Vettayan In OTT : గత ఏడాది జైలర్ మూవీతో భారీ బ్లాక్ బస్టర్ నమోదు చేశాడు రజినీకాంత్. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన ఈ మూవీ ర్. 600 కోట్లకు పైగా వరల్డ్ వైడ్ గ్రాస్ రాబట్టింది. నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. సినిమా సక్సెస్ నేపథ్యంలో రజినీకాంత్ కి రూ. 200 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ ముట్టినట్లు సమాచారం. చాలా కాలం అనంతరం రజినీకాంత్ తన స్థాయి హిట్ ఖాతాలో వేసుకున్నాడు. జైలర్ సక్సెస్ నేపథ్యంలో వేట్టయన్ మూవీ పై అంచనాలు ఏర్పడ్డాయి.
దసరా కానుకగా వేట్టయన్ అక్టోబర్ 10న వరల్డ్ వైడ్ విడుదల చేశారు. రజినీకాంత్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ రోల్ చేశారు. టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహించాడు. యధార్థ సంఘటనల ఆధారంగా వేట్టయన్ తెరకెక్కినట్లు సమాచారం. ఇక అమితాబ్, రానా, ఫహద్ ఫాజిల్ వంటి స్టార్ క్యాస్ట్ ఈ మూవీలో భాగమయ్యారు. సినిమాపై హైప్ నెలకొంది.
అయితే ఆశించిన స్థాయిలో మూవీ ఆడలేదు. కథలో విషయం ఉన్నప్పటికీ స్క్రీన్ ప్లే ఆకట్టుకోలేదు. రజినీకాంత్ క్యారెక్టరైజేషన్ కూడా అంత పవర్ఫుల్ గా లేదన్న వాదన వినిపించింది. వేట్టయన్ కి తెలుగులో కనీస ఆదరణ దక్కలేదు. డిజాస్టర్ అని చెప్పొచ్చు. తమిళంలో సైతం వేట్టయన్ ఆడలేదు. సినిమా అనుకున్న స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధం చేస్తున్నారు. వేట్టయన్ డిజిటల్ రైట్స్ అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. నవంబర్ 7 నుండి వేట్టయన్ స్ట్రీమింగ్ కానుంది.
అంటే విడుదలైన నాలుగు వారాల కంటే ముందే ఓటీటీలో వేట్టయన్ అందుబాటులోకి వస్తుంది. వేట్టయన్ మూవీ కథ విషయానికి వస్తే… అథియన్(రజినీకాంత్) ఎస్పీ. ఈయనకు ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ గా పేరుంటుంది. ఎందరో నేరస్తులను ఎన్కౌంటర్ లో లేపేసిన హిస్టరీ అతని సొంతం. ఓ మారుమూల గ్రామంలో గంజాయి దందా సాగిస్తుంటుంది ఒక ముఠా. స్కూల్ టీచర్ అయిన శరణ్య(దుషారా) ఆ ముఠా అకృత్యాలను ఎదిరిస్తుంది. అథియన్ ఆ గంజాయి ముఠా సభ్యులను ఎన్కౌంటర్ లో లేపేస్తాడు.
అయితే శరణ్య హత్యకు గురవుతుంది. అందుకు కారణమైన గుణ అనే వ్యక్తిని అథియన్ ఎన్కౌంటర్ చేస్తాడు. ఇది బూటకపు ఎన్కౌంటర్ అంటూ అమితాబ్ రంగంలోకి దిగుతాడు. అసలు శరణ్య హత్య వెనకుంది ఎవరు? అనేది అసలు కథ..