Taliban domestic violence law: ప్రపంచంలో స్త్రీ పురుషులు సమానంగా ఎదుగుతున్నారు. ఆకాశంలో సగం అన్నట్లు అన్నిరంగాల్లో మహిళలు రాణిస్తున్నారు. దీంతో మహిళలకు సమాన అవకాశాలు కల్పించేందుకు రిజర్వేషన్లు కూడా చేస్తున్నారు. వ్యవసాయ కూలీ నుంచి పైలెట్ వరకు.. రాకెట్‌లో అంతరిక్షంలోకి వెళ్లే వరకు ఎక్కడా మహిళ వెనుకడుగు వేయడం లేదు. దీంతో మహిళల రక్షణకు ప్రభుత్వాలు చట్టాలు కూడా చేస్తున్నాయి. పనిస్థలాల్లో వేధింపుల నేపథ్యంలో ఇలాంటివి అవసరం అవుతున్నాయి. మహిళ లేనిదే సమాజం లేదనేది సత్యం. మన దేశంలో మహిళలను కొట్టడం చట్టరీత్యా నేరం. గృహహింస అంతకన్నా నేరం. కానీ ఆ దేశంలో మహిళను, ముఖ్యంగా భార్యను కొట్టడం చట్టబద్ధం. ఇప్పటికే మహిళల చదవును నిషేధించిన ఆ దేశం ఇప్పుడు అరాచక గృహ హింసను చట్టబద్ధం చేసింది. మహిళల హక్కులను హరించింది.
గహహింసకు ఆమోదం
ఆఫ్గానిస్తాన్‌లోని తాలిబాన్ పాలకులు మతం పేరుతో అరాచక పాలన సాగిస్తున్నారు. అమెరికా సైన్యం దేశం విడిచి వెళ్లిన తర్వాత అధికారం చేపట్టిన తాలిబాన్లు.. మంత పేరుతో మహిళల హక్కులను హరిస్తున్నారు. ఇప్పటికే బాలికా విద్యను నిషేధించారు. తాజాగా గృహ హింసను చట్టబద్ధం చేశారు. భర్తలు, పురుషులు మహిళలను శారీరకంగా శిక్షించినా, ఎముకలు విరగకపోతే నేరం కాదని కొత్త చట్టం పేర్కొంది. రక్తస్రావం లేకపోతే శిక్ష లేదు. గాయాలతో బయటకు కనిపిస్తే కేవలం 15 రోజుల జైలు, అది కూడా మహిళ నిరూపించాల్సి ఉంది.
మహిళలపై ఆంక్షలు
ఇక మహిళలు భర్త అనుమతి లేకుండా బంధువుల వద్దకు వెళ్తే 3 నెలల జైలు. కోర్టులో గాయాలు చూపించేటప్పుడు పూర్తిగా కవర్ చేసుకోవాలి, బాధ్యుడైన పురుషుడు వెంట ఉండాలి. 2009 గృహహింస చట్టాన్ని పూర్తిగా రద్దు చేశారు. ఆర్టికల్ 9 ప్రకారం సమాజాన్ని ఉల్మా, అప్రాఫ్, మధ్యతరగతి, దిగువ తరగతులుగా విభజించి, నేర తీవ్రత కాకుండా వర్గం ఆధారంగా శిక్షలు నిర్ణయిస్తారు.
2021 తాలిబన్ అధికారం తర్వాత బాలికల చదువు, ఉద్యోగాలు, ఒంటరి సంచారం, సినిమాలపై పూర్తి నిషేధం. హెచ్‌ఆర్‌డబ్ల్యూ, యూఎన్‌ఏఎంఏ ఈ చట్టాన్ని ‘జెండర్ అపార్థీడ్‘ అని విమర్శిస్తూ అమలును ఆపమని కోరాయి. ఐసీసీ తాలిబన్ నేతలపై వారంట్‌లు జారీ చేసింది. అయినా అక్కడ మహిళల హక్కుల హననం ఆగడం లేదు.