IPL 2025: : ఇప్పటికే ఐపీఎల్ లో శ్రేయస్ అయ్యర్ సేన టాప్ లోకి వచ్చేసింది. ముంబై జట్టుతో జరిగిన మ్యాచ్లో విజయ విహారం చేయడంతో అయ్యర్ సేన టాప్ లో కొనసాగుతోంది. అయితే అయ్యర్స్ అయిన తర్వాత స్థానంలో స్థిరపడే అవకాశం బెంగళూరు జట్టుకు ఉంది. కాకపోతే ప్రస్తుతం లక్నో జట్టుతో జరుగుతున్న మ్యాచ్ లో కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి బెంగళూరుకు ఉంది. అందువల్లే ఆ జట్టు టాస్ గెలవగానే బౌలింగ్ ఎంచుకుంది. అయితే టాస్ పట్రియలో బెంగళూరు జట్టు తరుపున కెప్టెన్ రజత్ పాటిదార్ కనిపించలేదు. అతని స్థానంలో జితేష్ శర్మ టాస్ ప్రక్రియలో పాల్గొన్నాడు. ఇటీవల చెన్నై జట్టుతో జరిగిన మ్యాచ్లో రజత్ పాటిదార్ గాయపడ్డాడు.ఆ గాయం నుంచి అతడు కోలుకోలేదు. అందువల్లే అతడు హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్లో అందుబాటులో లేకుండా పోయాడు. హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్లో బెంగళూరు జట్టుకు జితేష్ శర్మ నాయకత్వం వహించాడు. దురదృష్టవశాత్తు గెలవాల్సిన మ్యాచ్లో బెంగళూరు ఓటమిపాలైంది. ద్వారా ప్లే ఆఫ్ ముందు టాప్ -2 అవకాశాలను అత్యంత సంక్లిష్టం చేసుకుంది. ఈ క్రమంలో లక్నోతో జరుగుతున్న ప్రస్తుత మ్యాచ్లో గెలవాల్సిన పరిస్థితి బెంగళూరుకు ఏర్పడింది.
బ్యాటింగ్ చేయడానికి వస్తాడా?
బెంగళూరు తాత్కాలిక సారధి చెప్పిన మాటల ప్రకారం ఇంపాక్ట్ ప్లేయర్ గా ఇప్పటివరకు సారధిగా వ్యవహరించిన పాటిదార్ రంగంలోకి దిగే అవకాశం కనిపిస్తోంది. ఇదే విషయాన్ని బెంగళూరు జట్టు తాత్కాలిక కెప్టెన్ జితేష్ శర్మ స్పష్టం చేశాడు. ” జట్టుకు ఇది అత్యంత కీలకమైన మ్యాచ్. ఇందులో గెలిస్తేనే టాప్ -2లోకి వెళ్లే అవకాశం ఉంది. అది జరగాలంటే జట్టు బలోపేతంగా ఉండాలి. గాయం వల్ల రజత్ పాటిదార్ ఫీల్డింగ్ లోకి రాలేదు. పైగా కెప్టెన్సీ కూడా తీసుకోలేదు. తాత్కాలికంగా నాకే ఆ బాధ్యతలను మేనేజ్మెంట్ అప్పగించింది. ఈ క్రమంలో బ్యాటింగ్ చేయడానికి ఇంపాక్ట్ ఆటగాడిగా రజత్ పాటిదార్ రంగంలోకి దిగే అవకాశం ఉందని” జితేష్ శర్మ పేర్కొన్నాడు.
బెంగళూరు జట్టు తాత్కాలిక సారధిగా జితేష్ శర్మ వ్యవహరిస్తున్నాడు. అయితే అతడు లక్నో జట్టుతో జరుగుతున్న మ్యాచ్లో టాస్ గెలిచినప్పటికీ బౌలింగ్ ఎంచుకోవడం ప్రతికూల ప్రభావాన్ని చూపించినట్టు కనిపిస్తోంది. ఎందుకంటే లక్నో బ్యాటర్లను ఇబ్బంది పెట్టడంలో బెంగళూరు బౌలర్లు విఫలమయ్యారు. పైగా లక్నో సారధి రిషబ్ పంత్ శతకం సాధించడంతో .. భారీ స్కోరు చేసింది. ఈ సీజన్లో చివరి మ్యాచ్ ఆడుతున్న రిషబ్ పంత్ సేన 20 ఓవర్లను పూర్తిస్థాయిలో వినియోగించుకొని.. కేవలం మూడంటే మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి.. 227 రన్స్ చేసింది. అయితే ఈ రన్స్ సమయంలో బెంగళూరు అదరగొడుతోంది. ఈ కథనం రాసే సమయం వరకు నాలుగు ఓవర్లు పూర్తిస్థాయిలో ఆడి.. 50 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ 23, సాల్ట్ 26 పరుగులతో క్రీజ్ లో ఉన్నారు.