Rajender Meghwar: మన దేశం నుంచి విడిపోయి ఏర్పడిన పాకిస్తాన్.. ఇంతవరకు మన దేశంతో ఏ రంగంలోనూ పోటీ పడలేకపోతోంది. విద్య, వైద్యం, రవాణా, టెక్నాలజీ, వ్యవసాయం, తయారీ, రక్షణ ఇలా అన్ని రంగాలలో భారత్ పాకిస్తాన్ పై పైచేయి సాధించింది. లేపి బలివీకి లేపుకొచ్చి పాకిస్తాన్ మాత్రం ఉగ్రవాదం, ఆరాచకం, పైసాచిక రంగాలలో నెంబర్ వన్ గా ఉంది. విదేశీ పెట్టుబడులు లేక, విదేశీ మారకద్రవ్యం వచ్చే అవకాశాలు లేక, ఇతర దేశాలు ఇచ్చే అప్పుల మీద పాకిస్తాన్ మనుగడ కొనసాగిస్తోంది. దరిద్రమైన రోడ్లు, దుర్భరమైన పారిశుధ్యంతో దారుణమైన స్థితిని అనుభవిస్తున్నది. అయితే అలాంటి చోట ఓ భారతీయుడు మీసం మెలి తిప్పాడు. మామూలుగా కాదు అక్కడ ఏకంగా ఏసీపీగా నియమితులయ్యాడు. అతని పేరు రాజేందర్ మెగ్వార్.. సింధు ప్రావిన్స్ ప్రాంతంలో బదిన్ ప్రాంతానికి చెందిన అతడు పాకిస్తాన్లోని సెంట్రల్ సుపీరియర్ సర్వీస్ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు. టాప్ ర్యాంక్ సాధించి.. శిక్షణ కూడా పూర్తి చేసుకున్నాడు. అతడు ప్రస్తుతం పైసలాబాద్ ప్రాంతంలో ఎసిపి గా బాధ్యతలు స్వీకరించాడు. ఇతడితోపాటు రూపమతి అనే యువతి సెంట్రల్ సుపీరియర్ సర్వీసెస్ ఎగ్జామ్ లో ఉత్తీర్ణురాలైంది. పాకిస్తాన్లో మైనారిటీ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి తమ కృషి చేస్తామని రాజేందర్, రూపమతి పేర్కొన్నారు.
ఇదీ రాజేందర్ నేపథ్యం
భారతదేశ విభజన కు ముందు రాజేందర్ పూర్వికులు పంజాబ్ రాష్ట్రంలో జీవించేవాళ్లు. నాడు దేశ విభజన జరగడంతో వారి కుటుంబం పాకిస్తాన్ లో స్థిరపడింది. పాకిస్తాన్లో మైనారిటీలుగా రాజేందర్ కుటుంబం ఉంది. రాజేందర్ పూర్వీకులు వ్యవసాయం, ఇతర పనులు చేసుకుంటూ జీవించేవాళ్లు. సింధు ప్రావిన్స్ ప్రాంతంలో పంటలు సమృద్ధిగా పండుతాయి. దీంతో రాజేందర్ కుటుంబం ఇక్కడ వ్యవసాయం చేసుకుంటూ జీవించేది. కాలక్రమంలో రాజేందర్ ఉన్నత చదువులు చదివాడు. మైనారిటీ ప్రజల సమస్యల పరిష్కారం కోసం తనవంతుగా ఏదైనా చేయాలని భావించాడు. ఇందులో భాగంగానే సెంట్రల్ సుపీరియర్ సర్వీసెస్ లో ఉత్తీర్ణుడయ్యాడు. పైసలా బాద్ ఏసీపీగా నియమితుడయ్యాడు. భారతీయ మూలాలు ఉన్న వ్యక్తిగా.. ఏసీపీ గా నియమితుడై అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు.. రాజేందర్ ఎసిపిగా నియమితులైన తర్వాత.. అక్కడి ముస్లిం అధికారులు అతనికి శుభాకాంక్షలు తెలియజేయడం విశేషం. “రాజేందర్ మీకు శుభాకాంక్షలు. మీరు ఏసీపీ గా ఉద్యోగం సాధించడం గొప్ప విషయం. విధి నిర్వహణలో మీరు అంకిత భావాన్ని కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని” పాకిస్తాన్ పోలీస్ అధికారులు పేర్కొనడం విశేషం.