Epstein Files Bill Gates: బిల్ గేట్స్.. మైక్రోసాఫ్ట్ అధినేతగా ఈయన ప్రపంచానికి సుపరిచితమైన వ్యక్తి. ప్రపంచ దేశాలలో ఐటీ కార్యకాలాపాలు సాగిస్తూ.. లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నారు. అనేక దేశాల ఆర్థిక స్థిరత్వానికి తనవంతుగా కృషి చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా తొలిసారి ఐటీ కార్యకలాపాల ద్వారా భారీగా లాభాలు సంపాదించి.. అత్యంత శ్రీమంతుడిగా ఎదిగారు బిల్ గేట్స్.
బిల్ గేట్స్ వ్యాపారం మాత్రమే కాదు.. భారీగా సేవా కార్యక్రమాలు చేసిన వ్యక్తిగా కూడా పేరుపొందారు. తన మాజీ భార్య మెలిందా గేట్స్ తో కలిసి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్యంగా ఆఫ్రికా ఖండంలో పేద దేశాలకు ఆహారాన్ని, ఔషధాలను సరఫరా చేశారు. ప్రకృతి విపత్తుల సమయంలో చాలా దేశాలకు బిల్ గేట్స్ అండగా నిలిచారు. సతీమణితో విడిపోయిన తర్వాత.. సంస్థలో పనిచేస్తున్న ఓ మహిళతో ఆయన సహజీవనం చేస్తున్నట్టు ఇటీవల వార్తలు వచ్చాయి. గత ఏడాది ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహానికి బిల్ గేట్స్ హాజరయ్యారు. ప్రత్యేక విమానంలో ముంబై వచ్చి ఆ వేడుకలో భాగమయ్యారు.
బిల్ గేట్స్ నిత్యం వార్తలలోనే ఉంటారు. అయితే ఇప్పుడు ఆయనకు సంబంధించిన ఒక విషయం ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. బిల్ గేట్స్ సుఖ వ్యాధి బారిన పడ్డారని వార్తలు వస్తున్నాయి. బిల్ గేట్స్ రష్యన్ యువతులతో గడిపారని.. ఆయనకు సుఖ వ్యాధి సోకిందని ఎప్ స్టీన్ రాసుకున్న మెయిల్స్ ద్వారా బయటపడింది. ఈ విషయాన్ని బిల్ గేట్స్ బయటపడకుండా దాచారని.. తన మాజీ భార్యకు యాంటి బయాటిక్స్ ఇవ్వాలని ప్రయత్నించారని తెలుస్తోంది.
మరోవైపు ఈ ఆరోపణలను బిల్ గేట్స్ ఖండించారు. తనను ఇబ్బంది పెట్టడానికి ఎప్ స్టీన్ ఇలాంటి చవకబారు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. అసలు తన అంతర్గత విషయాలు బయట పెట్టడం ఎంతవరకు సమంజసమని బిల్ గేట్స్ చెబుతున్నారు. ” ఒక వ్యక్తిని కించపరచడానికి ఎంతవరకైనా వెళ్తారనేది ఈ ఉదంతం బయటపెడుతోంది. ఇదంతా సరైన వ్యవహారం కాదు. ఏదో మెయిల్స్ ద్వారా భయపెట్టాలి అనుకుంటే అంతకుమించిన హాస్యాస్పదమైన సంఘటన మరొకటి ఉండదని” బిల్ గేట్స్ పేర్కొన్నారు.