France President love story : ఇమాన్యుల్ వయసు 47 సంవత్సరాలు. అతడి సతీమణి పేరు బ్రిగెట్టా. ఆమె వయసు 72 సంవత్సరాలు. ఇద్దరి మధ్య వ్యత్యాసం 25 సంవత్సరాలు.. తనకంటే 25 సంవత్సరాలు పెద్దదైన బ్రిగెట్టాను ప్రేమలో పడేసాడు అంటే ఇమాన్యుయల్ మామూలు వాడు కాదు. ఇటీవల వియత్నాం పర్యటనకు ఇమాన్యుయల్ తన భార్య బ్రిగెట్టాతో కలిసి వెళ్ళాడు. విమానాశ్రయంలో ఇమాన్యుయల్ ను ఆయన సతీమణి తోసి వేసింది. ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ చర్చకు దారి తీసింది. ఆ ఘటన తర్వాత వారిద్దరి మధ్య బేధాభిప్రాయాలు చోటుచేసుకున్నాయని ఫారిన్ మీడియా రాయడం మొదలుపెట్టింది. అయితే దీనిపై ఇమాన్యుయల్ స్పందించారు. ఎటువంటి గొడవలు లేవని.. అది మా ఇద్దరి మధ్య జరిగిన సరదా సంభాషణ అని పేర్కొన్నారు.
Also Read : కోడలికి రూ.2,209 కోట్ల కానుక.. ఇంత మంచి మామ ఎవరో తెలుసా?
అలా మొదలైంది
1993లో ఇమాన్యుయల్ బ్రిగెట్టా ను తొలిసారి కలుసుకున్నారు. అప్పటికి ఆమె వయసు 39 సంవత్సరాలు. ఫ్రాన్స్ లోని ఆనియన్స్ పట్టణంలోని కేథలిక్ లై సి లా ప్రావిడెన్స్ ప్రాంతంలోని ఓ స్కూల్లో ఆమె టీచర్ గా పని చేసేవారు. అప్పటికి ఇమాన్యుల్ వయసు 15 సంవత్సరాలు మాత్రమే. పైగా అతడికి ఆమె టీచర్ గా పని చేసేది. అప్పటికే ఆమెకు ఆండ్రి లూయిస్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. వారికి ముగ్గురు కుమార్తెలు. పైగా పెద్ద కుమార్తె, ఇమాన్యుయల్ ఒకటే క్లాసు కూడా. అయితే 1994లో ఇమ్మానుయేల్, బ్రిగెట్టా స్విమ్మింగ్ పూల్ లో ఈత కొడుతుండగా కుటుంబ సభ్యులు చూశారు. ఆ తర్వాత ఆండ్రి లూయిస్ బ్రిగెట్టా కు విడాకులు ఇచ్చాడు.. అయితే ఇమాన్యుయల్ 15 సంవత్సరాల వయసు ఉన్నప్పటికీ అతడు ఎంతో పరిపక్వతతో వ్యవహరించేవాడు. పైగా అతడు విద్యార్థిగా ఉన్నప్పుడు టీచర్లతోనే ఎక్కువగా మాట్లాడేవాడు.. ఉన్నత చదువులు చదువుతున్నప్పటికీ ఇమాన్యుయల్ బ్రిగెట్టా తో తన రిలేషన్ కొనసాగించాడు.
2007లో వివాహం
2007లో ఆమెను పెళ్లి చేసుకున్నాడు.. అయితే 1974లో బ్రిగెట్టా కు తొలి వివాహం లి టాంక్ వేట్ బీచ్ లో జరిగింది. రెండవ వివాహం కూడా అక్కడే జరగడం విశేషం.. ఇక 2014లో ఇమాన్యుల్ ఫైనాన్స్ మినిస్టర్ గా బాధ్యతలు స్వీకరించారు. అతడికి అండగా ఉండడానికి బ్రిగెట్టా ఉద్యోగానికి రాజీనామా చేశారు. అధ్యక్ష ఎన్నికల సమయంలో వీరిద్దరూ చేసిన ప్రచారం ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.. అయితే ఆ మధ్య ఓ మహిళతో ఇమాన్యుయల్ రహస్య సంబంధం కొనసాగిస్తున్నాడని వార్తలు వచ్చాయి. దానిని బ్రిగెట్టా తీవ్రంగా ఖండించింది. ఆ సమయంలో ఆమె బాధపడింది.. కన్నీటి పర్యంతమైంది. మీడియాకు క్లారిటీ కూడా ఇచ్చింది. అయితే “మా ఇద్దరి మధ్య ప్రేమ ఏమాత్రం తగ్గలేదని.. అది తగ్గదని” బ్రిగెట్టా స్పష్టత ఇవ్వడంతో ఆ వివాదానికి తెరపడింది.