ఐపీఎల్ చరిత్రలో తొలిసారి ఒకే రోజు ఒకే సమయంలో రెండు మ్యాచ్ లు జరగనున్నాయి. లీగ్ దశలో అక్టోబర్ 8న జరగాల్సిన రెండు మ్యాచ్ లు సాయంత్రం 7.30 గంటలకు ప్రారంభం అవుతాయని బీసీసీఐ ఒక ప్రకటలో తెలిపింది. గ్రూప్ దశలలో ఇలా రెండు మ్యాచ్ లు ఏకకాలంలో ప్రారంభం కానుండటం ఐపీఎల్ చరిత్రలో ఇదే తొలిసారి. షెడ్యూల్ ప్రకారం సన్ రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ మధ్య మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా సాయంత్రం 7.30 గంటలకు ఢిల్లీ, బెంగళూరు జట్ల మ్యాచ్ ఉంది.

అయితే ఈ రెండు మ్యాచ్ లు సాయంత్రం 7.30 గంటలకే ప్రారంభమవుతాయని బీసీసీఐ స్పష్టం చేసింది. ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ భీటీ ఉండటం వల్లే షెడ్యూల్ లో మార్పులు చేస్తున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. అయితే ఐపీఎల్ ఒకే రోజు రెండు మ్యాచ్ లు నిర్వహించడం సర్వ సాధారణమే. మధ్యాహ్నం ఒక మ్యాచ్ నిర్వహిస్తుండగా అది ముగిసిన తర్వాత రెండో మ్యాచ్ జరుగుతున్నది. అయితే ఐపీఎల్ 2021 లో చివరి లీగ్ మ్యాచ్ లు అక్టోబర్ 8న జరగాల్సి ఉన్నది.
ఆ రోజు జరిగే రెండు మ్యాచ్ లలో ఒకటి అబుదాబిలో, మరోకటి దుబాయ్ లో నిర్వహించాల్సి ఉంది. అయితే అదే వేదికల్లో రాత్రి 7.30 గంటలకే రెండు మ్యాచ్ లు జరగనున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. అయితే ఈ మ్యాచ్ లు ఒకే సమయంలో నిర్వహించడానికి కారణాలు మాత్రం బీసీసీఐ వెల్లడించలేదు.