Prisoners Released: ప్రపంచ పాండమిక్ గుర్తుందా.. అదేనండీ కొవిడ్-1999. కొవిడ్ వ్యాప్తి మొదలైందో లేదో.. ప్రపంచం అల్లకల్లోలంగా మారింది. లక్షలాది మరణాలు సంభవించాయి. మరణాల సంఖ్యను ప్రకటించేందుకు ఆయా దేశాలు తీవ్ర ఆందోళనకు గురయ్యాయి. ఇవన్నీ ఐదేళ్ల క్రితం కళ్ల ముందు కనిపించిన సీన్లే. ఈ సమయంలోనే ప్రపంచంలోని వివిధ దేశాల్లో జైళ్లలో ఉన్న ఖైదీలను బయటకు విడిచిపెట్టారు. వారు కూడా బయటకు వెళ్లాలంటే భయంతో వణికిపోయారు. బయటకు వెళ్లిన వారిలో ఎవరు ఏమయ్యారన్నది తర్వాత. ఇంతటి పాండమిక్ సిచ్యువేషన్ కాకున్నా.. యూకేలో ఇప్పుడు జైళ్లలో ఉన్న 5500 మందిని రిలీజ్ చేయాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఖైదీలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా 1,700 మంది ఖైదీలు ఉదయాన్నే (సెప్టెంబర్ 11-బుధవారం) విడుదల చేసింది. కారణం ఏమని చెప్పిదంటే.. ఇంగ్లాండ్, వేల్స్ జైళ్లలో దీర్ఘకాలిక రద్దీ తగ్గించే లక్ష్యంతో, యూకేలో 1,700 మందికి పైగా ఖైదీలను విడుదల చేసినట్లు పేర్కొన్నాయి. ఈ నిర్ణయం కొత్తగా ఎన్నికైన లేబర్ పరిపాలన ప్రారంభించింది. అసలు ఈ ప్రతిపాదన గత కన్జర్వేటివ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. దీన్ని ఇప్పటి లేబర్ ప్రభుత్వం అమలు చేసింది.
యూకే వ్యాప్తంగా 5,500 జైలు పడకలను ఖాళీ చేసే ప్రయత్నంలో ఖైదీలను రిలీజ్ చేస్తున్నారు. 50%, 40% శిక్ష అనుభవించిన వారు మాత్రమే బయటకు వెళ్లేందుకు అనుమతిస్తున్నారు. అయితే ఇందులో లైంగిక నేరాలు, ఉగ్రవాదం, హింసాత్మక వేధింపులు వంటి తీవ్రమైన నేరాలకు పాల్పడిన వారు ఈ విడుదలకు అనర్హులుగా ప్రభుత్వం పేర్కొంది.
ప్రభుత్వ విధానాన్ని కొందరు తప్పుపడుతున్నారు. క్రిమినల్ జస్టిస్ వ్యవస్థలో రివాల్వింగ్ డోర్ అవకాశం ఉందని హెచ్ఎంపీ చీఫ్ ఇన్ స్పెక్టర్ ఆఫ్ ప్రిజన్స్ చార్లీ టేలర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఖైదీలు విడుదల ముందు తగిన పునరావాసం ఉండదని, ఇంతమంది ఖైదీలు ఒకేసారి బయటకు రావడం చాలా రిస్క్ తో కూడుకుందని టేలర్ స్కై న్యూస్ తో అన్నారు.
యూకే న్యాయ కార్యదర్శి షబానా మహ్మద్ ఈ వివాదాస్పద నిర్ణయాన్ని సమర్థించారు, ‘మేము పతనం అంచున ఉన్న జైలు వ్యవస్థను వారసత్వంగా పొందాం. ఇది మేము కోరుకున్న మార్పు కాదు, కానీ ఇది మాత్రమే మిగిలి ఉన్న ఎంపిక. ప్రత్యామ్నాయం ఊహకు కూడా అందనిది.’ అని వ్యాఖ్యానించారు.
ఈ రోజు విడుదల చేసిన 1,700 మంది ఖైదీలతో పాటు, అక్టోబర్ లో మరో 2,000 మంది ఖైదీలు విడుదలవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇది ప్రజా భద్రత, ప్రొబేషన్ సేవలపై ఒత్తిడి గురించి మరింత ఆందోళనలను రేకెత్తిస్తుంది. ప్రస్తుతానికి, ఇంగ్లాండ్, వేల్స్ ఈ పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నాయి, ఎందుకంటే జైలు నుంచి ఖైదీలను విడిచిపెట్టేందుకు ప్రభుత్వం చేసిన ప్రయత్నం సమాజానికి మేలు చేస్తుందా? లేదంటే కీడు చేస్తుందా? వేచి చూడాలి.
Mahendra is a Senior Political Content writer who has very good knowledge on Business stories. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: A sensational decision by the uk government to release 5500 people from prisons
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com