Tenzing: హాలీవుడ్ తెరపై ఎన్నో అడ్వెంచర్ జానర్స్ కి సంభందించిన సినిమాలు తెరకెక్కించారు. రియల్ స్టోరీలు కాకుండా ఫిక్షనల్ కథలను రాసుకొని వాటిని రూపొందించి సక్సెస్ లను సాధించారు. కానీ మొదటిసారి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన ఒక సాహస యాత్రని హాలీవుడ్ తెరపై చిత్రీకరించబోతున్నట్టుగా తెలుస్తుంది… అయితే ఒకానొక సందర్భంలో ఆ శిఖరాన్ని ఎవరు అధిరోహించలేరు అని ఒక నమ్మకమైతే కొంతమందికి వచ్చింది.
ఇక ఆ తర్వాత వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేస్తూ ఎలాగైనా సరే దాన్ని అధిరోహించి వాళ్లు నమ్ముతున్న నిజాన్ని అబద్ధం చేయాలనే ఉద్దేశ్యంతో న్యూజిలాండ్ కి చెందిన ఎడ్మండ్ హిల్లరీ, నేపాల్ కి చెందిన టెన్జింగ్ నార్గే అనే ఇద్దరు వ్యక్తులు 1953 వ సంవత్సరం లో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొదటి వ్యక్తులు గా చరిత్ర లో నిలిచిపోయారు. ఇక వీళ్ళ సాహసాన్ని ప్రపంచానికి పరిచయం చేయాలనే ఉద్దేశ్యం తోనే ఇప్పుడు హాలీవుడ్ లో ‘టెన్జింగ్’ అనే టైటిల్ తో ఒక సినిమా తెరకెక్కబోతుంది.
ఇక ఇప్పటికే ఈ సినిమాలో నటించడానికి కొంతమంది క్యారెక్టర్ లను కూడా సెలెక్ట్ చేశారు. ఎడ్మండ్ పాత్ర కోసం హిడిల్ స్టన్ ను ఎంపిక చేశారు. ఇక ఇంకా కొన్ని పాత్రల కోసం మరి కొంత మందిని సెలెక్ట్ చేసే పనిలో ఉన్నారు. ఇక టెన్జింగ్ పాత్ర కోసం ఇంకా ఎవరిని సెలెక్ట్ చేయలేదు…ఇక ఈ సినిమాకి ‘జెన్నిఫర్ పీడోమ్’ దర్శకుడిగా వ్యవహరించనుండగా, ‘ల్యూక్ డెవిస్ ‘ ఈ సినిమాకి స్క్రిప్ట్ ను సమకూరుస్తున్నాడు… ఇక జెన్నిఫర్ పీడమ్ 2015 వ సంవత్సరం లో ‘ షేర్పా’ అనే పేరుతో ఒక డాక్యుమెంటరీని తెరకెక్కించాడు.
ఇక మొత్తానికైతే ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడానికి వాళ్ళిద్దరూ ఎంత కష్టపడ్డారు అనేది మనం ఇప్పటివరకు చదువుతూనే ఉన్నాం. కానీ మొదటిసారి ప్రపంచ స్థాయిలో హాలీవుడ్ స్క్రీన్ మీద చూడబోతున్నాం అంటూ మరి కొంతమంది ఈ సినిమా అనౌన్స్ చేసిన తర్వాత ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు…