదగ్గ హీరోలుగా పిలవబడే ఈ ఇద్దరు ఒకప్పటి లాగా కలిసుంటే ఎన్నో అద్భుతాలు సృష్టించొచ్చు. విడిపోతే మాత్రం ఇరువురికి నష్టమే. ఇకపోతే ప్రస్తుతం రామ్ చరణ్ ‘గేమ్ చెంజర్’ చిత్రంతో ఫ్లాప్ ఫేస్ లోనూ, అదే విధంగా అల్లు అర్జున్ ‘పుష్ప 2’ తో హిట్ ఫేస్ లోనూ కొనసాగుతున్నారు. హిట్స్, ఫ్లాప్స్ అనేవి ఏ హీరోకి అయినా సర్వసాధారణం. ఈరోజు ఫ్లాప్స్ లో ఉన్నటువంటి రామ్ చరణ్, రేపటి రోజున అల్లు అర్జున్ ని దాటే రేంజ్ హిట్ కొట్టొచ్చు. ప్రస్తుతం ఆయన బుచ్చి బాబు తో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంతో ఆయన కం బ్యాక్ వేరే లెవెల్ లో ఉంటుందని అంటున్నారు అభిమానులు.