Rishabh Pant : దీంతో వచ్చే సీజన్ కు లక్నో జట్టుకు రిషబ్ పంత్ సారథిగా ఉండడని.. అసలు ఆటగాడిగా కూడా ఆ జట్టులో ఉండడని ప్రచారం మొదలైంది. ఇదే క్రమంలో ఇటీవల గుజరాత్ జట్టుపై విజయం సాధించడంతో ఒక్కసారిగా అంచనాలు మారిపోయాయి. ఫలితంగా పంత్ నాయకత్వంపై కాస్త నమ్మకం ఏర్పడింది. ఇప్పుడు ఆ నమ్మకం మరింత బలపడే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే టాప్ -2 లో చోటు కోసం బెంగళూరు జట్టుకు గెలవాల్సిన పరిస్థితి.. మరోవైపు టోర్నీ ముగింపు మ్యాచ్ ను గెలుపుతోనే పూర్తి చేయాలని పట్టుదల లక్నో జట్టుది.. మొత్తంగా ఈ రెండు జట్ల మధ్య జరుగుతున్న పోరాటం నువ్వా నేనా అన్నట్టుగా సాగుతోంది. అయితే ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్న లక్నో మాత్రం దుమ్ము రేపుతోంది.. ముఖ్యంగా ఆ జట్టు కెప్టెన్ పంత్ చాలా రోజుల తర్వాత సూపర్ నాక్ ఆడాడు. ఇన్ని రోజులపాటు తనపై వస్తున్న ఆరోపణలకు బ్యాటింగ్ ద్వారా సమాధానం చెప్పాడు. తిరుగులేని షాట్లు ఆడుతూ మైదానం నలుమూలల బంతిని పరుగులు పెట్టించాడు. ఒకానొక దశలో మార్ష్ తో కలిసి టెర్రిఫిక్ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ సీజన్లో చివరి మ్యాచ్లో సెంచరీ చేసి ఆకట్టుకున్నాడు. 55 బంతులు ఎదుర్కొన్న అతడు పది ఫోర్లు, ఆరు సిక్సర్లతో అదరగొట్టాడు.. రెండో వికెట్ కు మార్ష్ తో కలిసి 152 పరుగులు జోడించాడు. అంతేకాదు బెంగళూరు బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటు.. తిరుగులేని స్థాయిలో పరుగులు తీశాడు.
Also Read : సన్ రైజర్స్ పై హెచ్ సీఏ వేధింపులు… సీఎం రేవంత్ కు విజిలెన్స్ సంచలన నివేదిక
వాస్తవానికి ఇప్పటివరకు రిషబ్ పంత్ తనదైన శైలిలో ఆడింది లేదు. ఇలా రావడం.. అలా వెళ్లిపోవడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. తద్వారా అతనిపై విపరీతమైన ఒత్తిడి పెరిగింది. ఈ క్రమంలో అతని బ్యాటింగ్ ఆర్డర్ కూడా పూర్తిగా మారిపోయింది. కొన్ని సందర్భాల్లో అయితే ఏడవ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చాడు. అయినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. ఇక కొన్ని సందర్భాల్లో అయితే వన్ డౌన్ గా కూడా వచ్చాడు. ప్రత్యర్థి బౌలర్ల ఉచ్చులో చిక్కుకొని విలవిలలాడిపోయాడు. ఈ సమయంలో అతనిపై విమర్శలు వ్యక్తమయ్యాయి. ఒకానొక సందర్భంలో అతడు జట్టు నుంచి వెళ్లిపోతాడని.. వచ్చే సీజన్లో కొత్త కెప్టెన్ లక్నో జట్టుకు నాయకత్వం వహిస్తాడని ప్రచారం కూడా జరిగింది. అయితే వాటిల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ.. ప్రస్తుతానికైతే పంత్ చేసిన సెంచరీ.. అతనిపై ఉన్న ఒత్తిడి మొత్తం తగ్గించినట్టే అని చెప్పుకోవాలి. మరోవైపు టెస్ట్ జట్టుకు అతడు ఉప నాయకుడిగా ఇటీవల ప్రమోషన్ పొందాడు. మొత్తంగా చాలా కాలం తర్వాత పంత్ ఫామ్ లోకి రావడంతో అతని అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఇదే సమయంలో లక్నో యజమాని సంజీవ్ కూడా మైదానంలో చిరునవ్వులు చిందించడం విశేషం. సెంచరీ చేసిన అనంతరం రిషబ్ పంత్ మైదానంలో ఎగిరి గంతులు వేశాడు. జిమ్నాస్టిక్ విన్యాసాలు చేశాడు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో ప్రభంజనం సృష్టిస్తున్నాయి.
This is the reason why Pant should bat in Powerplay, Hoping he does it more in IPL 2026 and results will come. pic.twitter.com/xLBMeMq2D6
— Johns. (@CricCrazyJohns) May 27, 2025

