https://oktelugu.com/

Canada  : కెనడా కాలేజీల్లో ఏం జరుగుతోంది.. నిఘా పెట్టిన ఈడీ! కారణం అదే

విదేశీ విద్య ఇప్పుడు ప్యాషన్‌గా మారింది. దీంతో ఏటా వేల మంది భారతీయులు ఉన్నత చదువుల కోసం ఫాన్‌కు వెళ్తున్నారు. అమెరికా, యూకే, కెనడా, ఆస్ట్రేలియా బాట పడుతున్నారు. అక్కడే చదివి, అక్కడే ఉద్యోగాలు చేస్తున్నారు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : December 26, 2024 / 02:00 AM IST

    Canada

    Follow us on

    Canada  :  భారతీయుల్లో విదేశాల్లో చదువుకోవాలన్న ఆసక్తి ఏటేటా పెరుగుతోంది. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు విదేశాల్లో చదువుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. ఈ క్రమంలో ఒకప్పుడు సంపన్నులు మాత్రమే విదేశాలకు వెళ్లేవారు. కానీ, ఇప్పుడు మిడిల్‌ క్లాస్‌ పిల్లలు కూడా ప్రతిభతోపాటు ఆర్థికంగా కొంత సమకూర్చుకుని విదేశాలకు వెళ్తున్నారు. దీంతో ఏటేటా విదేశాలకు వెళ్లేవారి సంఖ్య పెరుగుతోంది. అయితే కొందరు వీసా రాకపోవడంతో అడ్డదారిని ఆశ్రయిస్తున్నారు. అక్రమంగా విదేశాలకు వెళ్తున్నారు. ఇందుకు కూడా పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తున్నారు. కానీ అక్కడ పట్టుబడి జైలుపాలవుతున్నారు. ఎన్నో ఆశలతో వెళ్లి.. ఖైదీల్లా జైళ్లలో మగ్గుతున్నారు. ఈ నేపథ్యంలో అక్రమంగా విదేశాలకు వెళ్తున్న విద్యార్థులతో భారీగా డబ్బులు చేతులు మారుతోందని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ గుర్తించింది. మనీ లాండరింగ్‌పై దర్యాప్తు చేస్తోంది. ఇందులో భాగంగా కెనడాలోని కొన్ని కాలేజీలు భారత సంస్థల పాత్రపై విచారణ చేపట్టినట్లు దర్యాప్తు సంస్థ వెల్లడించింది. 2022, జనవరి 19న గుజరాత్‌కు చెందిన ఓ కుటుంబం క ఎనడా సరిహద్దు నుంచి అక్రమంగా అమెరికాకు వెళ్తూ తీవ్రమైన శీతల వాతావరణం కారణంగా మరణించింది. ఈ కేసును ఆధారంగా చేసుకుని ఈడీ దర్యాప్తు చేపట్టింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు భవేష్‌ పటేల్‌తోపాటు మరికొందరిపైనా మనీలాండరింగ్‌ చట్టం కింద కేసు నమోదు చేశారు.

    అక్రమ వలసలపై ట్రంప్‌ సీరియస్‌..
    దేశంలోకి అక్రమ వలసలను నిరోధించడంపై అమెరికా కాబోయే అధ్యక్షుడు ట్రంప్‌ దృష్టి పెట్టారు. ప్రధానంగా కెనడా నుంచి వలసలు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. వలసలు నిరోధించకపోతే అమెరికా 51వ రాష్ట్రంగా చేరిపోవాలని సూచించారు. ఈ నేపథ్యంలో కెనడా ప్రభుత్వం వలసల నిరోధంపై దృష్టి పెట్టింది. ఈ క్రమంలో ఈడీ తాజాగా అక్రమ వలసలపై దృష్టిసారించింది. నిందితులు మానవులను అక్రమంగా తరలించే సంస్థలతో కలిసి కుట్ర పన్ని భారత ప్రజలను సరిహద్దులు దాటిస్తున్నట్లు గుర్తించింది.

    వారిని ట్రాప్‌ చేస్తూ..
    విదేశాల్లో చదువుకోవాలనుకునే విద్యార్థులనే కొన్ని సంస్థలు టార్గెట్‌ చేస్తున్నయి. కెనడా, అమెరికా వెళ్లేవారిని బుట్టలో వేసుకుని అక్రమ మార్గంలో పంపేలా చూస్తున్నాయి. ఇందుకు రూ.55 లక్షల నుంచి రూ.60 లక్షల వరకు వసూలు చేస్తున్నాయి. ఇక కొందరు స్టూడెంట్‌ వీసాపై కెనడాకు వెళ్లి.. అక్కడి విశ్వవిద్యాలయాల్లో చేరకుండా అక్రమంగా అమెరికాకు వెళ్తున్నారు. ఈ సమాచారం సేకరణలో ఈడీ ముంబై, నాగ్‌పూర్, గాంధీ నగర్‌ వంటి 8 ప్రదేశాల్లో సోదాలు చేసింది. విదేశీ యూనివర్సిటీల్లో ప్రవేశం ఇప్పించిన ముంబై, నాగపూర్‌కు చెందిన సంస్థలను గుర్తించింది. వీరు ఏటా 35 వేల మందిని విదేశాలకు పంపుతున్నట్లు నిర్ధారించింది.