US Presidential Elections: అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అమెరికా అధ్యక్ష అభ్యర్థుల డిబేట్ వాడీవేడిగా జరిగింది. పెన్సిల్వేనియాలోని నేషనల్ కానిస్టి్టట్యూషన్ సెంటర్ వేదికగా రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ మధ్య జరిగిన తొలి సంవాదంలో ఇరువురు పరస్పరం విమర్శల దాడికి దిగారు. అగ్రరాజ్య ఆర్థిక వ్యవస్థ, వలసలు, గర్భవిచ్చిత్తి తదితర కీలక అంశాలపై మాటల అస్త్రాలు సంధించుకున్నారు.
’అబార్షన్ల’పై వాగ్వాదం..
చర్చ ఆరంభంలో దేశ ఆర్థికవ్యవస్థ గురించి హారిస్, ట్రంప్ మధ్య వాగ్వాదం జరిగింది. తర్వాత అబార్షన్ల అంశంపై ఇద్దరూ వాడీవేడిగా వాదనలు వినిపించారు. ‘మహిళల అభివృద్ధి ట్రంప్‌కు గిట్టదు. అబార్షన్లపై ఆయన నిషేధం విధించాలనుకుంటున్నారు. అత్యాచారాల వంటి కేసుల్లోనూ మహిళలకు ఎలాంటి మినహాయింపు ఇవ్వాలనుకోవడం లేదు. ఇది మహిళలను అవమానించడమే..! ఆయన అధ్యక్షుడిగా ఎన్నికైతే జాతీయ అబార్షన్ల నిషేధంపై సంతకం చేస్తారు. గర్భవిచ్ఛిత్తిపై మహిళలే నిర్ణయం తీసుకోగలరు. సరైన నిర్ణయాలు తీసుకొనే సామర్థ్యం వారికి ఉంటుంది. అమెరికా ప్రజలు స్వేచ్ఛాప్రియులు‘ అని హారిస్ అన్నారు. దీనికి ట్రంప్ ఘాటుగా బదులిచ్చారు. ‘ఆమె అబద్ధం చెబుతున్నారు. గర్భవిచ్ఛిత్తి పై నిషేధానికి నేను అనుకూలం కాదు. ఆ బిల్లుపై సంతకం చేయబోను‘ అని చెప్పారు. అయితే, ఎనిమిది, తొమ్మిది నెలల్లో గర్భవిచ్చిత్తి ఎలా చేస్తారని, దానికి మాత్రం తాను అనుకూలం కాదని స్పష్టంచేశారు.
ఆమె మార్క్సిస్ట్.. ఆయన డిక్టేటర్
డిబేట్‌లో భాగంగా మాజీ అధ్యక్షుడు ట్రంప్… కమలా హారిస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. కరోనా కాలంలోనూ దేశ ఆర్థికవ్యవస్థను నిలబెట్టానన్నారు. తన హయాంలో అమెరికాలో ద్రవ్యోల్బణం లేదని తెలిపారు. బైడెన్ అధికారంలోకి వచ్చాక అమెరికాను చైనా చీల్చిచెండాడుతోందని పేర్కొన్నారు. కమలా హారిస్ పెద్ద మార్క్సిస్ట్ అని, బైడెన్–హారిస్ ఆర్థిక వ్యవస్థను నాశనం చేశారని ఆరోపించారు. దేశ ఆర్థికవ్యవస్థ అన్ని వర్గాలకు విపత్తుగా మారిందని ట్రంప్ దుయ్యబట్టారు. దీనికి హారిస్ బదులిస్తూ.. ‘అమెరికా ఆర్ధిక వ్యవస్థను ట్రంప్ చిన్నాభిన్నం చేశారు. ఆయన హయాంలో దేశం ద్రవ్యలోటు ఎదుర్కొంది. ట్రంప్ తప్పిదాలను బైడెన్, తాను సరిచేశామన్నారు. ట్రంప్ వద్ద పారదర్శకత లేదని, అమెరికాను చైనాకు అమ్మేశారని ఆరోపించారు. తాము చిరు వ్యాపారులు, కుటుంబాలకు సాయం చేస్తామని, బిలియనీర్లు. కార్పొరేట్లకు ట్రంప్ పన్నులు తగ్గిస్తారని పేర్కొన్నారు.. దీంతో అమెరికాకు 5 ట్రిలియన్ డాలర్ల లోటు ఏర్పడుతుందని తెలిపారు. ్టార్టప్‌ల కోసం పన్నులు తగ్గించేందుకు మా వద్ద ప్రణాళిక ఉంది కమలా వివరించారు.
ఇజ్రాయెల్, ఉక్రెయిన్ యుద్ధాలపైనా..
ఇజ్రాయెల్ అంటే హారిస్‌కు నచ్చదన్నారు ట్రంప్. ఆమె అధ్యక్షురాలిగా ఎన్నికైతే రెండేళ్లలో ఆ దేశం కనుమరుగవుతుందని జోష్యం చెప్పారు. బైడెన్ విధానాల కారణంగా అటు ఉక్రెయిన్లోనూ లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. తాను అధికారంలోకి వస్తే రష్యా–ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేలా చేస్తానని తెలిపారు. ఇక వలసదారులపై ట్రంప్ మాట్లాడుతూ.. వారంతా పెంపుడు జంతువులను తింటున్నారని విమర్శించారు.
దీనికి హారిస్ దీటుగా బదులిచ్చారు. ఇజ్రాయెల్‌కు తమను తాము రక్షించుకునే హక్కు ఉందని తెలిపారు. కానీ, ఈ యుద్ధం ముగియాలని తాము కోరుకుంటున్నామన్నారు. ట్రంప్ నియంతలను ఆరాధిస్తారు. కిమ్ జోంగ్ ఉన్‌కు ఆయన ’ప్రేమలేఖలు’ రాశారు. ఒకవేళ ఇప్పుడు ట్రంప్ అధికారంలో ఉండి ఉంటే.. రష్యా అధ్యక్షుడు పుతిన్ కీవ్ (ఉక్రెయిన్ రాజధాని)లో కూర్చునేవారన్నారు. ఆయన తాలిబన్లతోనూ చర్చలు జరిపారు. ప్రపంచ నేతలు ఆయనను చూసి నవ్వుతున్నారని ఎద్దేవా చేశారు. అమెరికా ప్రజలను విభజించేందుకు ఆయన విద్వేషాలను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు.
షేక్ హ్యాండ్ మొదలై..
డిబేట్ ప్రారంభంలో వీరిద్దరూ పలకరించుకుని షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. గత కొన్నేళ్లలో జరిగే సంవాదాల్లో అధ్యక్ష అభ్యర్థులెవరూ ఇలా డిబేట్‌కు ముందు షేక్ హ్యాండ్ ఇచ్చుకోలేదు. వీరిద్దరూ ఆ సంప్రదాయానికి తెరతీశారు. ఆ తర్వాత మాటల యుద్ధం మొదలైంది. బైడెన్ పాలనలో తుపాకీ సంస్కృతి పెరగడం వల్లే తనపై హత్యాయత్నం జరిగిందని ట్రంప్ ఆరోపించారు. దీన్ని హారిస్ ఖండించారు. మాజీ అధ్యక్షుడు అన్నీ అబద్ధాలు చెబుతున్నారని దుయ్యబట్టారు.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Fight between trump and kamala harris in the first debate
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com