https://oktelugu.com/

America : అమెరికాలో ఆ పనిచేస్తూ పట్టుబడ్డ ఐదుగురు తెలుగు యువకులు.. ఇలా తయారయ్యారేంట్రా..!

అగ్రరాజ్యం అమెరికాలో మోసాలకు పాల్పడుతూ అక్కడి పోలీసులకు చిక్కుతున్నారు. ఇటీవలే వైద్య మృగాడిని అతడి భార్య పిర్యాదు మేరకు పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఇక ఇటీవలే హెచ్‌–1బీ వీసాల అవకతవకల్లో తెలుగు వ్యక్తి పేరు బయటకు వచ్చింది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : August 22, 2024 / 04:56 PM IST

    Telugu Youth Arrest in america

    Follow us on

    America :  అగ్రరాజ్యం అమెరికాకు భారతీయులు విద్య, ఉద్యోగం, ఉపాధి నిమిత్తం వెళ్తున్నారు. చాలా మంది అక్కడే స్థిరపేందుకు గ్రీన్‌ కార్డు కోసం ప్రయత్నిస్తున్నారు. అన్ని రంగాల్లో అభిబృద్ధి చెందిన అమెరికాలో ఏ పొరపాటు చేసినా తప్పుచుకోలేరు. కానీ, కొంత మంది భారతీయులు అక్కడ కూడా తమ తెలివితే నేరాలు చేస్తున్నారు. కానీ, కాస్త ఆలస్యంగా అయినా పట్టుపడుతున్నారు. ఊచలు లెక్కిస్తున్నారు. ఇటీవలో హెచ్‌–1బీ వీసా స్కాం జరిగినట్లు గుర్తించిన అమెరికా నిఘా విభాగం.. ఇందులో భారతీయులు కీలకపాత్ర పోషించినట్లు నిర్ధారించింది. రెండు రోజుల క్రితం ఓ భారతీయ వైద్య మృగాడినీ అరెస్టు చేశారు అమెరికా పోలీసులు. సదరు వైద్యుడు కొన్నేళ్లుగా చిన్నారులు, మహిళల నగ్న చిత్రాలు, వీడియోలు రికార్డు చేశాడు. ఎట్టకేలకు భార్య ఫిర్యాదుతో అతడి అరాచకాలు వెలుగులోకి రావడంతో ఇటీవల ఆక్లాండ్‌ కౌంటీ పోలీసులు అరెస్టు చేశారు. ఇక తాజగా వ్యభిచారం కేసులో ఐదుగురు తెలుగు యువకులను అమెరికా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పంజాబ్‌లో బార్బర్‌ షాపు పెట్టుకున్నట్లు.. పాశ్చాత్య పోకడలకు కేరాఫ్‌ అయిన.. అమెరికాలో.. తెలుగు యువకులు వ్యభిచారం చేయించడం.. పోలీసులకు పట్టుపడడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

    ఏం జరిగిందంటే..

    అమెరికాలో తెలుగు యువకులు వ్యభిచారం కేసుల్లో చిక్కుకోవడం కలకలం సృష్టించింది. టెక్సాస్‌లోని డెంటన్‌లో వ్యభిచారం చేస్తూ ఏడుగురు భారతీయులు అరెస్ట్‌ అయ్యారు. అందులో ఐదుగురు తెలుగువారు ఉన్నారు. రెండు రోజుల క్రితం డెంటన్‌ కౌంటీ షెరీఫ్‌ కార్యాలయం వ్యభిచారాన్ని అరికట్టడానికి హాయ్‌ల్యాండ్‌ విలేజ్‌ పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ సహకారంతో నిర్వహించిన స్టింగ్‌ ఆపరేషన్లలో మొత్తం 18 మంది పట్టుబడ్డగా అందులో ఏడుగురు భారతీయులు ఉన్నారు. అరెస్ట్‌ అయిన వారిలో నిఖిల్‌ బండి, మోనిష్‌ గల్లా, నిఖిల్‌ కుమ్మరి, జైకిరణ్‌ మేకలా, కార్తీక్‌ రాయపాటి తెలుగు వారిగా గుర్తించారు.

    చదువుల కోసం వెళ్లి..
    ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లి బాగా చదువుకుని అక్కడే ఉద్యోగం చేస్తూ డబ్బులు బాగా సంపాదిస్తున్నారని తల్లిదండ్రులు భావిస్తున్నారు. కానీ అక్కడికి వెళ్లిన యువకులు వ్యభిచారం ముఠాలో సభ్యులుగా ఉండి గలీజ్‌ దందా చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు. మొత్తం 18 మందిని డెంటాన్‌ కౌంటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 14 మంది వ్యభిచారం కేసులో పట్టుపడగా.. ఇద్దరు 18 ఏళ్లలోపు వారిని లైంగిక వేధింపులకు గురిచేసిన కేసులో అరెస్ట్‌ అయ్యారు. అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నారని మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిఖిల్‌ బండి, నిఖిల్‌ కుమ్మరిలపై అరెస్టు నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించారని అభియోగం మోపగా.. మోనిష్‌ గల్లా, కార్తీక్‌ రాయపాటి డబ్బు ఆశ చూపి వ్యభిచారం అభ్యర్థించారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.