Slovakia prime minister : స్లోవేకియా ప్రధానిపై కాల్పులు.. దేశాధినేతలు ఎందుకు టార్గెట్ అవుతున్నారు..?

దేశాధినేతపై ఇలాంటి దాడి జరగడం ఇది మొదటిసారి కాదు.. చివరి సారికూడా కాబోదేమో.. గతంలో భారత్ నుంచి పాకిస్తాన్ వరకు, జపాన్ నుంచి అమెరికా వరకు ఇలాంటి దాడులు జరిగాయి. దుండగుల దాడిలో మరణించిన వివిధ దేశాల ప్రధానుల గురించి తెలుసుకుందాం.

Written By: NARESH, Updated On : May 16, 2024 12:21 pm

Firing on the prime minister of Slovakia..

Follow us on

Slovakia prime minister : ఒక దేశాధినేత అంటే ఎంత సెక్యురిటీ ఉంటుంది. అతన్ని చూడాలంటేనే ఎన్నో అనుమతులు, పరీక్షలు దాటుకోని రావాల్సిందే. దేశానికి నాయకత్వం వహించడం అంటే అంత సులువు కాదు. దేశ స్థితి గతులను చూసుకునే ఆయనకు భారీ భద్రత ఉంటుంది. ఆ భద్రతను దాటు కొని మరీ దాడి చేయడం అంటే అంత సులువు కాదు. అలా చాలా మంది దేశాధినేతలు దుండగుల దాడిలో మరణించారు.

ఇటీవల సెంట్రల్ యూరప్‌లోని దేశమైన స్లోవేకియా ప్రధాని రాబర్ట్ ఫికోపై ఓ దుండగుడు తూటాల వర్షం కురిపించాడు. అతని పరిస్థితి విషమంగా ఉంది. ప్రశాంతమైన ఐరోపా దేశంలో జరిగిన ఈ ఘటన ప్రపంచాన్ని ఒక్క సారిగా కుదిపేసింది. అమెరికా నుంచి జపాన్ వరకు, రష్యా నుంచి ఫ్రాన్స్ వరకు అన్ని దేశాలు ఈ దాడిని ఖండిస్తున్నాయి.

దేశాధినేతపై ఇలాంటి దాడి జరగడం ఇది మొదటిసారి కాదు.. చివరి సారికూడా కాబోదేమో.. గతంలో భారత్ నుంచి పాకిస్తాన్ వరకు, జపాన్ నుంచి అమెరికా వరకు ఇలాంటి దాడులు జరిగాయి. దుండగుల దాడిలో మరణించిన వివిధ దేశాల ప్రధానుల గురించి తెలుసుకుందాం.

ఇందిరా గాంధీ
భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీపై కూడా ఇదే తరహాలో దాడి జరిగింది. ఆమె ఇద్దరు బాడీ గార్డ్‌లు (బియాంట్, సత్వంత్ సింగ్) 31 అక్టోబర్, 1984న ఆమె అతి సమీపం నుంచి కాల్చి చంపారు. మారణకాండ జరిపిన దుండగులు ప్రధాని నిర్వహించిన ‘ఆపరేషన్ బ్లూ స్టార్’పై ఆగ్రహంతోనే మారణహోమానికి దిగినట్లు చెప్పారు.

రాజీవ్ గాంధీ
ఇందిరా గాంధీ కుమారుడు, భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీపై కూడా ఘోరమైన దాడి జరిగింది. ఇందులో అతను మరణించాడు. నిజానికి, రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో శ్రీలంకకు శాంతి పరిరక్షక దళాన్ని పంపారు. దీనిపై శ్రీలంక తమిళ తిరుగుబాటు సంస్థ లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం (ఎల్టీటీఈ) ఆగ్రహం వ్యక్తం చేసింది. 21 మే, 1991న చెన్నైలోని శ్రీపెరంబుదూర్‌లో LTTE అతనిపై ఆత్మాహుతి దాడి చేసింది, అందులో అతను ప్రాణాలు కోల్పోయాడు.

లియాఖత్ అలీ ఖాన్
పాకిస్తాన్ ప్రధాని లియాఖత్ అలీ ఖాన్ 16 అక్టోబర్, 1951న హత్యకు గురయ్యాడు. రావల్పిండిలోని కంపెనీ బాగ్‌లో జరిగిన ర్యాలీలో ఆయన ప్రసంగిస్తుండగా హత్య జరిగింది. ఈ హత్యలో ఆసక్తి కరమైన విషయం ఏంటంటే ఇంటెలిజెన్స్ అధికారులకు కేటాయించిన ప్రదేశం నుంచి దుండగుడు దాడి చేయడం.

