India strikes on Pakistan: రష్యా మీద అమెరికా యుద్ధం చేయలేదు. చైనా మీద కూడా చేయలేదు. చివరికి ఇజ్రాయిల్ జోలికీ వెళ్లలేదు. కారణం ఆ దేశాలలో న్యూక్లియర్ వెపన్స్ ఉండడమే.. మన దేశంలో న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. ఇటీవల ఆ వివరాలను మన దేశమే ప్రకటించింది.. మేము ఎవరి మీద బాంబులు వేయము. మాకు ఆ అవసరం లేదు. ఒకవేళ బాంబులు వేస్తే.. ఆ తర్వాత కథ వేరే విధంగా ఉంటుందని హెచ్చరించింది.
వాస్తవానికి మన దేశం న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయడం అమెరికాకు ఏమాత్రం ఇష్టం లేదు. గతంలో న్యూక్లియర్ టెస్టులు జరిగినప్పుడు అమెరికా అనేక విధాలుగా అడ్డుకుంది. అమెరికా అడ్డు పుల్ల వేయడంతో ఇందిరాగాంధీ హయాంలో న్యూక్లియర్ టెస్టులు ఆగిపోయాయి. కానీ అటల్ బిహారీ వాజ్ పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు న్యూక్లియర్ టెస్ట్లు చేశారు. అమెరికా అనేక రకాలుగా ఆంక్షలు విధించినప్పటికీ ఏమాత్రం లెక్కపెట్టలేదు. పైగా నాడు ప్రధానమంత్రి హోదాలో అటల్ జీ అమెరికాకు స్పష్టమైన సంకేతాలు పంపించారు.
“మాకు చుట్టూ శత్రు దేశాలు ఉన్నాయి. కాబట్టి మమ్మల్ని మేము కాపాడుకోవడం అవసరం. మేము వేరే దేశాల మీద బాంబులు వేసే వాళ్ళం కాదు. మా మీద బాంబులు వేస్తే ఊరుకునే రకం కూడా కాదు. మా సెల్ఫ్ డిఫెన్స్ కోసం మేము ఆయుధాలు తయారు చేసుకుంటున్నాం. దాన్ని కూడా కాదనే అధికారం మీకు లేదంటూ” అటల్ ప్రశ్నించారు..
ఇక ఇటీవల ఆపరేషన్ సింధూర్ జరుగుతున్నప్పుడు మన దేశానికి సంబంధించిన మిస్సైల్స్ పాకిస్తాన్ మీద దాడి చేశాయి. ముఖ్యంగా పాకిస్తాన్ తయారుచేసిన న్యూక్లియర్ వెపన్స్ ప్రాంతంలో ఎంట్రీ లెవెల్ గేట్లను బద్దలు కొట్టాయి. అంతేకాదు న్యూక్లియర్ రిఫరెన్స్ స్టోర్ చేసే ప్రాంతంలో అనేక వ్యవస్థలను నాశనం చేశాయి. దీనిని పాకిస్తాన్ బయట పెట్టలేదు. కానీ సి ఐ ఏ పరిశీలనలో తేలింది. అంతేకాదు సిఐఏ ఇచ్చిన తాజా నివేదిక అమెరికాకు చుక్కలు చూపించింది.
బాంబులతో దాడి కాదు.. బాంబులు చూపించి ప్రపంచాన్ని భయపెట్టిన దేశంగా భారత్ నిలిచిందని.. భారత్ విషయంలో అమెరికా అడ్డగోలుగా ప్రవర్తిస్తే తర్వాతి పరిణామాలు వేరే విధంగా ఉంటాయని సిఐఏ హెచ్చరించినట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో ఏకకాలంలో అటు పాకిస్తాన్ దేశానికి.. ఇటు అమెరికాకు భారత్ స్పష్టమైన హెచ్చరికలు పంపినట్టు తెలుస్తోంది. ఇప్పటికైనా పాకిస్తాన్ అదుపులో ఉంటే మంచిదని జాతీయవాదులు చెబుతున్నారు. అమెరికా కూడా అనవసరమైన విషయాలలో కలగజేసుకుంటే పరిస్థితి వేరే విధంగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు.