బెనజీర్ భుట్టో
లియాఖత్ అలీ ఖాన్ తర్వాత పాకిస్తాన్ మొదటి మహిళా ప్రధాని బెనజీర్ భుట్టో కూడా 27 డిసెంబర్, 2007న హత్యకు గురయ్యారు. రావల్పిండిలో ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత దుండగుడు ఆమెను హత్య చేశాడు. నిజానికి బెనజీర్ ఎన్నికల ర్యాలీలో ప్రసంగించి ఇంటికి తిరిగి వస్తుండగా.. ఆమెకు అతి సమీపంలోకి వచ్చిన వ్యక్తి ఆమెపై కాల్పులు జరిపాడు. ఆ తర్వాత దుండగుడు తుపాకీతో కాల్చుకొని సూసైడ్ చేసుకున్నాడు.

షేక్ ముజిబుర్ రెహమాన్
బంగ్లాదేశ్ ఏర్పడినప్పటి నుంచి (26 మార్చి, 1971) రాజకీయ పరిస్థితి గందరగోళంతో నిండి ఉంది. పాకిస్తాన్ తో యుద్ధం చేసి బంగ్లాదేశ్‌కు స్వాతంత్రం తేవడంలో కీలక పాత్ర పోషించిన షేక్ ముజిబుర్ రెహమాన్ పాకిస్తాన్ లోనే హత్య చేశారు. ఆగస్ట్ 15, 1975న షేక్‌ను అతని కుటుంబంతో సహా హత్య చేశారు. అతని కుమార్తెలు ఇద్దరూ ఆ సమయంలో బంగ్లాదేశ్‌కు దూరంగా ఉన్నారు. దాడి నుంచి బయటపడారు. వారిలో ఒకరే బంగ్లాదేశ్ ప్రస్తుత ప్రధాని షేక్ హసీనా ముజిబుర్ రెహమాన్ కుమార్తె.

షింజో అబే
జపాన్ మాజీ ప్రధాని షింజో అబే కూడా జూలై 8, 2022న జరిగిన దాడిలో హతమయ్యారు. షింజో అబే నారా నగరంలో ర్యాలీలో ప్రసంగిస్తున్నప్పుడు కాల్పులు జరిపారు. దుండగుడు అతనిపై రెండు బుల్లెట్లు కాల్చాడు. ఒక బుల్లెట్ అతని ఛాతిలోంచి వెళ్లగా, మరోటి మెడకు తగిలింది. బుల్లెట్ తగలగానే అబే రోడ్డుపై పడిపోయాడు. వెంటనే హాస్పిటల్ కు తీసుకెళ్లినా ప్రాణాలను కాపాడలేకపోయారు.

జాన్ ఎఫ్ కెన్నెడీ
ప్రపంచానికి అగ్రగామిగా చెప్పుకునే అమెరికాలో కూడా దేశ అధ్యక్షుడిపై దాడి జరిగింది. అమెరికా 35వ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నెడీ నవంబర్ 22, 1963న హత్యకు గురయ్యారు. కెన్నెడీ తన ఓపెన్ కారులో వెళ్తున్నాడు. ఈ సమయంలో దుండగుడు అతడిపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో కెన్నెడీ మరణించాడు. అయితే కెన్నెడీ మద్దతుదారుడి చేతిలో దుండగుడు రెండు రోజుల్లో మరణించాడు.

రణసింగ్ ప్రేమదాస
శ్రీలంక దేశాధినేతపై కూడా హత్యాకాండ కొనసాగింది. 1 మే, 1993న జరిగిన ఆత్మాహుతి దాడిలో దేశ మూడో రాష్ట్రపతి రణసింగ్ ప్రేమదాస మరణించారు. భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని హత్య చేసిన ఎల్టీటీ ఈ ప్రేమదాసను టార్గెట్ చేసింది. రణసింఘే ప్రమదాస కొలంబోలో ర్యాలీ నిర్వహిస్తున్నప్పుడు ఆత్మాహుతి దాడిలో ప్రాణాలు కోల్పోయాడు.